నోబాల్‌ని కాస్త డెడ్ బాల్ చేశాడు.. వీడియో చూస్తే వావ్ అనాల్సిందే..
క్రికెట్‌లో నోబాల్ గురించి అందరికీ తెలిసిందే. ప్రస్తుతం ఉన్న రూల్స్ ప్రకారం.. బౌలర్ నోబాల్ వేస్తే.. ఆ తర్వాత ఫ్రీ హిట్ ఉంటుంది. దీంతో బ్యాట్స్‌మెన్ ఇష్టమొచ్చినట్లు ఆడతాడు. దీంతో బౌలర్ వీలైనంత వరకు నో బాల్ వేయకుండా జాగ్రత్తపడతాడు. అయితే బౌలర్ బాల్ వేసే సమయంలో.. అతని పాదం లైన్ దాటి అవతల పెట్టి వేస్తే దానిని అంపైర్ నోబాల్ అని ప్రకటిస్తాడు. అయితే మంగళవారం జరిగిన ఆఫ్ఘాన్, విండీస్ మ్యాచ్‌లో.. నోబాల్ కాస్త డెడ్ […]
క్రికెట్‌లో నోబాల్ గురించి అందరికీ తెలిసిందే. ప్రస్తుతం ఉన్న రూల్స్ ప్రకారం.. బౌలర్ నోబాల్ వేస్తే.. ఆ తర్వాత ఫ్రీ హిట్ ఉంటుంది. దీంతో బ్యాట్స్‌మెన్ ఇష్టమొచ్చినట్లు ఆడతాడు. దీంతో బౌలర్ వీలైనంత వరకు నో బాల్ వేయకుండా జాగ్రత్తపడతాడు. అయితే బౌలర్ బాల్ వేసే సమయంలో.. అతని పాదం లైన్ దాటి అవతల పెట్టి వేస్తే దానిని అంపైర్ నోబాల్ అని ప్రకటిస్తాడు. అయితే మంగళవారం జరిగిన ఆఫ్ఘాన్, విండీస్ మ్యాచ్‌లో.. నోబాల్ కాస్త డెడ్ బాల్‌గా మారింది. అది విండీస్ బౌలర్ పొలార్డ్ ప్రదర్శనతో.. ప్రస్తుతం అతడి ప్రదర్శనకు యావత్ క్రికెట్ ప్రపంచం పొగడ్తల వర్షం కురిపిస్తోంది. ఆఫ్గాన్‌తో జరిగిన మ్యాచ్‌లో వెస్టిండీస్ సారథి కీరన్ పొలార్డ్.. అద్భుతమైన సమయస్పూర్తిని ప్రదర్శించి అందర్నీ ఆకట్టుకున్నాడు. నోబాల్ అయ్యే బంతిని.. డెడ్ బాల్‌గా మార్చాడు. దాన్ని చూసి నెటిజన్లు, క్రికెట్ అభిమానులు పొలార్డ్‌పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
అసలు నో బాల్.. డెడ్ బాల్ ఎలా అయ్యిందంటే..
నజీబుల్లా, అఫ్గాన్ పార్ట్‌నర్ షిప్ బ్రేక్ చేసేందుకు 25వ ఓవర్ వేయడానికి పొలార్డ్ బంతిని అందుకున్నాడు. లైన్ అవతల తన లెగ్ మోపి మొదటి బాల్ వేసేందుకు ప్రయత్నించాడు. అయితే అదే సమయంలో అంపైర్ నోబాల్‌గా ప్రకటించాడు. అంపైర్ నోటి నుంచి నో బాల్ మాట విన్న పొలార్డ్.. క్షణాల్లోనే బాల్ వేయడం ఆపేశాడు. దీంతో అంపైర్ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని డెడ్‌బాల్‌గా ప్రకటించాడు. అయితే నోబాల్‌ను డెడ్‌బాల్ మార్చుకున్న పొలార్డ్ సమయస్ఫూర్తిని చూసి అంతా నవ్వుకున్నారు. అటు అంపైర్ కూడా గ్రౌండ్‌లోనే కొద్దిసేపు నవ్వుకున్నాడు. ప్రస్తుతం ఈ “నోబాల్ డెడ్ బాల్” కి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది.
Pollard? pic.twitter.com/1ncUxUZamE
— RedBall_Cricket (@RedBall_Cricket) November 11, 2019