టీమిండియా డెత్ ఓవర్స్ స్పెషలిస్ట్ జస్ప్రీత్ బుమ్రాను బీసీసీఐ అత్యున్నత పురస్కారంతో సత్కరించింది. ఆదివారం రాత్రి ముంబయిలో నిర్వహించిన 2018-2019 వార్షికోత్సవంలో అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యుత్తమంగా రాణించినందుకు బుమ్రాకు పాలీ ఉమ్రిగర్ అవార్డును బహుకరించింది. ఇక మహిళల విభాగంలో లెగ్‌స్పిన్నర్ పూనమ్ యాదవ్ ఈ అవార్డును సొంతం చేసుకున్నారు. బుమ్రా 2018 జనవరిలో దక్షిణాఫ్రికా పర్యటన సందర్భంగా టెస్టుల్లో అరంగేట్రం చేసి ఐదు వికెట్లు తీశాడు. అనంతరం ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, వెస్టిండీస్ పర్యటనల్లో ఇదే ప్రదర్శన చేసి ఆసియా తరపున ఈ ఘనత సాధించిన తొలి బౌలర్‌గా నిలిచాడు.
ఈ నేపథ్యంలో మాజీ కెప్టెన్ కృష్ణమాచారి శ్రీకాంత్, మహిళా క్రికెటర్ అన్జుమ్ చోప్రాలను సీకే నాయుడు జీవితకాల పురస్కారంతో సత్కరించారు. శ్రీకాంత్ 1983 ప్రపంచకప్ ఫైనల్లో బౌలింగ్ చేసి దిగ్గజ విండీస్ ఆటగాళ్లను ఎక్కువ పరుగులు చేయకుండా అడ్డుకున్నాడు. అలాగే అతను రిటైర్మెంట్ తర్వాత బీసీసీఐ చీఫ్ సెలెక్టర్‌గా సేవలందించాడు. అతడి పదవీకాలంలోనే టీమిండియా 2011లో రెండోసారి వన్డే ప్రపంచకప్‌ను సాధించింది. అలాగే మహిళా క్రికెట్‌లో అన్జుమ్ భారత్ తరపున వంద వన్డేలాడిన తొలి క్రికెటర్‌గా నిలవడంతో పాటు 17 ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌లో నాలుగు వన్డే ప్రపంచకప్‌లు, రెండు టీ20 ప్రపంచకప్‌లు ఆడింది.
[svt-event date=”13/01/2020,1:00AM” class=”svt-cd-green” ]
NEWS: @Jaspritbumrah93 set to receive Polly Umrigar Award at BCCI Awards (Naman) today. @poonam_yadav24 named best int’l cricketer (woman)
Former captains @KrisSrikkanth & @chopraanjum to be honoured with Lifetime Achievement Awards
Details – https://t.co/pDQNcVO8ga pic.twitter.com/cEQ6icR5lM
— BCCI (@BCCI) January 12, 2020