రోహిత్ డక్ ఔట్.. వామప్ మ్యాచ్ డ్రా

సౌతాఫ్రికాతో టెస్టు సిరీస్‌లో ఓపెనర్‌గా సత్తాచాటాలని భావిస్తున్న హిట్‌మ్యాన్‌ విఫలమయ్యాడు. బోర్డు ప్రెసిడెంట్స్‌ ఎలెవన్‌, సౌతాఫ్రికా మధ్య జరిగిన మూడు రోజుల సన్నాహక మ్యాచ్‌‌లో కేవలం రెండు బంతులు మాత్రమే ఎదుర్కొని డక్ ఔట్ అయ్యాడు. కాగా, మూడు రోజుల ఈ మ్యాచ్‌ డ్రాగా ముగిసింది. శనివారం ఆట ముగిసేసమయానికి బోర్డు ఎలెవన్‌ తొలి ఇన్నింగ్స్‌లో 64 ఓవర్లకు 8 వికెట్లు కోల్పోయి 265 పరుగులు చేసింది. ఎలెవన్‌ ఇన్నింగ్స్‌లో ప్రియాంక్‌ పాంచల్‌ 60 పరుగులు చేయగా.. […]

రోహిత్ డక్ ఔట్.. వామప్ మ్యాచ్ డ్రా
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Sep 29, 2019 | 8:19 AM

సౌతాఫ్రికాతో టెస్టు సిరీస్‌లో ఓపెనర్‌గా సత్తాచాటాలని భావిస్తున్న హిట్‌మ్యాన్‌ విఫలమయ్యాడు. బోర్డు ప్రెసిడెంట్స్‌ ఎలెవన్‌, సౌతాఫ్రికా మధ్య జరిగిన మూడు రోజుల సన్నాహక మ్యాచ్‌‌లో కేవలం రెండు బంతులు మాత్రమే ఎదుర్కొని డక్ ఔట్ అయ్యాడు. కాగా, మూడు రోజుల ఈ మ్యాచ్‌ డ్రాగా ముగిసింది. శనివారం ఆట ముగిసేసమయానికి బోర్డు ఎలెవన్‌ తొలి ఇన్నింగ్స్‌లో 64 ఓవర్లకు 8 వికెట్లు కోల్పోయి 265 పరుగులు చేసింది. ఎలెవన్‌ ఇన్నింగ్స్‌లో ప్రియాంక్‌ పాంచల్‌ 60 పరుగులు చేయగా.. శ్రీకర్‌ భరత్‌ 71 పరుగుల చేశాడు. ఇక సిద్దేశ్‌ లాడ్‌ 52 పరుగులు చేశాడు. అయితే వామప్‌ మ్యాచ్‌లో ఓపెనర్‌గా రోహిత్ బరిలో దిగారు. అయితే అందరూ రోహిత్ శర్మ పరుగుల వరద పారిస్తారనుకున్నారు. కానీ కేవలం రెండు బంతులే ఆడి.. డకౌట్‌గా వెనుదిరిగాడు. ఫిలాండర్‌ బౌలింగ్‌లో కీపర్‌ క్లాసెన్‌కు క్యాచ్‌ ఇచ్చి రోహిత్‌ నిష్క్రమించాడు. అయితే అంతకుముందు తొలి ఇన్నింగ్స్‌లో బావుమా 87 పరుగులు చేసి నాటౌట్‌‌గా నిలచాడు. ఇఖ ఫిలాండర్‌ 48 పరుగులు చేశాడు. వీరి దూకుడుతో 64 ఓవర్లలో 6 వికెట్లకు సౌతాఫ్రికా 279 పరుగులు చేసి డిక్లేర్ చేసింది.