ఐదో బౌలర్‌గా స్థిరపడాలనుకుంటున్నా: హనుమ విహారి!

| Edited By:

Aug 27, 2019 | 12:02 AM

టెస్టు జట్టులో స్థానం పదిలం చేసుకొనేందుకు తన ఆఫ్‌స్పిన్‌ నైపుణ్యాన్ని సానబెట్టుకోవాలని భావిస్తున్నానని టీమిండియా క్రికెటర్‌ హనుమ విహారి అన్నాడు. తుది జట్టులో ఆరో బ్యాట్స్‌మన్‌గా కొనసాగేందుకు అవకాశం ఉంటుందని వెల్లడించాడు. వెస్టిండీస్‌తో జరిగిన తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో అతడు 93 పరుగులు చేసిన సంగతి తెలిసిందే. అతడు బౌలింగ్‌ నైపుణ్యాలను మెరుగు పెట్టుకొంటే సీనియర్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌కు దాదాపుగా చెక్‌ చెప్పినట్టే! ‘నా కోసమే కాదు జట్టు కోసం నా ఆఫ్‌స్పిన్‌ నైపుణ్యాలను […]

ఐదో బౌలర్‌గా స్థిరపడాలనుకుంటున్నా: హనుమ విహారి!
Follow us on

టెస్టు జట్టులో స్థానం పదిలం చేసుకొనేందుకు తన ఆఫ్‌స్పిన్‌ నైపుణ్యాన్ని సానబెట్టుకోవాలని భావిస్తున్నానని టీమిండియా క్రికెటర్‌ హనుమ విహారి అన్నాడు. తుది జట్టులో ఆరో బ్యాట్స్‌మన్‌గా కొనసాగేందుకు అవకాశం ఉంటుందని వెల్లడించాడు. వెస్టిండీస్‌తో జరిగిన తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో అతడు 93 పరుగులు చేసిన సంగతి తెలిసిందే. అతడు బౌలింగ్‌ నైపుణ్యాలను మెరుగు పెట్టుకొంటే సీనియర్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌కు దాదాపుగా చెక్‌ చెప్పినట్టే!

‘నా కోసమే కాదు జట్టు కోసం నా ఆఫ్‌స్పిన్‌ నైపుణ్యాలను మెరుగు చేసుకోవాలి. అప్పుడు ఐదో బౌలర్‌గా జట్టు కూర్పులో ఉంటాను. నేను మెరుగైతే ఎక్కువ ఓవర్లు వేస్తాను. అప్పుడు జట్టుకు మేలు జరుగుతుంది. భారత క్రికెట్‌ చరిత్రలో అత్యుత్తమ స్పిన్నర్లలో ఒకడైన అశ్విన్‌ సాయం అందుతున్నందుకు అదృష్టవంతుడిని. పరిస్థితులను అనుసరించి ఎలా బౌలింగ్‌ చేయాలో సీనియర్లను అడిగి తెలుసుకుంటున్నా’ అని ఈ ఆంధ్రా క్రికెటర్‌ వెల్లడించాడు.