AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

భారత్ – ఆసీస్ సిరీస్… రెండో ప్రాక్టీస్ మ్యాచ్ డ్రా… సెంచరీలతో అదరగొట్టిన పంత్, విహారి…

తొలి టెస్టు మ్యాచ్ ముందు భారత టీంకు మంచి ప్రాక్టీస్ దొరికింది. సిడ్నీ వేదికగా ఆరంభమైన రెండో ప్రాక్టీస్ మ్యాచ్‌లో టాస్ గెలిచి టీమిండియా మొదట బ్యాటింగ్ చేసింది.

భారత్ - ఆసీస్ సిరీస్... రెండో ప్రాక్టీస్ మ్యాచ్ డ్రా... సెంచరీలతో అదరగొట్టిన పంత్, విహారి...
TV9 Telugu Digital Desk
|

Updated on: Dec 13, 2020 | 8:32 PM

Share

తొలి టెస్టు మ్యాచ్ ముందు భారత టీంకు మంచి ప్రాక్టీస్ దొరికింది. సిడ్నీ వేదికగా ఆరంభమైన రెండో ప్రాక్టీస్ మ్యాచ్‌లో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 194 పరుగులకి ఆలౌటైంది. తొలి ఇన్నింగ్స్‌లో జస్‌ప్రీత్ బుమ్రా (55 నాటౌట్: 6×4, 2×6) టాప్ స్కోరర్‌గా నిలవగా.. అనంతరం తొలి ఇన్నింగ్స్‌ ఆడిన ఆస్ట్రేలియా- ఎ జట్టు 108 పరుగులకే ఆలౌటైంది. దాంతో.. 86 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యాన్ని అందుకున్న భారత్ జట్టు.. రెండో ఇన్నింగ్స్‌లో చెలరేగిపోయింది. మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్‌లు హనుమ విహారి (104 నాటౌట్: 194 బంతుల్లో 13×4), రిషబ్ పంత్ (103 నాటౌట్: 73 బంతుల్లో 9×4, 6×6) సెంచరీలు నమోదు చేశారు. దాంతో.. రెండో ఇన్నింగ్స్‌ని 386/4తో భారత్ డిక్లేర్ చేసింది.

ఆటలో చివరి రోజైన ఆదివారం 473 పరుగుల లక్ష్యఛేదనకు దిగిన ఆస్ట్రేలియా జట్టులో బెన్ మెక్‌డెర్‌మాట్ (107 నాటౌట్: 167 బంతుల్లో 16×4), జాక్ వైల్డర్‌మూత్ (111 నాటౌట్: 119 బంతుల్లో 12×4, 3×6) అజేయ సెంచరీలు నమోదు చేశారు. దాంతో.. మ్యాచ్ ఫలితం తేలే అవకాశం లేనందున ఇరు జట్ల కెప్టెన్లు డ్రాకి అంగీకరించారు. మ్యాచ్ నిలిచిపోయే సమయానికి ఆస్ట్రేలియా 307/4తో నిలిచింది. భారత్, ఆస్ట్రేలియా మధ్య అడిలైడ్ వేదికగా డిసెంబర్ 17 నుంచి తొలి టెస్టు మ్యాచ్ ప్రారంభంకానుంది.

Follow Us
హైదరాబాద్‌ మద్రాస్‌ రెజిమెంట్‌లో ఆర్మీ ఆయుధాలు చోరీ..
హైదరాబాద్‌ మద్రాస్‌ రెజిమెంట్‌లో ఆర్మీ ఆయుధాలు చోరీ..
వైభవ్ మార్క్ డామినేషన్.. తానేంటో మరోసారి ప్రూవ్ చేసిన వండర్ కిడ్
వైభవ్ మార్క్ డామినేషన్.. తానేంటో మరోసారి ప్రూవ్ చేసిన వండర్ కిడ్
చుట్టూ ఉన్నవన్నీ కొట్టుకుపోయినా ఆ ఇల్లు ఎలా నిలబడింది? రహస్యం ఇదే
చుట్టూ ఉన్నవన్నీ కొట్టుకుపోయినా ఆ ఇల్లు ఎలా నిలబడింది? రహస్యం ఇదే
రోడ్లపై కనిపించే ఈ మొక్క తెలుసా? ఆ రోగానికి బ్రహ్మస్త్రం..
రోడ్లపై కనిపించే ఈ మొక్క తెలుసా? ఆ రోగానికి బ్రహ్మస్త్రం..
వీరిని కష్టాల నుంచి కాపాడటానికి వస్తున్న కర్మ ప్రదాత..
వీరిని కష్టాల నుంచి కాపాడటానికి వస్తున్న కర్మ ప్రదాత..
ఉక్రెయిన్‌పై భారత్‌ స్టాండ్‌ మరోసారి క్లియర్!
ఉక్రెయిన్‌పై భారత్‌ స్టాండ్‌ మరోసారి క్లియర్!
రోడ్ల దుస్థితిపై వ్యక్తి వినూత్న నిరసన..!
రోడ్ల దుస్థితిపై వ్యక్తి వినూత్న నిరసన..!
లోన్ EMI చెల్లించకపోతే ఫోన్ లాక్ అవుతుందా? ఆర్బీఐ కొత్త రూల్స్‌!
లోన్ EMI చెల్లించకపోతే ఫోన్ లాక్ అవుతుందా? ఆర్బీఐ కొత్త రూల్స్‌!
100 ఏళ్లైనా బుడ్డోడి ఈ డేంజరస్ రికార్డులను బద్దలు కొట్టడం కష్టమే
100 ఏళ్లైనా బుడ్డోడి ఈ డేంజరస్ రికార్డులను బద్దలు కొట్టడం కష్టమే
కోతుల బెడదకు ఎలుగుబంటి అవతారం,పత్తి పంటకు రక్షణగా సరికొత్త ట్రిక్
కోతుల బెడదకు ఎలుగుబంటి అవతారం,పత్తి పంటకు రక్షణగా సరికొత్త ట్రిక్