హెచ్‌సీఏలో రగడ.. మంత్రి కేటీఆర్‌కు రాయుడు ట్వీట్..!

ప్రముఖ క్రికెటర్, అంబటి రాయుడు కెరీర్ చిక్కుల్లో పడేసుకున్నట్లు కన్పిస్తోంది. ఈ ఏడాది జరిగిన ప్రపంచకప్‌లో తనని సెలక్ట్‌ చేయలేదంటూ.. అసహనం వ్యక్తం చేస్తూ.. రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత తన రిటైర్మెంట్ విషయంలో యూ టర్న్.. తీసుకుని హైదరాబాద్ టీం తరఫున రీ ఎంట్రీ ఇచ్చాడు. అయితే సరిగ్గా రెండు మూడు నెలలు కూడా గడవలేదు.. అప్పుడే మరో వివాదంలో చిక్కుకున్నాడు. హైదరాబాద్‌ క్రికెట్ అసోషియేషన్ (HCA)లో అవినీతి పెరిగిపోయిందంటూ ఏకంగా మంత్రి […]

హెచ్‌సీఏలో రగడ.. మంత్రి కేటీఆర్‌కు రాయుడు ట్వీట్..!
Follow us

| Edited By: Srinu

Updated on: Nov 25, 2019 | 4:13 PM

ప్రముఖ క్రికెటర్, అంబటి రాయుడు కెరీర్ చిక్కుల్లో పడేసుకున్నట్లు కన్పిస్తోంది. ఈ ఏడాది జరిగిన ప్రపంచకప్‌లో తనని సెలక్ట్‌ చేయలేదంటూ.. అసహనం వ్యక్తం చేస్తూ.. రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత తన రిటైర్మెంట్ విషయంలో యూ టర్న్.. తీసుకుని హైదరాబాద్ టీం తరఫున రీ ఎంట్రీ ఇచ్చాడు. అయితే సరిగ్గా రెండు మూడు నెలలు కూడా గడవలేదు.. అప్పుడే మరో వివాదంలో చిక్కుకున్నాడు.

హైదరాబాద్‌ క్రికెట్ అసోషియేషన్ (HCA)లో అవినీతి పెరిగిపోయిందంటూ ఏకంగా మంత్రి కేటీఆర్‌కు ట్వీట్లు చేసి ఫిర్యాదు చేశాడు. దీంతో హెచ్‌సీఏ అధ్యక్షుడిగా ఉన్న మహ్మద్ అజహరుద్దీన్.. రాయుడు ట్వీట్‌పై స్పందించారు. రాయుడు ఓ ఫ్రస్టేటడ్ క్రికెటర్ (అసహన క్రికెటర్) అంటూ వ్యాఖ్యలు చేశాడు. రాయుడు చేసిన ఈ ట్వీట్‌‌కు అజహరుద్దీన్ ఇచ్చిన రిప్లై చూస్తే.. ఇప్పుడు ఇతనిపై హెచ్‌సీఏ పెద్దలకు ఆగ్రహం కలిగినట్టే అనిపిస్తోంది. ఇది అంబటి రాయుడు కెరీర్‌కు మళ్లీ బ్రేక్ ఇస్తుందా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

అయితే గతంలో జరిగిన ఐపీఎల్ మ్యాచుల్లో కూడా సహచర టీం సభ్యులతో గొడవకి దిగిన సంఘటనలు ఉన్నాయి. అంతేకాదు.. దేశవాళీ మ్యాచుల్లోనూ రాయుడు గొడవ పడ్డ సందర్భాలు అనేకం. తాజాగా మహ్మద్ అజహరుద్దీన్‌ వ్యాఖ్యలపై స్పందించిన అంబటి రాయుడు మళ్లీ ట్వీట్ చేశాడు. తన మాటలను వ్యక్తిగతంగా తీసుకోవద్దని.. హెచ్‌సీఏలో ఏం జరుగుతోందన్నది.. మన ఇద్దరికీ తెలుసంటూ పేర్కొన్నాడు. హైదరాబాద్ క్రికెట్‌ను మీరే ప్రక్షాళన చేయాలని.. ఇలా చేస్తే.. భవిష్యత్‌లో వచ్చే క్రికెటర్లను కాపాడినవారవుతారంటూ.. ట్వీట్‌లో పేర్కొన్నాడు.