ఫిక్సింగ్ ఆరోపణలు.. ఇద్దరు యూఏఈ క్రికెటర్లపై ఐసీసీ నిషేధం
మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణల నేపథ్యంలో ఇద్దరు యూఏఈ క్రికెటర్లపై అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) చర్యలు తీసుకుంది
UAE Cricketers ICC: మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణల నేపథ్యంలో ఇద్దరు యూఏఈ క్రికెటర్లపై అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) చర్యలు తీసుకుంది. ఆమిర్ హయత్, అష్ఫఖ్ అహ్మద్‌లపై తాత్కాలిక నిషేధం విధిస్తున్నట్లు తెలిపింది. వీరిద్దరిపై ఐదు వేర్వేరు ఆరోపణలు నమోదు కాగా.. 14 రోజుల్లో ఆ ఆరోపణలకు సమాధానం ఇవ్వాలంటూ ఐసీసీ వెల్లడించింది. వారిద్దరిపై ఎలాంటి ఆరోపణలు ఉన్నాయో ఐసీసీ స్పష్టత ఇవ్వలేదు. కాగా అష్ఫఖ్ 16 వన్డేలు, 12 టీ20ల్లో జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించారు. అలాగే హయత్ 8 వన్డేలు 4 టీ20లు ఆడారు.
Read More:
శ్రావణి కేసు: పరారీలో ఆర్‌ఎక్స్ 100 నిర్మాత
‘కౌన్ బనేగా’ గెలిచాక ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నా.. నా భార్యతో విడాకుల వరకు వెళ్లా