అన్నీ అభూతకల్పనలే, రోహిత్ గొప్ప ఆటగాడు : కోహ్లి

వైస్ కెప్టెన్  రోహిత్‌ శర్మతో తనకు విభేదాలు నడుస్తాయని వస్తున్న రూమర్స్‌పై కెప్టెన్ కోహ్లి స్పందించాడు. అవన్నీ వట్టి పుకార్లేనని స్పష్టం చేశాడు. తానెప్పుడూ రోహిత్‌ను పొగుడుతానని..అతడో గొప్ప ఆటగాడని చెప్పాడు. ఒకవేళ తనకు ఎవరైనా నచ్చకపోతే..అది మెహంపై కన్పిస్తుందని..తానూ ఫీలింగ్స్ దాచుకోలేనని పేర్కొన్నాడు. వెస్టిండీస్‌ పర్యటనకు బయల్దేరే ముందు కోహ్లీ, కోచ్‌ రవిశాస్త్రితో కలిసి మీడియాతో మాట్లాడారు. కోహ్లి మాట్లాడుతూ.. ‘ అబద్ధాలను ఎవరు కల్పిస్తున్నారో తెలియడం లేదు. క్రికెట్‌ను ముందుకు తీసుకెళ్లేందుకు మేమిద్దరం కలిసి […]

అన్నీ అభూతకల్పనలే, రోహిత్ గొప్ప ఆటగాడు : కోహ్లి

Updated on: Jul 30, 2019 | 12:41 AM

వైస్ కెప్టెన్  రోహిత్‌ శర్మతో తనకు విభేదాలు నడుస్తాయని వస్తున్న రూమర్స్‌పై కెప్టెన్ కోహ్లి స్పందించాడు. అవన్నీ వట్టి పుకార్లేనని స్పష్టం చేశాడు. తానెప్పుడూ రోహిత్‌ను పొగుడుతానని..అతడో గొప్ప ఆటగాడని చెప్పాడు. ఒకవేళ తనకు ఎవరైనా నచ్చకపోతే..అది మెహంపై కన్పిస్తుందని..తానూ ఫీలింగ్స్ దాచుకోలేనని పేర్కొన్నాడు. వెస్టిండీస్‌ పర్యటనకు బయల్దేరే ముందు కోహ్లీ, కోచ్‌ రవిశాస్త్రితో కలిసి మీడియాతో మాట్లాడారు.

కోహ్లి మాట్లాడుతూ.. ‘ అబద్ధాలను ఎవరు కల్పిస్తున్నారో తెలియడం లేదు. క్రికెట్‌ను ముందుకు తీసుకెళ్లేందుకు మేమిద్దరం కలిసి పనిచేస్తున్నాం. టీమిండియా అత్యుత్తమ స్థానంలో ఉంచేందుకు ఎంతో కష్టపడ్డాం. నాలుగేళ్ల తర్వాత, మనం దీని గురించి మాట్లాడుతున్నాం. డ్రస్సింగ్‌ రూమ్‌ గురించి అబద్ధాలు, ఊహాలు సృష్టిస్తున్నారు. ఇది అగౌరవపరచడమే. జట్టులో వాతావరణం చాలా బాగుంది. ఇంత నిలకడగా టీమిండియా ఎప్పుడూ లేదు. టెస్టుల్లో మేం ఏడో స్థానం నుంచి అగ్రస్థానానికి చేరుకున్నాం’ అని అన్నాడు.