యాషెస్ సిరీస్ లో ఆస్ట్రేలియా ఆధిపత్యం కొనసాగుతోంది. సిడ్నీ వేదికగా జరుగుతున్న నాలుగో టెస్టులోనూ ఆసీస్ బౌలర్లు ఇంగ్లండ్ బ్యాటర్లను ఓ ఆటాడుకున్నారు. 36 పరుగులకే 4 కీలక వికెట్లు పడగొట్టి ఇంగ్లండ్‌ను ఆత్మరక్షణలోకి నెట్టే ప్రయత్నం చేశారు. అయితే సిరీస్‌లో మొదటిసారి ఆసీస్ ఆధిపత్యానికి అడ్డుకట్ట వేశాడు ఇంగ్లండ్ స్టార్ ఆటగాడు జానీ బెయిర్ స్టో. బుల్లెట్లలా దూసుకొస్తున్న ఆసీస్ బౌలర్ల బంతులను పట్టుదలతో ఎదుర్కొన్నాడు. 140 బంతులను ఎదుర్కొని 103 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. ఇందులో 8 బౌండరీలు, ఒక సిక్స్ ఉన్నాయి. కాగా యాషెస్ సిరీస్ లో ఇంగ్లండ్ తరఫున నమోదైన తొలి సెంచరీ ఇదే కావడం గమనార్హం.
కాగా గత కొద్దికాలంగా వరుసగా విఫలమవుతోన్న ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ కూడా సిడ్నీ టెస్టులో సత్తా చాటాడు. 66 పరుగులు చేసి కష్టాల్లో ఉన్న ఇంగ్లండ్ జట్టును ఆదుకున్నాడు. మార్క్‌వుడ్ (39) కూడా బ్యాట్‌తో రాణించగా బట్లర్ డకౌట్‌గా వెనుదిరిగాడు. బెయిర్ స్టో- బెన్ స్టోక్స్‌ల పుణ్యమా అని మూడో రోజు ఆటముగిసే సమయానికి ఇంగ్లండ్ ఏడు వికెట్లు కోల్పోయి 258 పరుగులు చేసింది. కాగా పలుమార్లు వర్షం అంతరాయం కలిగించడంతో శుక్రవారం కేవలం 65 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యమైంది. ప్రస్తుతం క్రీజులో బెయిర్‌స్టో (103), లీచ్(4) పరుగులతో క్రీజులో ఉన్నారు. ఆస్ట్రేలియా బౌలర్లలో కమిన్స్, బోలాండ్ రెండు వికెట్లు పడగొట్టగా, స్టార్క్, గ్రీన్, లియాన్ చెరో వికెట్ సాధించారు.
Stumps in Sydney ?
Jonny Bairstow’s gritty century leads England’s fightback on day three!#AUSvENG | #WTC23 | #Ashes pic.twitter.com/bxmhtWl6i9
— ICC (@ICC) January 7, 2022
Also Read:
Deepthi Sunaina: నేను ఒంటరిని కాదు.. తండ్రితో ఎమోషనల్ వీడియోను షేర్ చేసిన దీప్తి సునయన..
Delhi: జైలు అధికారులను చూసి మొబైల్ ఫోన్‌ను మింగేసిన ఖైదీ.. ఆపై ఏం జరిగిందంటే..