Cricket: కుల్దీప్ యాదవ్ పై ప్రశంసల జల్లు కురిపించిన మరో స్పిన్నర్.. ఏమన్నారంటే..

|

Oct 12, 2022 | 2:27 PM

దక్షిణాఫ్రికాతో జరిగిన టీ20 సిరీస్ లో ఆకట్టుకున్న బౌలర్లలో కుల్దీప్ యాదవ్ ఒకరు. సిరీస్ డిసైడింగ్ మ్యాచ్ లో 4.1 ఓవర్లు వేసి నాలుగు వికెట్లు తీసుకుని, భారత్ గెలుపులో కీలక పాత్ర పోషించాడు కుల్దీప్ యాదవ్. దీంతో అతడిపై మాజీ క్రికెటర్లతో పాటు తాజా క్రికెటర్లు సైతం..

Cricket: కుల్దీప్ యాదవ్ పై ప్రశంసల జల్లు కురిపించిన మరో స్పిన్నర్.. ఏమన్నారంటే..
Kuldeep Yadav
Follow us on

దక్షిణాఫ్రికాతో జరిగిన టీ20 సిరీస్ లో ఆకట్టుకున్న బౌలర్లలో కుల్దీప్ యాదవ్ ఒకరు. సిరీస్ డిసైడింగ్ మ్యాచ్ లో 4.1 ఓవర్లు వేసి నాలుగు వికెట్లు తీసుకుని, భారత్ గెలుపులో కీలక పాత్ర పోషించాడు కుల్దీప్ యాదవ్. దీంతో అతడిపై మాజీ క్రికెటర్లతో పాటు తాజా క్రికెటర్లు సైతం ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. అలాగే భారత స్పిన్నర్ రవిచంద్ర అశ్విన్ కూడా లెఫ్ట్‌ ఆర్మ్‌ స్పిన్నర్‌ కుల్దీప్‌ యాదవ్‌ పై ప్రశంసల జల్లు కురిపించారు. కుల్దీప్ యాదవ్ లో ఉన్న ఒక ప్రత్యేక లక్షణమే అతడిని అద్భుతమైన బౌలర్‌గా నిలబెడుతోందని రవిచంద్రన్‌ అశ్విన్‌ పొగడ్తలతో ముంచెత్తాడు. తన యూట్యూబ్‌ ఛానల్‌లో అశ్విన్‌ మాట్లాడుతూ.. మణికట్టు స్పిన్నర్ల విషయానికి వస్తే కుల్దీప్‌ను అద్భుతమైన బౌలర్‌గా పరిగణిస్తానని తెలిపాడు. ఒకేరకమైన లెంగ్త్‌ను పునరావృతం చేయడమే స్పిన్నర్స్‌ సామర్థ్యమనని పేర్కొన్నాడు. కుల్దీప్‌ యాదవ్ లోని ఈ సామర్థ్యమే టెస్టు మ్యాచ్‌ల్లో అతడికి రివార్డులను తెస్తుందని ప్రశంసించాడు.

మణికట్టు స్పిన్నర్ల గురించి చర్చ వచ్చినప్పుడల్లా.. కుల్దీప్‌ యాదవ్ గురించే ఆలోచన వస్తుందని, అతడు ఒకే విధమైన లెంగ్త్‌తో బంతులను మళ్లీమళ్లీ సంధించగలడని అన్నాడు. టెస్టు మ్యాచ్‌ల్లో రాణించడానికి ఇది చాలా అవసరమైన సామర్థ్యమని అన్నాడు. అతడు బంతిని తగిన సమయంలో అవసరమైన ప్రదేశంలో ల్యాండ్‌ చేయగలడని, అది ఒక మణికట్టు స్పిన్నర్‌కు ఉండాల్సిన అద్భుతమైన లక్షణమంటూ ప్రశంసల జల్లు కురిపించాడు. అదే అతడిని విలువైన స్పిన్నర్‌గా మారుస్తోందని అన్నాడు అశ్విన్.

దక్షిణాఫ్రికాతో సిరీస్‌లో మూడు వన్డేలు ఆడిన కుల్దీప్ యాదవ్ మొదటి మ్యాచ్ లో 39 పరుగులిచ్చి ఒక వికెట్ తీసుకోగా, రెండో మ్యాచ్ లో 49 పరుగులిచ్చి ఒక వికెట్ తీశాడు. మూడో మ్యాచ్ లో నాలుగు వికెట్లు పడగొట్టి 18 పరుగులు మాత్రమే ఇచ్చిన విషయం తెలిసిందే. రవిచంద్ర అశ్విన్ తో పాటు భారత్ క్రికెట్ జట్టు మాజీ కోచ్‌ రవిశాస్త్రి గతంలోనే కుల్దీప్‌ యాదవ్ ను ఆకాశానికి ఎత్తేసిన విషయం తెలిసిందే.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రీడా వార్తల కోసం చూడండి..