India Vs England: టీమిండియాకు గట్టి షాక్.. నాలుగో టెస్టుకు దూరమైన పేస్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా…

|

Feb 27, 2021 | 1:24 PM

India Vs England 2021: నాలుగో టెస్టుకు ముందు టీమిండియాకు భారీ షాక్ తగిలింది. ఫాస్ట్ బౌలర్ జస్ప్రిత్ బుమ్రా(Jasprit Bumrah) పలు పర్సనల్..

India Vs England: టీమిండియాకు గట్టి షాక్.. నాలుగో టెస్టుకు దూరమైన పేస్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా...
Follow us on

India Vs England 2021: నాలుగో టెస్టుకు ముందు టీమిండియాకు భారీ షాక్ తగిలింది. ఫాస్ట్ బౌలర్ జస్ప్రిత్ బుమ్రా(Jasprit Bumrah) పలు పర్సనల్ రీజన్స్ కారణంగా జట్టు నుంచి వైదొలిగాడు. ఇక ఈ విషయాన్ని బీసీసీఐ అఫీషియల్ ట్విట్టర్ ద్వారా వెల్లడించింది. అతడి స్థానంలో ఎవరిని జట్టులోకి తీసుకోవట్లేదని బీసీసీఐ సెక్రటరీ జయ్ షా తెలిపారు. వరుస విజయాలతో ఊపుమీదున్న టీమిండియాకు ఇది గట్టి షాక్ అని చెప్పాలి. జట్టు ప్రధాన బౌలర్ వైదొలగడంతో పరిస్థితి ఎలా ఉంటుందో చూడాల్సిందే. (Bumrah Ruled Out Of Fourth Test)

భారత్ జట్టు(నాలుగో టెస్టు):

విరాట్ కోహ్లీ(కెప్టెన్), రోహిత్ శర్మ, గిల్, పుజారా, రహనే, రాహుల్, హార్దిక్ పాండ్యా, వృద్దిమాన్ సాహా, రవిచంద్రన్ అశ్విన్, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, ఇషాంత్ శర్మ, సిరాజ్, ఉమేష్ యాదవ్, వాషింగ్టన్ సుందర్, రిషబ్ పంత్

పింక్ బాల్ టెస్టులో టీమిండియా విజయభేరి…

నరేంద్ర మోదీ స్టేడియంలో టీమిండియా అద్భుతమైన విజయాన్ని అందుకుంది. పింక్‌ బాల్‌ టెస్టులో టీమిండియా 49 పరుగుల చిన్న టార్గెట్‌తొ బరిలోకి దిగింది. ఆ జట్టు నిర్దేశించిన 49 పరుగుల లక్ష్యాన్ని భారత్‌ 7.4 ఓవర్లలో వికెట్‌ నష్టపోకుండా ఛేదించింది. ఇంగ్లండ్‌ జట్టు రెండో ఇన్నింగ్స్‌లో 81 పరుగులకే కుప్పకూలింది. ఇంగ్లండ్‌ బ్యాట్స్‌మెన్లలో స్టోక్స్‌ 25 పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలిస్తే.. రూట్‌ 19 పరుగులతో సరిపెట్టుకున్నాడు. టీమిండియా బౌలర్లలో అక్షర్‌ పటేల్‌ 5 వికట్లు, అశ్విన్‌ 4, సుందర్‌ ఒక వికెట్‌ తీశాడు.

(Bumrah Ruled Out Of Fourth Test)

మరిన్ని ఇక్కడ చదవండి:

కస్టమర్‌పై అరిస్తే.. డెలివరీ బాయ్‌ను మంచి పని చేశావంటున్నారు.. కారణం ఏంటంటే.. వీడియో వైరల్..!

ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో అగ్రస్థానానికి టీమిండియా.. అదే జరిగితే టోర్నీ నుంచి ఔట్.!

న్యూడ్ ఫోటో అడిగిన నెటిజన్‌కు యాంకర్ శ్రీముఖి అదిరిపోయే కౌంటర్.. ఏం షేర్ చేసిందంటే.!

హైదరాబాద్‌లోని బాలానగర్‌ ఫ్లైఓవర్‌ కుప్పకూలిందా.? వైరల్ అవుతున్న వీడియో.! ఎప్పటిదంటే..!!