ఐఎస్‌ఎస్‌ఎఫ్ ప్రపంచ కప్‌: షూటింగ్‌లో భారత్‌కు స్వర్ణం

|

Apr 27, 2019 | 2:31 PM

ఢిల్లీ:ఐఎస్‌ఎస్‌ఎఫ్ ప్రపంచ కప్‌లో భాగంగా భారత షూటర్‌ అభిషేక్‌ వర్మ స్వర్ణ పతకం సాధించాడు. 10మీటర్ల ఎయిర్‌ పిస్ట్‌ల్‌ విభాగంలో ఇతడికి బంగారు పతకం లభించింది. దీంతో అభిషేక్‌ ఒలింపిక్స్‌ బెర్తును కూడా ఖాయం చేసుకున్నాడు. దీంతో ఈ ఘనత సాధించిన ఐదో భారత షూటర్‌గా నిలిచాడు. ఇలా ప్రపంచ కప్‌ బరిలోకి దిగడం అభిషేక్‌కిది రెండో సారి. ఈ రోజు జరిగిన ఎయిర్‌ పిస్టోల్‌ ఫైనల్స్‌లో 242.7 పాయింట్లతో ఇతడికి స్వర్ణం దక్కగా.. 240.4 పాయింట్లతో […]

ఐఎస్‌ఎస్‌ఎఫ్ ప్రపంచ కప్‌: షూటింగ్‌లో భారత్‌కు స్వర్ణం
Follow us on

ఢిల్లీ:ఐఎస్‌ఎస్‌ఎఫ్ ప్రపంచ కప్‌లో భాగంగా భారత షూటర్‌ అభిషేక్‌ వర్మ స్వర్ణ పతకం సాధించాడు. 10మీటర్ల ఎయిర్‌ పిస్ట్‌ల్‌ విభాగంలో ఇతడికి బంగారు పతకం లభించింది. దీంతో అభిషేక్‌ ఒలింపిక్స్‌ బెర్తును కూడా ఖాయం చేసుకున్నాడు. దీంతో ఈ ఘనత సాధించిన ఐదో భారత షూటర్‌గా నిలిచాడు. ఇలా ప్రపంచ కప్‌ బరిలోకి దిగడం అభిషేక్‌కిది రెండో సారి. ఈ రోజు జరిగిన ఎయిర్‌ పిస్టోల్‌ ఫైనల్స్‌లో 242.7 పాయింట్లతో ఇతడికి స్వర్ణం దక్కగా.. 240.4 పాయింట్లతో రష్యన్ షూటర్‌ ఆర్టెమ్‌ చెర్నోసోవ్‌ రెండో స్థానంలో నిలిచాడు. ఈ ఏడాది ఆరంభంలో జరిగిన ఐఎస్‌ఎస్‌ఎఫ్‌ ప్రపంచ కప్‌ ఫైనల్లో స్వర్ణం సాధించిన సౌరబ్‌ చైదరి కూడా టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించాడు.