India vs Australia: ఆస్ట్రేలియా-భారత్‌ టెస్ట్‌ మ్యాచ్‌.. స్టేడియంలోకి 25 శాతం మందికే అనుమతి

India vs Australia: ఆస్ట్రేలియాలోని సిడ్నీలో కోవిడ్‌ కేసులు అధికంగా ఉండటంతో ఆస్ట్రేలియా-భారత్‌ టెస్ట్‌ మ్యాచ్‌ కోసం స్టేడియంలోకి వచ్చే ప్రేక్షకుల సంఖ్య ....

India vs Australia: ఆస్ట్రేలియా-భారత్‌ టెస్ట్‌ మ్యాచ్‌.. స్టేడియంలోకి 25 శాతం మందికే అనుమతి

Edited By:

Updated on: Jan 05, 2021 | 1:09 PM

India vs Australia: ఆస్ట్రేలియాలోని సిడ్నీలో కోవిడ్‌ కేసులు అధికంగా ఉండటంతో ఆస్ట్రేలియా-భారత్‌ టెస్ట్‌ మ్యాచ్‌ కోసం స్టేడియంలోకి వచ్చే ప్రేక్షకుల సంఖ్య కూడా భారీగా తగ్గనుంది. గతంలో 50 శాతం మందిని అనుమతించాలని నిర్ణం తీసుకున్నా.. తాజాగా పరిస్థితులను బట్టి 25 శాతానికి తగ్గించారు. ఎస్‌సీజీ 38 వేల సామర్థ్యంతో ఉండగా, కొత్త నిబంధనలతో రోజుకు 9,500 మందిని మాత్రమే ప్రత్యక్షంగా మ్యాచ్‌ను చూసేందుకు అవకాశం ఉంది. ఇప్పటికే టికెట్లను కొనుగోలు చేసిన వారికి నగదు వాపస్‌ చేస్తున్నట్లు ఆస్ట్రేలియా పేర్కొంది.

కాగా, కోవిడ్‌ నిబంధనలకు సంబంధించి వరుసగా జరుగుతున్న పరిణామాలపై భారత జట్టులో తీవ్ర అసహానం వ్యక్తం అవుతోంది. ఒక వైపు స్టేడియాల్లోకి ప్రేక్షకులను అనుమతిస్తూనే తమపై మాత్రం కఠిన ఆంక్షలేమిటని ప్రశ్నిస్తోంది. తమను జూలో జంతువులుగా చూడటం సరైంది కాదంటున్నారు. మూడో టెస్ట్‌ జరిగే సిడ్నీలోనూ కేసులు అధికంగా ఉండటంతో ఇక్కడి ప్రొటోకాల్‌ ప్రకారం మ్యాచ్‌ ముగిశాక ఆటగాళ్లంతా నేరుగా హోటల్‌కు వెళ్లి గదుల్లోనే ఉండాల్సి ఉంటుంది. ప్రేక్షకులు మాత్రం స్వచ్ఛగా స్టేడియాల్లోకి వచ్చి మ్యాచ్‌ను తిలకించేందుకు అనుమతిస్తున్నారు. కానీ మమ్మల్ని మైదానంలో క్రికెట్‌ ఆడాక నేరుగా హోటల్‌కు వెళ్లి క్వారంటైన్‌లో ఉండాలంటున్నారని, కరోనా పరీక్షల్లో నెగిటివ్‌ రిపోర్టు వచ్చాక కూడా ఇలాంటి నిబంధనలేంటని మండిపడుతున్నారు.

Also Read:

Australian Open Quarantine: ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ క్వారంటైన్‌ సెంటర్‌పై ఆందోళన.. కోర్టులో కేసు వేస్తాం..

Sourav Ganguly Health Update: నిలకడగా బీసీసీఐ అధ్యక్షుడు సౌరబ్‌ గంగూలీ ఆరోగ్యం.. 6న డిశ్చార్జ్‌..!