UEFA Euro 2020: లండన్ వేదికగా జరిగిన యూరోపియన్ ఛాంపియన్‌షిప్ ఫుట్‌బాల్ టోర్నీ ఫైనల్ మ్యాచ్‌లో ఇటలీ సత్తా చాటింది. పెనాల్టీ షూట్‌లో 3-2 తో ఇంగ్లాండ్‌పై నెగ్గి విజేతగా అవతరించింది. దీంతో 1968 తర్వాత ఇటలీ యూరోకప్‌ను మరోసారి అందుకుంది. ఆద్యంతం ఉత్కంఠంగా సాగిన మ్యాచ్‌లో ఇటలీ ఘన విజయం సాధించింది. మొదట మ్యాచ్ నిర్ణీత సమయానికి ఇరు జట్లు 1-1తో సమానంగా నిలిచాయి. దీంతో అదనపు సమయం ఇచ్చారు. ఈ ఎక్స్‌ట్రా సమయంలోనూ ఇరు జట్లలో ఏ జట్టు గోల్ చేయకపోవడంతో అనివార్యంగా పెనాల్టీ షూటౌట్‌గా మారింది. ఈ క్రమంలోనే ఇటలీ ఆరు అవకాశాలకుగాను మూడింటిని గోల్ చేసింది. తర్వాత ఇంగ్లండ్ జట్టు 2 గోల్స్ చేసింది దీంతో ఇంటలీ 3-2 తేడాతో విజయం సాధించింది.
ఇదిలా ఉంటే యూరో కప్‌లో సుమారు 55 ఏళ్ల తర్వాత ఇంగ్లాండ్ ఫైనల్ రావడం ఇదే తొలిసారి. కప్ కొడదామని ఆశించిన ఇంగ్లాండ్‌కు ఎదురుదెబ్బ తగిలిందని చెప్పాలి. ఇక ఆట మొదలైన రెండవ నిమిషంలోనే ఇంగ్లండ్ ప్లేయర్ లూక్ షా తొలి గోల్ చేయడం విశేషమని చెప్పాలి. యూరో కప్ ఫైనల్స్‌లో అత్యంత తక్కువ సమయంలో గోల్ నమోదుకావడం ఇది తొలిసారి. ఇక అనంతరం ఇటలీ జట్టు గట్టి పోటీనిచ్చింది. దీంతో మ్యాచ్ పెనాల్టీకి దారి తీసింది.
Also Read: IND vs SL: గుడ్ న్యూస్ చెప్పిన శ్రీలంక క్రికెట్ బోర్డు.. వన్డే సిరీస్ ప్రారంభానికి లైన్ క్లియర్!
హర్లీన్ డియోల్ సూపర్ క్యాచ్ వెనుక అసలు కారణం ఇదేనంట..! వెల్లడించిన కోచ్ పవన్ సేన్