AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IndiaVsAustralia2020: రోహిత్ ఫుల్ ఫిట్ అంటూనే మెలిక పెట్టిన బీసీసీఐ.. ఇంతకీ ఆస్ట్రేలియాతో టెస్ట్‌ సిరీస్‌లో రోహిత్ ఆడేనా..?

ఆస్ట్రేలియాతో డిసెంబర్ 17 నుంచి ప్రారంభం కానున్న నాలుగు టెస్ట్ సిరీసుల్లో టీమిండియా సీనియర్ బ్యాట్స్‌మన్ రోహిత్ శర్మ ఆడతాడా? లేదా? ఓవైపు ఆస్ట్రేలియా పర్యటనకు రోహిత్ శర్మ సిద్ధమని ప్రకటించిన బీసీసీఐ..

IndiaVsAustralia2020: రోహిత్ ఫుల్ ఫిట్ అంటూనే మెలిక పెట్టిన బీసీసీఐ.. ఇంతకీ ఆస్ట్రేలియాతో టెస్ట్‌ సిరీస్‌లో రోహిత్ ఆడేనా..?
Shiva Prajapati
| Edited By: |

Updated on: Dec 14, 2020 | 7:35 AM

Share

IndiaVsAustralia2020: ఆస్ట్రేలియాతో డిసెంబర్ 17 నుంచి ప్రారంభం కానున్న నాలుగు టెస్ట్ సిరీసుల్లో టీమిండియా సీనియర్ బ్యాట్స్‌మన్ రోహిత్ శర్మ ఆడతాడా? లేదా? ఓవైపు ఆస్ట్రేలియా పర్యటనకు రోహిత్ శర్మ సిద్ధమని ప్రకటించిన బీసీసీఐ.. మరోవైపు టీమిండియా వైద్య బృందం మరోసారి పరీక్షించి చెబితేనే గ్రీన్ సిగ్నల్ అంటూ మెలిక పెడుతోంది. ఆస్ట్రేలియా-భారత్ మధ్య జరిగిన వన్డే సిరీస్‌, టీ20 సిరీస్‌కు టీమిండియా స్టార్ బ్యాట్స్‌మన్ రోహిత్ శర్మ దూరమైన విషయం తెలిసిందే. అయితే త్వరలో జరగనున్న టెస్ట్ సిరీస్‌కు మాత్రం రోహిత్ అందుబాటులోకి వస్తాడని అంతా అనుకున్నారు. అనుకున్నట్లుగానే ఆస్ట్రేలియా పర్యటనకు రోహిత్ శర్మ సిద్ధమని, వైద్య పరంగా రోహిత్ ఫుల్ ఫిట్‌నెస్‌తో ఉన్నాడని బీసీసీఐ ప్రకటించింది. అయితే చివరి రెండు టెస్టుల్లో ఆడే విషయమై మాత్రం టీమిండియా వైద్య బృందం మరోసారి రోహిత్‌ను పరీక్షించి నిర్ణయం తీసుకుంటుందని బీసీసీఐ పేర్కొంది. ఈ ప్రకటనతో రోహిత్ శర్మ అసలు టెస్ట్‌ సిరీస్‌లో ఆడతాడా? లేదా అనే సందేహాలు ఉత్పన్నమవుతున్నాయి.

నాలుగు టెస్ట్‌ల సిరీస్‌ ఈనెల 17న ప్రారంభం కానుండగా ఈ నేపథ్యంలో రోహిత్ శర్మ సోమవారం నాడు ఆస్ట్రేలియాకు బయలుదేరుతాడు. అక్కడి వెళ్లాక రోహిత్ 14 రోజుల పాటు క్వారంటైన్‌లో ఉంటాడని, ఆ సమయంలో రోహిత్ అనుసరించాల్సిన కార్యచరణను రూపొందించామని బీసీసీఐ తెలిపింది. క్వారంటైన్ అనంతరం టీమిండియా వైద్య బృందం రోహిత్ ఫిట్‌నెస్‌ను మరోసారి పరీక్షించి.. బరిలోకి దింపాలా వద్దా అనేదానిపై తుది నిర్ణయం తీసుకుంటుందని బీసీసీఐ తన ప్రకటనలో పేర్కొంది.

Also Read:

దారుణాతి దారుణం.. ఆన్‌లైన్ ప్రేక్షకుడి సవాల్.. 1300 డాలర్ల పందెం కోసం ప్రేయసి ప్రాణాలను గాల్లో కలిపేసిన ప్రియుడు..

ఇతన్ని అదృష్టానికే బ్రాండ్ అంబాసిడర్ అనాలేమో.. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 160 లాటరీ టికెట్లు..