FIFA WC 2022 Prize Money: ఫీఫా ప్రపంచకప్ విజేతకు అందే ప్రైజ్ మనీ ఎంత ఉంటుందో మీకు తెలుసా..? తెలిస్తే అమ్మో అనాల్సిందే..

|

Dec 18, 2022 | 11:21 AM

డిఫెండిగ్ చాంపియన్స్‌గా టోర్నీ బరిలోకి దిగిన ఫ్రాన్స్‌పై లియోనెల్ మెస్సీ నేతృత్వంలోని అర్జెంటీనా జట్టు విజయం సాధించాలని చాలా మంది ఫుట్‌బాల్ క్రీడాభిమానులు కోరుకుంటున్నారు. అయితే ఫీఫా వరల్డ్ కప్ 2022 ఫైనల్‌లో టోర్నమెంట్‌ విజేతగా నిలిచినవారికి.. అలాగే రన్నరప్‌గా నిలిచిన వారికి ఎంత మొత్తంలో ప్రైజ్ మనీ అందుతుందో మీకు తెలుసా..?

FIFA WC 2022 Prize Money: ఫీఫా ప్రపంచకప్ విజేతకు అందే ప్రైజ్ మనీ ఎంత ఉంటుందో మీకు తెలుసా..? తెలిస్తే అమ్మో అనాల్సిందే..
Fifa World Cup 2022 Prize Money Details
Follow us on

ఖతర్ వేదికగా జరుగుతున్న ఫీఫా ప్రపంచ కప్ 2022 ముగింపు దశకు వచ్చేసింది. ఖతర్‌ దేశంలోని లూసెయిల్ స్టేడియంలో ఆదివారం(డిసెంబర్ 18న) ఫ్రాన్స్, అర్జెంటీనా మధ్య  ఫైనల్ జరగనుంది. డిఫెండిగ్ చాంపియన్స్‌గా టోర్నీ బరిలోకి దిగిన ఫ్రాన్స్‌పై లియోనెల్ మెస్సీ నేతృత్వంలోని అర్జెంటీనా జట్టు విజయం సాధించాలని చాలా మంది ఫుట్‌బాల్ క్రీడాభిమానులు కోరుకుంటున్నారు. ఫీఫా వరల్డ్ కప్ చరిత్రలో మూడోసారి టోర్నీ టైటిల్ గెలుచుకోవాలనే పట్టుదలతో రెండు జట్లు ఆదివారం జరిగే మ్యాచ్ కోసం సిద్ధమయ్యాయి. ఇక ప్రపంచకప్ ట్రోఫీని అర్జెంటీనా 1978, 1986లో గెలుచుకోగా, ఫ్రాన్స్ 1998, 2018లో సాధించుకుంది. అయితే ఫీఫా వరల్డ్ కప్ 2022 ఫైనల్‌లో టోర్నమెంట్‌ విజేతగా నిలిచినవారికి.. అలాగే రన్నరప్‌గా నిలిచిన వారికి ఎంత మొత్తంలో ప్రైజ్ మనీ అందుతుందో మీకు తెలుసా..? అసలు ఎంత ఉంటుందనే ఆలోచన అయినా మీకు కలిగిందా ఎప్పుడైనా..? ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

ప్రైజ్ మనీ వివరాలు

ఫీఫా వరల్డ్ కప్ 2022 ఫైనల్ విజేతకు రూ.347 కోట్ల($42 మిలియన్లు) బహుమతి లభిస్తుంది. అలాగే రన్నరప్‌గా నిలిచిన జట్టుకు రూ.248 కోట్ల($30 మిలియన్లు) ప్రైజ్ మనీ అందుతుంది. అంటే ఫైనల్ మ్యాచ్‌కు రూ. 595 కోట్ల($72 మిలియన్లు) ప్రైజ్ మనీ ఉందని అర్థం. ఇదే క్రమంలో మూడో స్థానంలో నిలిచిన జట్టు(క్రొయేషియా)కు 223 కోట్ల రూపాయలు.. నాలుగో స్థానంలో నిలిచన టీమ్(మొరాకో)కు 206 కోట్ల రూపాయల నగదు బహుమతి అందుతుంది. ఇక క్వార్టర్ ఫైనల్స్‌కు చేరిన జట్ల(బ్రెజిల్, నెదర్లాండ్స్, పోర్చుగల్, ఇంగ్లండ్)కు 140 కోట్ల రూపాయలను ఇస్తారు. ఇక టోర్నమెంట్ గ్రూప్ దశలో పాల్గొన్న ఖతార్, ఈక్వెడార్, వేల్స్, ఇరాన్, మెక్సికో, సౌదీ అరేబియా, డెన్మార్క్, ట్యునీషియా, కెనడా, బెల్జియం, జర్మనీ, కోస్టారికా, సెర్బియా, కామెరూన్, ఘనా, ఉరుగ్వే  దేశాలకు 74 కోట్ల రూపాయల చోప్పున ప్రైజ్ మనీ అందుతుంది.

మెస్సీ రిటైర్‌మెంట్

ఫీఫా ప్రపంచకప్ 2022 టోర్నీ ఫైనల్‌ మ్యాచ్‌కు ముందుగానే అర్జెంటీనా కెప్టెన్ లియోనెల్ మెస్సీ ఈ టైటిల్ పోరు తర్వాత అంతర్జాతీయ ఫుట్‌బాల్ నుంచి రిటైర్ అవుతున్నట్లు ప్రకటించాడు. మెస్సీ తన కెరీర్‌లో తొలిసారి ప్రపంచకప్ ట్రోఫీని గెలుచుకోవడంపై కన్నేశాడు. ఇదే తరహాలో 2018లో ఈ ఘనత సాధించిన ఎంబాప్పే తన కెరీర్‌లో రెండో ప్రపంచకప్ టైటిల్‌ను గెలుచుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రీడా వార్తల కోసం చూడండి..