ఆఫ్గానిస్థాన్ క్రికెట్ బోర్డు సంచ‌ల‌న నిర్ణ‌యం..సీనియ‌ర్ క్రికెట‌ర్ పై 6 ఏళ్ల నిషేధం..

ఆఫ్గానిస్థాన్ క్రికెట్ బోర్డు సంచ‌ల‌న నిర్ణ‌యం..సీనియ‌ర్ క్రికెట‌ర్ పై 6 ఏళ్ల నిషేధం..

ఆఫ్గానిస్థాన్ క్రికెట్ బోర్డు సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. అవినీతికి పాల్ప‌డినందుకుగాను త‌మ క్రికెట‌ర్ ష‌ఫీఖుల్లా ష‌ఫాక్‌పై ఆరేళ్ల‌పాటు నిషేధం విధించింది. ఆఫ్గానిస్థాన్ ప్రీమియ‌ర్ లీగ్ టీ20 2018 ఎడిష‌న్‌, బంగ్లాదేశ్ ప్రీమియ‌ర్ లీగ్ 2019 ఎడిష‌న్‌ల‌లో క‌రెప్ష‌న్ చేసిన‌ట్లు అంగీక‌రించ‌డంతో తాజాగా అత‌నిపై నిషేధం విధిస్తున్నట్లు పేర్కొంది. ఆట‌గాళ్ల ప్ర‌వ‌ర్త‌న నియ‌మావ‌ళి‌లోని రూల్ 2.1.1ను అత‌ను అత్రిక‌మించిన‌ట్లు తేల్చిన బోర్డు.. ఈ మేర‌కు చ‌ర్య‌లు తీసుకుంది. ఫిక్సింగ్‌కు పాల్ప‌డ‌టం లేదా ఫిక్సింగ్ కార్య‌క‌లాపాల్లో పాలుపంచుకోవ‌డం త‌దిత‌ర అంశాల‌పై […]

Ram Naramaneni

|

May 11, 2020 | 5:05 PM

ఆఫ్గానిస్థాన్ క్రికెట్ బోర్డు సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. అవినీతికి పాల్ప‌డినందుకుగాను త‌మ క్రికెట‌ర్ ష‌ఫీఖుల్లా ష‌ఫాక్‌పై ఆరేళ్ల‌పాటు నిషేధం విధించింది. ఆఫ్గానిస్థాన్ ప్రీమియ‌ర్ లీగ్ టీ20 2018 ఎడిష‌న్‌, బంగ్లాదేశ్ ప్రీమియ‌ర్ లీగ్ 2019 ఎడిష‌న్‌ల‌లో క‌రెప్ష‌న్ చేసిన‌ట్లు అంగీక‌రించ‌డంతో తాజాగా అత‌నిపై నిషేధం విధిస్తున్నట్లు పేర్కొంది. ఆట‌గాళ్ల ప్ర‌వ‌ర్త‌న నియ‌మావ‌ళి‌లోని రూల్ 2.1.1ను అత‌ను అత్రిక‌మించిన‌ట్లు తేల్చిన బోర్డు.. ఈ మేర‌కు చ‌ర్య‌లు తీసుకుంది. ఫిక్సింగ్‌కు పాల్ప‌డ‌టం లేదా ఫిక్సింగ్ కార్య‌క‌లాపాల్లో పాలుపంచుకోవ‌డం త‌దిత‌ర అంశాల‌పై త‌న‌ను దోషిగా తేల్చింది.

అలాగే రూల్ 2.1.3ని కూడా ష‌ఫాక్ కూడా ఉల్లంఘించిన‌ట్టు ఏసీబీ తేల్చింది. ఈ రూల్ ప్ర‌కారం మ్యాచ్ ఫిక్సింగ్ కోసం ప్ర‌య‌త్నాలు చెయ్య‌డం… బుకీలు త‌న‌ను సంప్ర‌దించిన విష‌యాన్ని కావాల‌నే దాచిపెట్ట‌డం త‌దిత‌ర అభియోగాల‌తో ష‌ఫాక్‌పై ఏసీబీ చ‌ర్య‌లు తీసుకుంది. ఒక సీనియ‌ర్ క్రికెటర్ ఇలాంటి తప్పుడు చ‌ర్య‌ల‌కు పాల్ప‌డటంపై బోర్డు తీవ్ర ఆగ్ర‌హం వ్యక్తం చేసింది. మ‌రోవైపు ఆఫ్గానిస్థాన్ త‌ర‌పున గ‌తేడాది సెప్టెంబ‌ర్‌లో చివ‌రిసారిగా 30 ఏళ్ల‌ షషాక్ బ‌రిలోకి దిగాడు. జాతీయ‌జ‌ట్టు త‌ర‌పున మొత్తం 24 వ‌న్డేలు, 46 టీ20ల‌ను ఆడాడు.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu