IPL 2021: ఫైర్ మీదున్న రిషబ్ పంత్.. తొలి టైటిలే లక్ష్యంగా వేట.. మరి బోణీ కొట్టేనా.!

IPL 2021: గత సీజన్‌లో తమ తొలి ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ఫైనల్‌కు చేరుకున్న ఢిల్లీ క్యాపిటల్స్.. ఈసారి ఖచ్చితంగా టైటిల్ గెలవాలన్న..

IPL 2021: ఫైర్ మీదున్న రిషబ్ పంత్.. తొలి టైటిలే లక్ష్యంగా వేట.. మరి బోణీ కొట్టేనా.!
Delhi Capitals
Follow us
Ravi Kiran

|

Updated on: Apr 07, 2021 | 9:11 PM

IPL 2021: గత సీజన్‌లో తమ తొలి ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ఫైనల్‌కు చేరుకున్న ఢిల్లీ క్యాపిటల్స్.. ఈసారి ఖచ్చితంగా టైటిల్ గెలవాలన్న పట్టుదలతో ఉంది. అయితే అనూహ్యంగా ఈ టీంకు సీజన్ ప్రారంభానికి ముందే గట్టి ఎదురుదెబ్బ తగిలింది, కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ గాయం కారణంగా టోర్నమెంట్‌కు దూరమయ్యాడు. దీనితో నూతన కెప్టెన్‌గా రిషబ్ పంత్‌ను ఎంపిక చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ యాజమాన్యం. అటు ఆస్ట్రేలియా, ఇటు ఇంగ్లాండ్ సిరీస్‌లలో రెడ్ హాట్ ఫామ్‌లో ఉన్న పంత్.. తనకొచ్చిన అవకాశాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలని అనుకుంటున్నాడు. ఢిల్లీ తన తొలి పోరులో చెన్నై సూపర్ కింగ్స్‌తో తలబడబోతోంది.

న్యూ ప్లేయర్స్ అదనపు బలం అందిస్తారా.?

జట్టుకు బలం చేకూర్చే క్రమంలో ఢిల్లీ యాజమాన్యం ఎనిమిది మంది ఆటగాళ్లను ఐపీఎల్ 2021 మినీ ఆక్షన్‌లో కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. వారిలో స్టీవ్ స్మిత్ కీలకం కానున్నాడు. అతడి అంతర్జాతీయ అనుభవం జట్టుకు ప్లస్ పాయింట్ కానుంది. ఇక సామ్ బిల్లింగ్స్, టామ్ కర్రాన్, ఉమేష్ యాదవ్‌లు మేటి ఆటగాళ్లు కాగా.. విష్ణు వినోద్, లుక్మాన్ మేరీవాలా, ఎం సిద్ధార్థ్, రిపాల్ పటేల్ లాంటి యువ ప్లేయర్స్ కూడా ఈ జాబితాలో ఉన్నారు.

పాత ఆటగాళ్లు చక్కటి ఫామ్‌లో ఉన్నారు…

ఓపెనర్ పృథ్వీ షా విజయ్ హజారే ట్రోఫీలో దుమ్మురేపగా.. శిఖర్ ధావన్, అజింక్య రహనే, రవిచంద్రన్ అశ్విన్‌లు ఇంటర్నేషనల్ మ్యాచ్‌లలో తమ సత్తా చాటారు. ఇక రిషబ్ పంత్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ సిరీస్‌లలో టీమిండియాకు విజయాలు అందించడంలో కీలక పాత్ర పోషించాడు. ఇక దక్షిణాఫ్రికా ద్వయం రబాడా, నోర్తేజలు పేస్ ఎటాక్ డీసీకి కీలకం కానుంది.

గతేడాది డీసీ ఫైనల్ వరకు చేరింది…

ఐపీఎల్ 2020లో ఢిల్లీ క్యాపిటల్స్ అద్భుత ప్రదర్శన కనబరిచింది. మొదటి క్వాలిఫైయర్‌లో ముంబై ఇండియన్స్ చేతిలో ఓడిపోయినప్పటికీ.. రెండో క్వాలిఫయర్‌లో సన్ రైజర్స్ హైదరాబాద్‌ను ఓడించి ఫైనల్‌కు చేరుకుంది. కానీ చివర్లో చతికిలపడింది.

ఢిల్లీ జట్టు:

పంత్‌, ధావన్‌, పృథ్వీ షా, రహానే, అశ్విన్‌, అక్షర్‌, అమిత్‌ మిశ్రా, లలిత్‌ యాదవ్‌, ప్రవీణ్‌ దూబే, ఇషాంత్‌, అవేశ్‌ ఖాన్‌, ఉమేశ్‌ యాదవ్‌, రిపల్‌ పటేల్‌, విష్ణు వినోద్‌, లుక్మన్‌, సిద్ధార్థ్‌, హెట్‌మైర్‌, స్టొయినిస్‌, వోక్స్‌, రబాడా, నోర్జే, స్మిత్‌, టామ్‌ కరన్‌, సామ్‌ బిల్లింగ్స్‌

Also Read:

‘జగనన్న స్మార్ట్‌ టౌన్‌’.. దరఖాస్తు చేసుకోండిలా.. అర్హతలు ఇవే.!

ఈ ఫోటోలోని ఇద్దరు హీరోయిన్స్‌ను గుర్తు పట్టారా.? సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న పిక్.!

ఇంటి గుమ్మంలో తిష్టవేసిన సింహాలు.. డోర్ తీసి కంగుతిన్న యజమాని.. కట్ చేస్తే ఊహించని సంఘటన.!