48.2 ఓవర్లు

| Edited By:

Mar 09, 2019 | 4:22 PM

ప్ర‌స్తుతం భార‌త్‌-ఆస్ట్రేలియా మ‌ధ్య జ‌రుగుతున్న వ‌న్డే సిరీస్‌లో ఓ అరుదైన విష‌యం చోటు చేసుకుంది. ఈ సిరీస్‌లో ఇప్ప‌టివ‌ర‌కు భార‌త్‌, ఆస్ట్రేలియా మ‌ధ్య జ‌రిగిన మూడు మ్యాచ్‌ల్లోనూ టీమిండియా 48.2 ఓవ‌ర్ల పాటు మాత్ర‌మే బ్యాటింగ్ చేయ‌డం విశేషం. హైద‌రాబాద్‌లో జ‌రిగిన తొలి వ‌న్డే మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌కు దిగిన‌ ఆస్ట్రేలియా 236 ప‌రుగులు చేసింది. ఛేద‌నకు దిగిన టీమిండియా 48.2 ఓవ‌ర్ల‌లో 4 వికెట్లు కోల్పోయి ల‌క్ష్యాన్ని ఛేదించింది. అనంత‌రం నాగ్‌పూర్‌లో జ‌రిగిన రెండో వ‌న్డేలో […]

48.2 ఓవర్లు
Follow us on

ప్ర‌స్తుతం భార‌త్‌-ఆస్ట్రేలియా మ‌ధ్య జ‌రుగుతున్న వ‌న్డే సిరీస్‌లో ఓ అరుదైన విష‌యం చోటు చేసుకుంది. ఈ సిరీస్‌లో ఇప్ప‌టివ‌ర‌కు భార‌త్‌, ఆస్ట్రేలియా మ‌ధ్య జ‌రిగిన మూడు మ్యాచ్‌ల్లోనూ టీమిండియా 48.2 ఓవ‌ర్ల పాటు మాత్ర‌మే బ్యాటింగ్ చేయ‌డం విశేషం.

హైద‌రాబాద్‌లో జ‌రిగిన తొలి వ‌న్డే మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌కు దిగిన‌ ఆస్ట్రేలియా 236 ప‌రుగులు చేసింది. ఛేద‌నకు దిగిన టీమిండియా 48.2 ఓవ‌ర్ల‌లో 4 వికెట్లు కోల్పోయి ల‌క్ష్యాన్ని ఛేదించింది. అనంత‌రం నాగ్‌పూర్‌లో జ‌రిగిన రెండో వ‌న్డేలో తొలుత బ్యాటింగ్ చేసిన భార‌త్ 48.2 ఓవ‌ర్ల‌లో 250 ప‌రుగుల‌కు ఆలౌటైంది. ఆ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ల‌క్ష్యాన్ని ఛేదించ‌లేక ఓట‌మి పాలైంది. తాజాగా రాంచీలో జరిగిన మూడో వ‌న్డేలో 314 ప‌రుగుల ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన భార‌త్ 48.2 ఓవ‌ర్ల‌లో 281 ప‌రుగుల‌కు ఆలౌటైంది. ఇలా మూడు మ్యాచ్‌ల్లోనూ 48.2 ఓవ‌ర్లు మాత్ర‌మే టీమిండియా బ్యాటింగ్ చేయ‌డం విశేషంగా మారింది.