FIFA WORLD CUP 2022: ఫైనల్‌ పోరుకు సర్వం సిద్ధం.. మూడోసారి కప్‌ను ముద్దాడేది ఎవరో.. ఇరు జట్ల బలాబలాలు ఇవే

ఫుట్‌ బాల్‌ ప్రపంచకప్‌ చివరి అంకానికి చేరుకుంది. దాదాపు 28 రోజుల పాటు సాగిన భీకర పోరులో విజేత ఎవరో కొద్ది గంటల్లో తేలనుంది. ఎవరూ గెలిచినా మూడోసారి ఫుట్ బాల్‌ ప్రపంచకప్‌ను..

FIFA WORLD CUP 2022: ఫైనల్‌ పోరుకు సర్వం సిద్ధం.. మూడోసారి కప్‌ను ముద్దాడేది ఎవరో.. ఇరు జట్ల బలాబలాలు ఇవే
Fifa World Cup Final Match
Follow us
Amarnadh Daneti

|

Updated on: Dec 18, 2022 | 7:07 AM

ఫుట్‌ బాల్‌ ప్రపంచకప్‌ చివరి అంకానికి చేరుకుంది. దాదాపు 28 రోజుల పాటు సాగిన భీకర పోరులో విజేత ఎవరో కొద్ది గంటల్లో తేలనుంది. ఎవరూ గెలిచినా మూడోసారి ఫుట్ బాల్‌ ప్రపంచకప్‌ను ముద్దాడనున్నారు. ఖతార్‌లో జరుగుతున్న ఫిఫా వరల్డ్‌కప్‌ ఫైనల్‌ పోరు మరికొన్ని గంటల్లోనే మొదలు కానుంది. అతిపెద్ద లుసైల్‌ స్టేడియంలో జరిగే అంతిమ పోరుకు.. అర్జెంటీనా, ఫ్రాన్స్‌ జట్లు రెడీ అయ్యాయి. ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ కలిగిన ఆట ఫుట్‌బాల్‌. అలాంటి టాప్‌ మోస్ట్‌ గేమ్‌లోని టఫెస్ట్‌ కాంపిటీషన్‌, వరల్డ్‌ కప్‌ సమరం. మొత్తం 32 జట్లు పాల్గొన్న ఈ మెగా టోర్నీలో.. ఒక్కో దశ దాటుకుంటూ ఫైనల్‌ వరకు చేరాయి అర్జెంటీనా, ఫ్రాన్స్‌ జట్లు. ఒక టీమ్ డిఫెండింగ్‌ చాంపియన్‌. ఇంకో టీమ్‌ ఎన్నో ఏళ్లుగా కప్‌ కోసం ఎదురుచూస్తున్న జట్టు. ఎవరు గెలుస్తారు అనే ఉత్సాహం అందరిలోనూ నెలకొంది.

ప్రాన్స్‌కు అనుకూలంశాలు..

ఫ్రాన్స్‌ బలాబలాలు చూస్తే.. మతిపోక తప్పదు. ఇంతటి బలమైన జట్టు గతంలో ఎన్నడూ చూడలేదని ఫుట్‌బాల్‌ పండితులు చెబుతున్నారు. గ్రూప్‌ డీలో టాప్‌లో నిలిచిన ఫ్రెంచ్‌ టీమ్‌… ప్రీక్వార్టర్స్‌లో బలమైన పోలాండ్‌ను చిత్తుగా ఓడించింది. ఇక క్వార్టర్స్‌లో ఇంగ్లండ్‌ నుంచి టఫ్‌ కాంపిటీషన్‌ ఎదురైంది. ఈ టోర్నీలోనే ఈ పోరు అన్నింటికన్నా అతిపెద్దదిగా అంతా అంచనా వేశారు. అదే రేంజ్‌లో జరిగిన పోరులో ఫ్రాన్స్‌ 2-1తో విజేతగా నిలిచింది. సెమీస్‌లో ఈ వరల్డ్‌కప్‌లో సంచలన విజయాలు నమోదు చేస్తూ వచ్చిన మొరాకోని సునాయాసంగా ఓడించింది. మొరాకో పెద్దగా ప్రతిఘటన ఇవ్వలేదు. 2-0తో నెగ్గి ఫైనల్లోకి అడుగుపెట్టింది ఫ్రాన్స్‌. ఈ టీమ్‌కి బలమైన లైనప్‌ ఉంది. ఫార్వర్డ్‌ మిడ్‌ఫీల్డ్‌లోనే కాదు శత్రుదుర్బేధ్య డిఫెన్స్‌ కూడా ఉంది. ఎంబాపే 5 గోల్స్‌తో ఈ టోర్నీలో టాప్‌ స్కోరర్‌గా ఉన్నాడు. జిరూద్‌, గ్రీజ్‌మన్‌, డెంబేలే వంటి స్టార్‌ ఆటగాళ్లున్నారు. అంతేకాదు.. లోరిస్‌ లాంటి వరల్డ్‌ క్లాస్‌ గోల్‌కీపర్‌ ఫ్రాన్స్‌ సొంతం. ఎంబాపే చెలరేగితే.. ఫ్రెంచ్‌ జట్టును ఆపేవాడే ఉండకపోవచ్చు.

అర్జెంటీనాకు సానుకూలంశాలు

అర్జెంటీనా జట్టు గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. గతేడాది కోపా అమెరికా గెలిచిన తర్వాత టీమ్‌లో నూతనోత్తేజం వచ్చింది. ఈ టోర్నీ ముందు వరకు వరుసగా 36 అంతర్జాతీయ మ్యాచ్‌లలో గెలిచింది అర్జెంటీనా. ఫుట్‌ బాల్‌ ప్రపంచకప్‌లో సౌదీ అరేబియాతో జరిగిన తొలి సమరంలో ఓడిన తర్వాత జట్టులో జోష్‌ తగ్గింది. కాని మెస్సీ జట్టుని తన భుజానకెత్తుకున్నాడు. మెక్సికోతో జరిగిన మ్యాచ్‌లో 64వ నిమిషంలో అతడి గోల్‌ అర్జెంటీనా క్యాంప్‌లో ఉత్సాహాన్ని నింపింది. అక్కడి నుంచి ఆ జట్టు వెనుదిరిగి చూడలేదు. మెక్సికోపై 2-0తో.. పోలాండ్‌పై 2-0తో ఆస్ట్రేలియాపై 2-1తో నెగ్గింది. ఇక క్వార్టర్స్ లో నెదర్లాండ్స్‌ మ్యాచ్ ఈ టోర్నీకే హైలైట్‌గా నిలిచింది. పెనాల్టీ షూటౌట్‌లో గోల్‌కీపర్‌ సూపర్‌ సేవ్స్‌తో అద్భుతవిజయం సాధించింది. ఇక సెమీస్‌ అయితే నల్లేరుపై నడకలానే సాగింది. క్రొయేషియాని 3-0తో చిత్తు చేసి ఫైనల్లో ప్రవేశించింది. మెస్సీనే అతిపెద్ద స్టార్‌. అల్వారేజ్‌ మంచి ఫామ్‌లో ఉన్నాడు, మెక్‌ అలిస్టర్‌, ఎంజో ఫెర్నాండేజ్‌, డీ పాల్‌ ఇలా అర్జెంటీనా లైనప్‌ శత్రువుల గుండెల్లో దడపుట్టిస్తుంది. డిమరియ, డిబలతో బెంచ్ కూడా స్ట్రాంగ్‌గా ఉంది.

ఇవి కూడా చదవండి

ఫైనల్‌ మ్యాచ్‌ ఆదివారం రాత్రి 8.30కి మొదలు కాబోతోంది. అర్జెంటీనా జట్టే మోస్ట్‌ ఫేవరెట్‌గా నిలిచింది. అటు ఎంబాపే 5 గోల్స్‌తో, ఇటు మెస్సీ 5 గోల్స్‌తో టాప్‌ స్కోరర్స్‌గా ఉన్నారు. కెరీర్లో ఇది చివరి ఇంటర్నేషనల్‌ మ్యాచ్‌ అని ముందే ప్రకటించాడు మెస్సీ. దీంతో ఈ లెజెండ్‌ వరల్డ్‌ కప్‌ని ముద్దాడితే చూడాలని కోట్లాది మంది అభిమానుల కోరుకుంటున్నారు. మొత్తానికి ఫిఫా ప్రపంచకప్‌ 2022 విజేత ఎవరనేది మరికొద్ది గంటల్లో తేలనుంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం చూడండి..

చెప్పులు లేకుండా 20కిలోమీటర్లు నడిచిన గురుకుల విద్యార్థులు..కారణం
చెప్పులు లేకుండా 20కిలోమీటర్లు నడిచిన గురుకుల విద్యార్థులు..కారణం
అరంగ్రేటంలోనే రూల్స్ అతిక్రమించిన సామ్ కొంస్టాస్
అరంగ్రేటంలోనే రూల్స్ అతిక్రమించిన సామ్ కొంస్టాస్
భారతీయులు కొత్త ఏడాదిలో వీసా లేకుండా ఈ 12 దేశాల్లో పర్యటించవచ్చు!
భారతీయులు కొత్త ఏడాదిలో వీసా లేకుండా ఈ 12 దేశాల్లో పర్యటించవచ్చు!
ఎముకలు కొరికే చలిలో.. ఒళ్లు గగుర్పొడిచే సాహసం చేసిన రొనాల్డో
ఎముకలు కొరికే చలిలో.. ఒళ్లు గగుర్పొడిచే సాహసం చేసిన రొనాల్డో
అరెస్ట్ పేరుతో డబ్బు కొట్టేస్తున్న కేటుగాళ్లు..ఈ జాగ్రత్తలు మస్ట్
అరెస్ట్ పేరుతో డబ్బు కొట్టేస్తున్న కేటుగాళ్లు..ఈ జాగ్రత్తలు మస్ట్
ఏంటీ.. విజయ్ దళపతి కూతురు బ్యాడ్మింటన్ ఛాంపియనా..?
ఏంటీ.. విజయ్ దళపతి కూతురు బ్యాడ్మింటన్ ఛాంపియనా..?
పెరుగులో ఈ పొడి మిక్స్ చేసి రాస్తే..10నిమిషాల్లో తెల్లజుట్టు నల్ల
పెరుగులో ఈ పొడి మిక్స్ చేసి రాస్తే..10నిమిషాల్లో తెల్లజుట్టు నల్ల
విమానంలో ప్రయాణించే వారికి అలర్ట్‌.. మారిన లగేజీ నిబంధనలు
విమానంలో ప్రయాణించే వారికి అలర్ట్‌.. మారిన లగేజీ నిబంధనలు
అల్పపీడనం ఎఫెక్ట్.. ఏపీ, తెలంగాణకు వర్షాలే వర్షాలు..
అల్పపీడనం ఎఫెక్ట్.. ఏపీ, తెలంగాణకు వర్షాలే వర్షాలు..
పాన్ కార్డు 2.0 అంటే ఏంటి? పాత కార్డు పని చేయదా? అసలు నిజం ఇదే
పాన్ కార్డు 2.0 అంటే ఏంటి? పాత కార్డు పని చేయదా? అసలు నిజం ఇదే