IND vs ENG: ఇంగ్లాండ్‌తో కీలక పోరు.. టీమిండియాకు గుడ్ న్యూస్.. జట్టులోకి..

భారత్ - ఇంగ్లాండ్ నాలుగో టెస్టుకు ఇంకా వారం రోజుల సమయం ఉంది. మూడో టెస్టులో ఓటమితో కసి మీదున్న టీమిండియా నాలుగో టెస్టులో ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో ఉంది. దీనికి సంబంధించి ఇప్పటినుంచే వ్యూహాలు రచిస్తుంది. అయితే ఈ మ్యాచ్‌లో బుమ్రా ఆడటంపై సస్పెన్స్ నెలకొంది. దీనికి సంబంధించి ఓ కీలక అప్‌డేట్ వచ్చింది.

IND vs ENG: ఇంగ్లాండ్‌తో కీలక పోరు.. టీమిండియాకు గుడ్ న్యూస్.. జట్టులోకి..
Jasprit Bumrah

Updated on: Jul 17, 2025 | 9:05 PM

భారత్ – ఇంగ్లాండ్ నాల్గవ టెస్ట్ ఈ నెల 23నుంచి ప్రారంభం కానుంది. మాంచెస్టర్‌లోని ఓల్డ్ ట్రాఫోర్డ్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగుతుంది. మూడో టెస్టులో ఓడిపోయిన టీమిండియా ఈ మ్యాచ్‌లో గెలవాలనే పట్టుదలతో ఉంది. ఇప్పటివరకు రెండు జట్ల మధ్య మూడు టెస్ట్ మ్యాచ్‌లు జరిగాయి. ఇంగ్లాండ్ 2-1తో ఆధిక్యంలో ఉంది. అందువల్ల, సిరీస్‌ ఆశలు సజీవంగా ఉండాలంటే మాంచెస్టర్ టెస్ట్ గెలవడం భారత్‌కు చాలా ముఖ్యం. దీంతో భారత్ గెలుపు వ్యూహాలను రచిస్తోంది. ఈ కీలకమైన మ్యాచ్‌కు స్టార్ బౌలర్ బుమ్రా అందుబాటులో ఉంటాడా..? లేదా అనే సందేహాలు నెలకొన్నాయి. దీనికి సంబంధించి ఓ కీలక అప్ డేట్ వచ్చింది.

జస్ప్రీత్ బుమ్రా మాంచెస్టర్ టెస్ట్‌లో ఆడతారని తెలుస్తోంది. ఈ సిరీస్‌కు బుమ్రాను ఎంపిక చేసేటప్పుడే.. అతడు మూడు టెస్టులకు మాత్రమే అందుబాటులో ఉంటాడని బీసీసీఐ తెలిపింది. భవిష్యత్తు మ్యాచులను దృష్టిలో ఉంచుకుని అతడికి రెస్ట్ ఇవ్వాలని నిర్ణయించింది. ఈ క్రమంలో ఫస్ట్ మ్యాచ్ ఆడిన బుమ్రా రెండో మ్యాచుకు రెస్ట్ తీసుకున్నాడు. మళ్లీ మూడో మ్యాచ్ ఆడిన బుమ్రా.. నాలుగో మ్యాచుకు రెస్ట్ తీసుకోవాలి. కానీ ఈ మ్యాచ్ కీలకం కావడంతో అతడు ఆడతారని సమాచారం. ఈ టెస్టుకు ఇంకా వారం రోజుల టైమ్ ఉండడంతో బుమ్రాను రంగంలోకి దించాలని బీసీసీఐ నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ టెస్ట్ మ్యాచ్‌కు బుమ్రా అందుబాటులో ఉండటం బౌలింగ్ విభాగం మరింత బలంగా మారుతుంది.

ఈ సిరీస్‌లో టీమిండియా తరపున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో బుమ్రా రెండవ స్థానంలో ఉన్నాడు. అతను రెండు టెస్టులలో 12 వికెట్లు పడగొట్టాడు. మొదటి స్థానంలో ఉన్న సిరాజ్ మూడు టెస్ట్ మ్యాచ్‌లలో 13 వికెట్లు పడగొట్టాడు. ఇంగ్లాండ్‌లో ఇప్పటివరకు 11 మ్యాచ్‌ల్లో జస్ప్రీత్ బుమ్రా 24.97 సగటుతో 49 వికెట్లు పడగొట్టాడు. ఇందులో, అతను నాలుగు సార్లు ఐదు వికెట్లు కూడా పడగొట్టాడు. ఇప్పుడు మాంచెస్టర్ టెస్ట్‌లో భారత్ గెలవడంతో బుమ్రా కీలక పాత్ర పోషించాల్సి ఉంటుంది.

మరిన్ని క్రికెట్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..