IPL 2021: సచిన్ మెచ్చుకున్న ఆ ముగ్గురు ఆటగాళ్ల ఖేల్ ఖతం.. అటు ఇంటర్నేషనల్ మ్యాచ్‌లకూ.. ఇటు ఐపీఎల్‌కూ దూరం..
IPL 2021: ప్రపంచ వ్యాప్తంగా ఎంతో ప్రాచుర్యం పొందిన ఐపీఎల్ మ్యాచ్‌లు గతేడాది కరోనా ఎఫెక్ట్‌తో చడీచప్పుడు కాకుండా ముగిసిపోయాయి.
IPL 2021: ప్రపంచ వ్యాప్తంగా ఎంతో ప్రాచుర్యం పొందిన ఐపీఎల్ మ్యాచ్‌లు గతేడాది కరోనా ఎఫెక్ట్‌తో చడీచప్పుడు కాకుండా ముగిసిపోయాయి. ఎలాంటి కోలాహలం లేకుండా ఐపీఎల్ 2020 సీజన్ 13కి ఎండ్ కార్డ్ పడింది. 2020 సెప్టెంబర్ నుండి నవంబర్ వరకు యుఎఇలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2020 మ్యాచ్‌లను విజయవంతంగా నిర్వహించారు. ఈ క్రమంలో ఎప్పటిలాగే 2021 సంవత్సరానికి సంబంధించి ఐపిఎల్ 14 సీజన్ కోసం కూడా సన్నాహాలు ప్రారంభించారు. ఇందులో భాగంగా ఫిబ్రవరిలో క్రికెటర్లకు వేలం నిర్వహించారు. ఈ వేలంలో భారత క్రికెటర్లతో పాటు.. విదేశీ క్రికెటర్లు సైతం అమ్ముడు పోయిన విషయం తెలిసిందే. అయితే, ముగ్గురు ఇండియన్ క్రికెటర్లకు మాత్రం ఐపీఎల్ 2021 వేలంలో చేదు అనుభవం ఎదురైంది. ట్రాక్ రికార్డ్ అద్భుతంగా ఉన్నప్పటికీ.. ఆ ముగ్గురు ఆటగాళ్లను ఏ ఫ్రాంచైజీ కొనుగోలు చేయలేదు. అది జరిగిన కొద్ది రోజులకే వీరు ఇంటర్నేషనల్ క్రికెట్‌కు కూడా గుడ్‌బై చెప్పారు. ఇలా ఇప్పుడు ఐపీఎల్‌కూ దూరం అవడంతో ఖాళీగా ఉండిపోయారు. మరి ఆ క్రికెటర్లు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 14 వ సీజన్ కోసం నిర్వహించిన వేలంలో అమ్ముడుపోని ముగ్గురు భారత క్రికెటర్లలో దిగ్గజ ఆల్ రౌండర్ యూసుఫ్ పఠాన్, ఫాస్ట్ బౌలర్ ఆర్.కె. వినయ్ కుమార్, వికెట్ కీపర్, బ్యాట్స్‌మెన్ నమన్ ఓజా ఉన్నారు. వీరిలో యూసుఫ్ పఠాన్ కనీస ధర రూ. 1 కోట్లు కాగా.. ఆర్.కె. వినయ్ కుమార్ కనీస ధర రూ. 1 కోట్లు గా ఫిక్స్ చేశారు. ఇదే సమయంలో నామన్ ఓజా కనీస ధర రూ. 50 లక్షలుగా నిర్ణయించారు. అయితే, ఫిబ్రవరిలో నిర్వహించిన ఐపీఎల్ 2021 ఆక్షన్‌లో ఏ ఫ్రాంచైజీ కూడా వీరిని కొనుగోలు చేయలేదు. దీంతో వీరు ఇంటికే పరిమితం కావాల్సి వచ్చింది. ఇక ఈ ముగ్గురు క్రికెటర్లు ఫిబ్రవరిలో అంతర్జాతీయ క్రికెట్‌కు కూడా రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే.
యూసూఫ్, వినయ్, నమన్ ఓజా ఐపీఎల్ ప్రొఫైల్.. యూసుఫ్ పఠాన్ ఈ ఏడాది ఫిబ్రవరి 26 న అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించగా, ఆర్.కె. వినయ్ కుమార్ కూడా అదే రోజు క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. ఇక నమన్ ఓజా ఫిబ్రవరి 15వ తేదీన అంతర్జాతీయ క్రికెట్‌కు టాటా చెప్పేశాడు. యూసుఫ్ పఠాన్ భారత్ తరపున 57 వన్డేలు, 22 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. వినయ్ కుమార్ టీమ్ ఇండియా తరఫున 1 టెస్ట్ మ్యాచ్, 31 వన్డేలు, 9 టి20 మ్యాచ్‌ల్లో పాల్గొన్నాడు. నమన్ ఓజా భారత జట్టు కోసం ఒక టెస్ట్, ఒక వన్డే, రెండు టి20 మ్యాచ్‌లు ఆడాడు.
ఐపీఎల్‌లో ఈ ఆటగాళ్ల ఆటతీరు పరిశీలిస్తే.. – ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో యూసుఫ్ పఠాన్ ట్రాక్ సూపర్ అని చెప్పాలి. ఐపీఎల్‌లో మొత్తం 179 మ్యాచ్‌లు ఆడిన యూసుఫ్ పఠాన్.. 29.12 సగటుతో 3,204 పరుగులు చేసి 142.97 స్ట్రైక్ రేట్ కలిగి ఉన్నాడు. ఈ మొత్తం స్కోర్‌లో 1 సెంచరీ, 13 అర్ధ సెంచరీలు చేయగా.. 262 ఫోర్లు, 158 సిక్సర్లు కొట్టాడు. – వినయ్ కుమార్ ఐపిఎల్‌లో 105 మ్యాచ్‌లు ఆడి 105 వికెట్లు పడగొట్టాడు. ఇందులో 40 పరుగులకు 4 వికెట్లు పడగొట్టి తన ఖాతాలో అత్యుత్తమ ప్రదర్శనగా నమోదు చేసుకున్నాడు. – నమన్ ఓజా 113 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడాడు. 20.72 సగటుతో 1,554 పరుగులు చేసి.. 118.35 స్ట్రైక్ రేట్ సాధించాడు. ఈ స్కోర్‌లో 6 అర్ధ సెంచరీలు కూడా ఉన్నాయి.
ఇదిలాఉంటే.. ఒకానొక సందర్భంలో ఇండియన్ క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్‌కు ఈ ముగ్గురు క్రికెటర్ల ఆట తీరుపై ప్రశంసలు కురిపించారు. స్వయంగా సచినే వీరి ఆటకు ఫిదా అయినట్లు ప్రకటించారు కూడా. అలాంటి ప్లేయర్ల కెరియర్ చాలా త్వరగా ముగిసిపోవడం క్రికెట్ అభిమానులను కూడా నిరాశకు గురి చేసింది.
Pariksha Pe Charcha 2021: ప్రధాని మోదీ విద్యార్థులతో ముఖాముఖీ… ‘పరీక్షా పే చర్చ’ లైవ్ వీడియో