అతి చేస్తోన్న ఐసీసీ.. ఫ్యాన్స్ గరంగరం

అతి చేస్తోన్న ఐసీసీ.. ఫ్యాన్స్ గరంగరం

క్రికెట్ లెజండ్స్ విషయంలో అంతర్జాతీయ క్రికెట్ కమిటీ అదుపు తప్పుతోందా..? అంటే అవుననే అంటున్నారు అభిమానులు. అంతర్జాతీయంగా క్రికెట్‌, క్రికెటర్ల స్థాయిని పెంచాల్సింది పోయి.. వారిని వెక్కిరిస్తూ ఆ కమిటీ చేసే ట్వీట్లపై పలువురు ఫైర్ అవుతున్నారు. మొన్నటికి మొన్న డేవిడ్ వార్నర్‌ను కించపరుస్తూ ఓ ట్వీట్ చేసింది ఐసీసీ. ఇటీవల జరిగిన యాషెస్ టెస్ట్‌ సిరీస్‌లో వార్నర్.. ఘోరంగా విఫలమవ్వగా.. ఆయనపై స్పందిస్తూ వయస్సు అయిపోయిందంటూ కామెంట్ పెట్టింది. దీనిపై ఆయన అభిమానులు మండిపడ్డారు. ఓ […]

TV9 Telugu Digital Desk

| Edited By:

Sep 07, 2019 | 2:05 PM

క్రికెట్ లెజండ్స్ విషయంలో అంతర్జాతీయ క్రికెట్ కమిటీ అదుపు తప్పుతోందా..? అంటే అవుననే అంటున్నారు అభిమానులు. అంతర్జాతీయంగా క్రికెట్‌, క్రికెటర్ల స్థాయిని పెంచాల్సింది పోయి.. వారిని వెక్కిరిస్తూ ఆ కమిటీ చేసే ట్వీట్లపై పలువురు ఫైర్ అవుతున్నారు. మొన్నటికి మొన్న డేవిడ్ వార్నర్‌ను కించపరుస్తూ ఓ ట్వీట్ చేసింది ఐసీసీ. ఇటీవల జరిగిన యాషెస్ టెస్ట్‌ సిరీస్‌లో వార్నర్.. ఘోరంగా విఫలమవ్వగా.. ఆయనపై స్పందిస్తూ వయస్సు అయిపోయిందంటూ కామెంట్ పెట్టింది. దీనిపై ఆయన అభిమానులు మండిపడ్డారు. ఓ క్రికెట్ లెజండ్‌కు కనీస గౌరవ మర్యాదలు ఇవ్వాలని వారు కామెంట్లు పెడుతున్నారు.

అయితే ఇప్పుడే కాదు ఇదివరకు కూడా పలువురు క్రికెట్ లెజండ్ల విషయాల్లో ఐసీసీ చేసిన ట్వీట్లు వివాదాస్పదంగా మారాయి. ఇటీవల ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్‌లో క్రికెట్ దేవుడు, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ స్థానం సాధించగా.. సచిన్ గ్రేటెస్ట్ క్రికెటరా..? అంటూ ట్విట్టర్‌లో ప్రశ్నించింది.

అంతేకాదు బెన్ స్టోక్స్, సచిన్ ఉన్న ఫొటోను పెట్టి క్రికెట్ వరల్డ్ కప్.. గ్రేటెస్ట్ క్రికెటర్ మరియు సచిన్ టెండూల్కర్ అంటూ కామెంట్ పెట్టగా.. చెప్పినట్లే అని ఐసీసీ దానికి మద్దతును తెలిపింది. ఇది కూడా వివాదాస్పదంగా మారింది. క్రికెట్‌ లెజండ్స్ హిస్టరీలో సచిన్ కచ్చితంగా ఉంటారు. అలాంటి ఆయన విషయంలో పలుసార్లు ఐసీసీ వేసిన ట్వీట్లపై సచిన్ అభిమానులు ఇప్పటికే ఐసీసీని ఆడుకున్నారు.

అలాగే బెన్‌ స్టోక్స్, స్మిత్‌ ఫొటోను ఒకటి పెట్టి అప్పుడూ కాంట్రవర్సియల్‌గా ట్వీట్ చేసింది ఐసీసీ. ఇలా వరుసగా క్రికెట్ లెజండ్లపై ఆ మండలి వేసే ట్వీట్లు అందరిలో ఆగ్రహాన్ని తెప్పిస్తున్నాయి.

ముందు క్రికెట్‌లో సంస్కరణలు చేయండి.. మీ తప్పిదాలను చూసుకోండి అంటూ పలువురు కామెంట్లు పెడుతున్నారు. మరి ఇప్పటికైనా లెజండ్ క్రికెటర్లను కించపరిచే విషయంలో ఐసీసీ తన ధోరణిని మార్చుకుంటుందేమో చూడాలి.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu