
IND vs SL: భారత క్రికెట్ ప్రియులకు శుభవార్త. శ్రీలంక-భారత్ మ్యాచ్‌కు సంబంధించి షెడ్యూల్ వచ్చేసింది. ఈ షెడ్యూల్ ప్రకారం టీమిండియా వచ్చే నెలలోనే శ్రీలంక జట్టుతో తలపడనుంది. అంటే జులై నెలలో భారత జట్టు శ్రీలంక పర్యటనకు వెళ్తుంది. ఈ షెడ్యూల్‌లో భాగంగా 3 వన్డే, 3 టీ20 మ్యాచ్‌ల సిరీస్ ఆడనున్నారు. జులై 13 నుండి మొదటి వన్డే మ్యాచ్‌తో ప్రారంభం కానుండగా, జూలై 25 న జరిగే చివరి టి 20 మ్యాచ్‌తో ఈ పర్యటన ముగుస్తుంది. ఈ సిరీస్‌లపై బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ ఇండియా (బిసిసిఐ), శ్రీలంక క్రికెట్ (ఎస్‌ఎల్‌సి) అధికారిక ప్రకటన చేయనప్పటికీ.. ఈ సిరీస్‌ను అధికారికంగా ప్రసారం చేయనున్న సోనీ స్పోర్ట్స్ నెట్‌వర్క్ అన్ని మ్యాచ్‌ల తేదీలను ట్వీట్ ద్వారా సోమవారం విడుదల చేసింది.
విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, జస్‌ప్రీత్ బుమ్రా వంటి దిగ్గజ ప్లేయర్లు ఎవరూ ఈ సిరీస్‌లో పాల్గొనకపోవడం విశేషం. ఈ సిరీస్‌లో భారత వన్డే, టి 20 స్పెషలిస్ట్ ఆటగాళ్లను మాత్రమే ఎంపిక చేస్తారు. ఈ సిరీస్‌ను బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ గత నెలలో ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ సందర్భంగా మాట్లాడిన ఆయన.. ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్న జట్టులోని ఏ ప్లేయర్ కూడా ఈ సిరీస్‌లో పాల్గొనబోరని స్పష్టం చేశారు. భారతదేశ భవిష్యత్ క్రికెట్‌ను దృష్టిలో పెట్టుకుని ఈ వన్డే మరియు టి 20 సిరీస్‌కు ప్లేయర్లను ఎంపిక చేయడం జరిగిందన్నారు. ఇదిలాఉంటే.. వాస్తవానికి ఈ సిరీస్ గత సంవత్సరమే జరగవలసి ఉండగా.. కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా వాయిదా పడింది.
షెడ్యూల్ వివరాలు..
వన్డే సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్ జూలై 13 నుండి ప్రారంభమవుతుంది. రెండవ మ్యాచ్ జూలై 16 న, మూడవ మ్యాచ్ జూలై 18 న జరుగుతుంది. దీని తరువాత, మొదటి టి 20 మ్యాచ్ జూలై 21 న, రెండవది 23 న, చివరి మ్యాచ్ 25 న జరుగుతుంది. అయితే, ఈ పర్యటన కోసం వేదిక ఇంకా నిర్ణయించలేదు.
జూన్ చివరిలో జట్టు ప్రకటన..?
ఈ సిరీస్‌లో పాల్గొనబోయే భారత జట్టును ఈ నెలాఖరులోగా ప్రకటించే అవకాశం ఉంది. ఇందులో సీనియర్ ఆటగాళ్ళు శిఖర్ ధావన్, హార్దిక్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, యుజ్వేంద్ర చాహల్ కాకుండా, పృథ్వీ షా, నవదీప్ సైని, సూర్యకుమార్ యాదవ్ వంటి ప్లేయర్లకు మళ్ళీ అవకాశం ఇచ్చే ఛాన్స్ కనిపిస్తోంది. కెప్టెన్సీ గురించి సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. సీనియర్ ప్లేయర్ అయిన శిఖర్ ధావన్‌కు ఈ బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
Also read:
Old Currency Notes: పాత 500 రూపాయల నోట్‌తో రూ. 10 వేలు సంపాదించొచ్చు.. అదెలాగంటే..