ఐపీఎల్ నిర్వహణకు రెడీ అంటోన్న ఆ కంట్రీ…

కరోనా మహమ్మారి యావ‌త్ ప్ర‌పంచమే లాక్ డౌన్ మోడ్ లోకి వెళ్లిపోయింది. ఈ క్ర‌మంలోనే మెగా క్రీడా టోర్నీలు కొన్ని ర‌ద్ద‌వ్వగా..మ‌రికొన్ని వాయిదా ప‌డ్డాయి. వాయిదా ప‌డ్డ‌వి మ‌ళ్లీ‌ ఎప్పుడు మొదలవుతుందన్నది మిస్ట‌రీనే. వేసవి కాలంలో క్రికెట్‌ అభిమానులకు అదిరిపోయే కిక్‌ ఇచ్చే టోర్నీ ఐపీఎల్. వైరస్ కారణంగా ఇది కూడా వాయిదా పడక త‌ప్ప‌లేదు. ఈ నేపథ్యంలో ఐపీఎల్‌ నిర్వహించడానికి తాము సిద్ధమని శ్రీలంక క్రికెట్‌(ఎస్‌ఎల్‌సీ) ఇప్పటికే చెప్పింది. తాజాగా ఈ లిస్ట్ లో చేరింది […]

  • Ram Naramaneni
  • Publish Date - 10:20 pm, Sun, 10 May 20
ఐపీఎల్ నిర్వహణకు రెడీ అంటోన్న ఆ కంట్రీ...

కరోనా మహమ్మారి యావ‌త్ ప్ర‌పంచమే లాక్ డౌన్ మోడ్ లోకి వెళ్లిపోయింది. ఈ క్ర‌మంలోనే మెగా క్రీడా టోర్నీలు కొన్ని ర‌ద్ద‌వ్వగా..మ‌రికొన్ని వాయిదా ప‌డ్డాయి. వాయిదా ప‌డ్డ‌వి మ‌ళ్లీ‌ ఎప్పుడు మొదలవుతుందన్నది మిస్ట‌రీనే. వేసవి కాలంలో క్రికెట్‌ అభిమానులకు అదిరిపోయే కిక్‌ ఇచ్చే టోర్నీ ఐపీఎల్. వైరస్ కారణంగా ఇది కూడా వాయిదా పడక త‌ప్ప‌లేదు. ఈ నేపథ్యంలో ఐపీఎల్‌ నిర్వహించడానికి తాము సిద్ధమని శ్రీలంక క్రికెట్‌(ఎస్‌ఎల్‌సీ) ఇప్పటికే చెప్పింది. తాజాగా ఈ లిస్ట్ లో చేరింది ఎమిరేట్స్‌ క్రికెట్‌ బోర్డ్‌. ప్రస్తుతానికి రద్దయిన ఐపీఎల్‌ను తమ దేశంలో నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నట్లు వెల్ల‌డించింది.

ఐపీఎల్ నిర్వ హ‌ణ‌ యూఏఈకి కొత్తేమీ కాదు. 2014లో భారత్‌లో సార్వత్రిక ఎన్నికలు జరగడం వల్ల అక్కడే 20 మ్యాచ్‌లు జరిగాయి. ‘ఐపీఎల్‌ నిర్వహించేందుకు యూఏఈ ముందుకు వచ్చింది. అయితే, ప్రస్తుత సంక్షోభ స‌మ‌యంలో ఇంట‌ర్నేష‌న‌ల్ ట్రావెలింగ్స్ కు పూర్తిస్థాయి ప‌ర్మిష‌న్స్ లేని నేపథ్యంలో దాని గురించి మాట్లాడే ప్రశ్నే లేదు’ అని బీసీసీఐ కోశాధికారి అరుణ్‌ ధుమాల్‌ అన్నారు. ఐపీఎల్‌ను ఇండియాలో నిర్వహించేందుకు బీసీసీఐ రీషెడ్యూల్‌ చేసేందుకు ట్రై చేస్తోంది. ఇప్పటికే బయో సెక్యూర్‌ స్టేడియాలపై కసరత్తులు ప్రారంభించింది. అయితే, దేశంలో అనేక ప్రాంతాల్లో రెడ్‌ జోన్లు‌ ఉండటం వల్ల అది సాధ్యపడటం లేదు.