TV9 Network: ఇండియన్ టైగర్స్ అండ్ టైగ్రెస్స్ టాలెంట్ హంట్‌‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా మహానార్యమన్ సింధియా

|

Sep 10, 2024 | 2:59 PM

TV9 నెట్‌వర్క్‌ ఆధ్వర్యంలో ‘ఇండియన్ టైగర్స్ అండ్ ఇండియన్ టైగ్రెస్స్’ ఫుట్‌బాల్ టాలెంట్ హంట్ కు శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే.. బుండెస్లిగా, DFB-పోకల్‌ల సహకారంతో, TV9 నెట్‌‌వర్క్ ఈ ప్రత్యేక కార్యక్రమం ద్వారా బాలబాలికల్లో ఫుట్‌బాల్‌ క్రీడలో ప్రతిభను వెలికితీసే ప్రయత్నాన్ని కొనసాగిస్తోంది.

TV9 Network: ఇండియన్ టైగర్స్ అండ్ టైగ్రెస్స్ టాలెంట్ హంట్‌‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా మహానార్యమన్ సింధియా
Barun Das, MD and CEO of TV9 Network and Mahanaaryaman Scindia
Follow us on

TV9 నెట్‌వర్క్‌ ఆధ్వర్యంలో ‘ఇండియన్ టైగర్స్ అండ్ ఇండియన్ టైగ్రెస్స్’ ఫుట్‌బాల్ టాలెంట్ హంట్ కు శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే.. బుండెస్లిగా, DFB-పోకల్‌ల సహకారంతో, TV9 నెట్‌‌వర్క్ ఈ ప్రత్యేక కార్యక్రమం ద్వారా బాలబాలికల్లో ఫుట్‌బాల్‌ క్రీడలో ప్రతిభను వెలికితీసే ప్రయత్నాన్ని కొనసాగిస్తోంది. ఈ క్రమంలో ఇండియన్ టైగర్స్ అండ్ టైగ్రెస్స్ టాలెంట్ హంట్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా మహానార్యమన్ సింధియా వ్యవహరించనున్నారు. ఈ మేరకు TV9 నెట్‌వర్క్ అధికారికంగా ప్రకటించడం ఆనందంగా ఉంది. సింధియా బోర్డులోకి రావడంతో, భారతదేశం తన ఫుట్‌బాల్ కలను సాకారం చేసుకోవడానికి సిద్ధమవుతోందని.. టీవీ9 నెట్‌వర్క్ పేర్కొంది. ఇండియన్ టైగర్స్ అండ్ టైగ్రెస్‌ టాలెంట్ హంట్ అనేది భారతదేశంలో ఫుట్‌బాల్‌ ఆటను మార్చే దిశగా ఇది మొదటి చొరవ.. బుండెస్లిగా, DFB-Pokal, యూరోపియన్ సంస్థల భాగస్వామ్యంతో, ఈ కార్యక్రమం యువ ఫుట్‌బాల్ ఆటగాళ్లకు అసమానమైన అవకాశాన్ని అందిస్తుంది. భారతీయ ఫుట్‌బాల్ భవిష్యత్తును రూపొందించే లక్ష్యంతో మహానార్యమణ్ సింధియా బ్రాండ్ అంబాసిడర్‌గా చేరడంతో ఈ కార్యక్రమం మరింత ముందుకుసాగనుంది. ఈ టాలెంట్ హంట్ 100,000 పాఠశాలలకు పైగా చేరుకోవడానికి ప్రయత్నిస్తుంది. ఇది యువ క్రీడాకారులకు అంతర్జాతీయ వేదికపై ప్రకాశించే అవకాశాన్ని అందిస్తుంది.

ఈ కార్యక్రమం ద్వారా భారతదేశంలోని 20 మంది బాలురు, 20 మంది బాలికలను గుర్తించి వారికి జర్మనీ, ఆస్ట్రియాలో ఫుట్‌బాల్ శిక్షణను అందిస్తుంది. ఈ యువ ప్రతిభావంతులు యూరోపియన్ క్లబ్‌లతో పోటీపడతారు.. వారికి మంచి శిక్షణతోపాటు అమూల్యమైన అనుభవాన్ని అందిస్తారు. నవంబర్‌లో, ఈ అథ్లెట్లను అంతర్జాతీయ వేదికపై మెరిసే అవకాశం ఇవ్వనున్నారు.

ఫుట్‌బాల్, యూత్ డెవలప్‌మెంట్ పట్ల మక్కువ ఉన్న మహానార్యమన్ సింధియా ఈ పాత్రకు సహజంగా సరిపోతారు. అతని ప్రమేయం కేవలం ప్రతిభను కనుగొనడమే కాకుండా దానిని పెంపొందించడం, భారత ఫుట్‌బాల్ భవిష్యత్తుకు మార్గం సుగమం చేయడం అనే చొరవ.. లక్ష్యాన్ని బలపరుస్తుంది.

“ఫుట్‌బాల్ నా హృదయానికి దగ్గరగా ఉంది. మన దేశంలో ఏ విధంగా ఉందో నేను ప్రత్యక్షంగా చూశాను. ఇండియన్ టైగర్స్ అండ్ టైగ్రెస్స్ అనేది యువ ఆటగాళ్లకు సువర్ణఅవకాశం అందించే ప్రత్యేక కార్యక్రమం, అందులో భాగమైనందుకు నేను సంతోషిస్తున్నాను” అని మహానార్యమన్ సింధియా అన్నారు. “ఇది పిల్లలకు వేదికను అందించడం మాత్రమే కాదు, ప్రపంచ స్థాయిలో విజయం సాధించడానికి వారికి సాధనాలు.. అవకాశాలను అందిస్తుంది” అని చెప్పారు.

మహానార్యమన్ సింధియా ఉత్సాహాన్ని ప్రతిధ్వనిస్తూ.. TV9 నెట్‌వర్క్ MD, CEO బరున్ దాస్ మాట్లాడుతూ.. గ్రేట్ ఇండియన్ ఫుట్‌బాల్ డ్రీమ్‌కు మద్దతు ఇవ్వడానికి తాము కట్టుబడి ఉన్నట్లు తెలిపారు. ‘ఇండియన్ టైగర్స్ అండ్ టైగ్రెస్స్’ తన కలల ప్రాజెక్ట్ అన్నారు. అసాధారణమైన యువ ఫుట్‌బాల్ క్రీడాకారులను ఆవిష్కరించడం, పెంపొందించడం అనే లక్ష్యంతో ఈ కార్యక్రమం చేపట్టామని.. మహానార్యమన్ సింధియా తమతో చేరడం.. అసాధారణమైన యువత అనుసంధాన్ని భారతీయ ఫుట్‌బాల్ భవిష్యత్తుపై అర్ధవంతమైన ప్రభావాన్ని చూపే సామర్థ్యాన్ని పెంచుతుందన్నారు.

TV9 నెట్‌వర్క్ ద్వారా అతిపెద్ద ఫుట్‌బాల్ టాలెంట్ హంట్‌ను ఆమోదించినందుకు DFB (జర్మన్ ఫుట్‌బాల్ అసోసియేషన్) గ్లోబల్ మీడియా డైరెక్టర్ కే డోమ్‌హోల్జ్ సింధియాను అభినందించారు. జర్మనీలో జరిగే జర్మన్ ఫుట్‌బాల్ జట్టు మ్యాచ్‌లను చూసేందుకు బ్రాండ్ అంబాసిడర్‌ను కూడా ఆహ్వానించారు. ఆసియా పసిఫిక్ హెడ్ జూలియా ఫార్, బోరుస్సియా డార్ట్‌మండ్ మరియు REISPO CEO గెర్హార్డ్ రీడ్ల్ కూడా అసోసియేషన్‌లో మిస్టర్ సింధియాను స్వాగతించారు. సింధియా కొనసాగుతున్న ఫుట్‌బాల్ ప్రతిభ వేటకు కొత్త ఊపును తీసుకువస్తారంటూ ఆశాభావం వ్యక్తంచేశారు.

ఇండియన్ టైగర్స్ అండ్ టైగ్రెస్స్ టాలెంట్ హంట్ భారతదేశంలోని ప్రతి మూలకు చేరుకునేలా రూపొందించారు. ఇది బలమైన నైపుణ్యాన్ని వెలికితీస్తుంది. 100,000 పాఠశాలలకు విస్తరించడంతో, విభిన్న నేపథ్యాల నుంచి ప్రతిభను గుర్తించడం, మద్దతు ఇవ్వడం ఈ కార్యక్రమం లక్ష్యం. ఎలైట్ ట్రైనింగ్, ఇంటర్నేషనల్ ఎక్స్‌పోజర్ అందించడం ద్వారా.. ఇది భారతదేశంలో ఫుట్‌బాల్ నైపుణ్యం, కొత్త శకాన్ని ప్రోత్సహించడానికి సిద్ధంగా ఉంది.

ఈ చొరవ భారతదేశంలోని మొత్తం ఫుట్‌బాల్ పర్యావరణ వ్యవస్థను ప్రేరేపించడం, కలను సాకారం చేయడం గురించి.. గ్లోబల్ ప్లాట్‌ఫారమ్‌లో భారతీయ ప్రతిభను ప్రదర్శించడం ద్వారా, ఫుట్‌బాల్‌పై మక్కువను పెంచాలని.. అన్ని స్థాయిలలో క్రీడ అభివృద్ధిని కొనసాగించాలని మేము ఆశిస్తున్నాము.

మరిన్ని వివరాల కోసం.. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు.. www.indiantigersandtigresses.com సందర్శించండి..