వార్నీ.. ఇలాంటి అవుట్ ఎప్పుడూ చూడలేదనుకుంటా..? వీడియో

క్రికెట్.. ప్రపంచ వ్యాప్తంగా ఎంతో క్రేజ్ ఉన్న గేమ్. ఇందులో బ్యాట్స్‌మెన్ భవితవ్యం.. ఒక్కోసారి అంపైర్‌ నిర్ణయంపైనే ఆధారపడి ఉంటుంది. సదరు బ్యాట్స్‌మెన్ సరిగ్గా ఆడుతున్నా.. ఒక్కసారి అంపైర్‌లు ఇచ్చే తప్పుడు నిర్ణయాలకు బలైపోతుంటారు. తాజాగా ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్‌ స్మిత్‌ కూడా అంపైర్ తప్పుడు నిర్ణయానికి బలైపోయాడు. ప్రస్తుతం ఆసీస్ మాజీ సారథి స్మిత్ మంచి బ్యాటింగ్‌ ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. ఇటీవల పాక్‌తో జరిగిన మూడు టెస్టుల సిరీస్‌లో పరుగుల వరద పారించిన విషయం […]

  • Publish Date - 4:43 am, Wed, 13 November 19 Edited By:
వార్నీ.. ఇలాంటి అవుట్ ఎప్పుడూ చూడలేదనుకుంటా..? వీడియో

క్రికెట్.. ప్రపంచ వ్యాప్తంగా ఎంతో క్రేజ్ ఉన్న గేమ్. ఇందులో బ్యాట్స్‌మెన్ భవితవ్యం.. ఒక్కోసారి అంపైర్‌ నిర్ణయంపైనే ఆధారపడి ఉంటుంది. సదరు బ్యాట్స్‌మెన్ సరిగ్గా ఆడుతున్నా.. ఒక్కసారి అంపైర్‌లు ఇచ్చే తప్పుడు నిర్ణయాలకు బలైపోతుంటారు. తాజాగా ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్‌ స్మిత్‌ కూడా అంపైర్ తప్పుడు నిర్ణయానికి బలైపోయాడు. ప్రస్తుతం ఆసీస్ మాజీ సారథి స్మిత్ మంచి బ్యాటింగ్‌ ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. ఇటీవల పాక్‌తో జరిగిన మూడు టెస్టుల సిరీస్‌లో పరుగుల వరద పారించిన విషయం తెలిసిందే. తాజాగా ఫస్ట్‌ క్లాస్‌ క్రికెట్‌లోనూ అదే జోరును కంటిన్యూ చేస్తున్నాడు.

షెఫీల్డ్ షీల్డ్ టోర్నీలో భాగంగా వెస్ట్రన్‌ ఆస్ట్రేలియాతో జరుగుతున్న మ్యాచ్‌లో న్యూసౌత్‌వేల్స్‌ బ్యాట్స్‌మన్‌‌గా స్మిత్‌ సెంచరీ చేశాడు. దీంతో తన కెరీర్‌లో 42వ సెంచరీని నమోదు చేసుకున్నాడు. అయితే ఇదే సెంచరీతో చెత్త రికార్డును కూడా నమోదు చేసుకున్నాడు. ఈ మ్యాచ్‌లో చేసిన సెంచరీకి 290 బంతులను ఆడాడు. ఇదే తన కెరీర్‌లో అత్యంత నెమ్మదైన సెంచరీ. అయితే గతంలో జరిగిన యాషెస్‌ సిరీస్‌లో 261 బంతుల్లో సెంచరీ చేసి ఇంగ్లండ్‌ బౌలర్లకు పరీక్ష పెట్టాడు. అయితే సెంచరీ తర్వాత పరుగుల వరద కోసం వేగాన్ని పెంచాడు. అయితే ఈ క్రమంలోనే స్మిత్… అంపైర్‌ తప్పుడు నిర్ణయానికి బలయ్యాడు.

వెస్ట్రన్‌ ఆస్ట్రేలియా బౌలర్‌ మార్కస్‌ స్టోయినిస్‌ వేసిన బాల్‌ను స్మిత్‌ అప్పర్‌ కట్‌ ఆడేందుకు యత్నించాడు. అది కాస్త బ్యాట్‌కు అందకుండా.. వికెట్ కీపర్ చేతిలో పడింది. అయితే వికెట్‌ కీపర్‌ అవుట్‌ కోసం అప్పీల్‌ చేయడంతో.. అంపైర్‌ స్మిత్‌‌ను అవుట్‌గా ప్రకటించాడు. దీంతో ఒక్కసారిగా షాక్‌కు గురయ్యాడు స్మిత్‌. చేసేదేమి లేక భారంగా గ్రౌండ్‌ను వీడాడు. అయితే ఈ అవుట్‌కు సంబంధించిన వీడియో.. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ అవుట్‌పై నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు పెడుతున్నారు. ‘ఇదెక్కడి ఔట్‌.. నేనెప్పుడూ​ చూడలేదు’అంటూ ఓ నెటిజన్‌ కామెంట్‌ చేయగా.. ‘స్మిత్‌ జిడ్డు బ్యాటింగ్‌ చూడలేక అంపైర్ నిద్రపోయి.. అవుట్ ఇచ్చాడేమో’అంటూ మరికొంత మంది ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు.