India Vs England 2021: వచ్చే నెల నుంచి భారత్-ఇంగ్లాండ్ మధ్య సుదీర్ఘ సిరీస్ ప్రారంభం కానుంది. ఇప్పటికే ఆస్ట్రేలియాతో సిరీస్ గెలుచుకుని ఊపు మీదున్న టీమిండియా.. ఇంగ్లాండ్‌తో కూడా అదే జోరును కొనసాగించాలని చూస్తోంది. ఈ తరుణంలో ఇంగ్లాండ్ మాజీ ఆటగాడు గ్రెమ్ స్వాన్ తమ జట్టుకు పలు సూచనలు ఇచ్చాడు.
స్వదేశంలో టీమిండియా సింహంలా గర్జిస్తుందని.. ఆసీస్ సిరీస్ తర్వాత మరింత బలోపేతంగా తయారైందని పేర్కొన్నాడు. ఎప్పుడో జరిగే యాషెస్ సిరీస్ గురించి ఆలోచించడం పక్కనపెట్టి.. భారత్‌తో సిరీస్ ఎలా గెలవాలో ఆలోచించండి అని తెలిపాడు. కాగా, ఫిబ్రవరి 5 నుంచి ఇరు జట్ల మధ్య చెన్నై వేదికగా తొలి టెస్టు ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే.