Gukesh Dommaraju: వరల్డ్ చెస్ ఛాంపియన్‌ మనోడే.. గుకేశ్ దొమ్మరాజుది ఎక్కడో తెలుసా?

ప్రపంచ చెస్‌ ఛాంపియన్‌గా నిలిచిన దొమ్మరాజు గుకేష్ మన తెలుగు వాడే అని మీకు తెలుసా? ఇంతకీ అతనిది ఏ జిల్లానో తెలుసా?

Gukesh Dommaraju: వరల్డ్ చెస్ ఛాంపియన్‌ మనోడే.. గుకేశ్ దొమ్మరాజుది ఎక్కడో తెలుసా?
Youngest World Chess Champion D Gukesh Native Village

Edited By: Velpula Bharath Rao

Updated on: Dec 13, 2024 | 11:07 AM

ప్రపంచ చెస్‌ ఛాంపియన్‌గా నిలిచిన యంగ్ ఇండియన్ సొంతూరు మురిసిపోయింది. భారత్ చదరంగంలో నిశ్శబ్దాన్ని చేధించిన  దొమ్మరాజు గుకేష్ సొంత గ్రామం కీర్తి ప్రతిష్టలను సొంతం చేసుకుంది. చరిత్రను తిరగరాసిన 18 ఏళ్ల దొమ్మరాజు గుకేష్ సూపర్ హీరోగా నిలవడంతో తాతా ముత్తాతల సొంతూరు తిరుపతి జిల్లా పిచ్చాటూరు మండలం చెంచురాజు కండ్రిగలోని స్థానికుల్లో ఆనందం వెల్లు విరిసింది. పిన్న వయసులోనే చెస్ చాంపియన్‌గా నిలిచిన భారతీయుడు గుకేష్‌ ఆ కీర్తిని సంపాదించడంతో తెలుగువాడి ప్రతిభ చాటి నట్లైంది.

చైనాకు చెందిన డింగ్‌ లిరెన్‌‌పై దొమ్మరాజు గుకేష్‌ విజయం సాధించడంతో గుకేశ్ పూర్వికుల సొంత గ్రామంలో వేడుకలు జరిగాయి. చెంచు రాజు కండ్రిగకు చెందిన ENT సర్జన్ డాక్టర్ రజినీకాంత్, మైక్రో బయాలజిస్ట్ పద్మా దంపతులు చెన్నైలో స్థిరపడగా 2006 మే 29న ముఖేష్ జన్మించాడు. చిన్నప్పటి నుంచి చలాకీగా ఉండే గుకేష్ చదరంగంపై ఉన్న ఆసక్తితో 12 ఏళ్లకే గ్రాండ్ మాస్టర్‌గా చరిత్ర సృష్టించాడు. తల్లిదండ్రుల ప్రోత్సాహం చదరంగంపై గుకేష్ కున్న ఆసక్తి ప్రపంచ చెస్ చరిత్రలో కొత్త అధ్యాయానికి తెర తీసేందుకు కారణమైంది. అత్యంత పిన్న వయసు చెస్ ఛాంపియన్‌గా గారీ కాన్స్ రోవ్ రికార్డును బద్దలు కొట్టిన ఆటగాడిగా దొమ్మరాజు గుకేష్ నిలవడంతో ప్రపంచ చదరంగంలో భారతదేశానిది పైచెయ్యి అయ్యింది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి