స్మిత్‌ను అడ్డుకునే దమ్ము బుమ్రాకే ఉంది: డారెన్‌ గాఫ్‌

TV9 Telugu Digital Desk

TV9 Telugu Digital Desk | Edited By:

Updated on: Sep 06, 2019 | 8:10 PM

టీమిండియా ప్రధాన పేసర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా బౌలింగ్‌పై ఇంగ్లండ్‌ మాజీ బౌలర్‌ డారెన్‌ గాఫ్‌ ప్రశంసల వర్షం కురిపించాడు. ఆసీస్‌ క్రికెటర్‌ స్టీవ్‌ స్మిత్‌ బ్యాటింగ్‌ను అడ్డుకునే దమ్ము బుమ్రాకే ఉందని డారెన్‌ పేర్కొన్నాడు. కాగా, యాషెస్‌ సిరీస్‌లో స్టీవ్‌ స్మిత్‌ తన అద్భుతమైన బ్యాటింగ్‌తో ఇంగ్లండ్‌కు చుక్కలు చూపిస్తున్న సంగతి తెలిసిందే. స్మిత్‌ ప్రదర్శనపై పలువురు మాజీ క్రికెటర్లు సైతం ప్రశంసలు కురిపిస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో స్టీవ్‌ స్మిత్‌ వికెట్‌ తీసే బౌలర్‌ ఎవరంటూ […]

స్మిత్‌ను అడ్డుకునే దమ్ము బుమ్రాకే ఉంది: డారెన్‌ గాఫ్‌

Follow us on

టీమిండియా ప్రధాన పేసర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా బౌలింగ్‌పై ఇంగ్లండ్‌ మాజీ బౌలర్‌ డారెన్‌ గాఫ్‌ ప్రశంసల వర్షం కురిపించాడు. ఆసీస్‌ క్రికెటర్‌ స్టీవ్‌ స్మిత్‌ బ్యాటింగ్‌ను అడ్డుకునే దమ్ము బుమ్రాకే ఉందని డారెన్‌ పేర్కొన్నాడు. కాగా, యాషెస్‌ సిరీస్‌లో స్టీవ్‌ స్మిత్‌ తన అద్భుతమైన బ్యాటింగ్‌తో ఇంగ్లండ్‌కు చుక్కలు చూపిస్తున్న సంగతి తెలిసిందే. స్మిత్‌ ప్రదర్శనపై పలువురు మాజీ క్రికెటర్లు సైతం ప్రశంసలు కురిపిస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో స్టీవ్‌ స్మిత్‌ వికెట్‌ తీసే బౌలర్‌ ఎవరంటూ ఈఎస్‌పీఎన్‌ క్రిక్‌ఇన్‌ఫో ఆన్‌లైన్‌లో ఓ పోల్‌ రన్‌ చేస్తోంది. ఆ క్వశ్చన్‌కు కొన్ని ఆప్షన్స్‌ కూడా ఇచ్చింది. అందులో జేమ్స్‌ అండర్సన్‌, జస్‌ప్రీత్‌ బుమ్రా, కగిసో రబాడ, మోర్నీ మోర్కెల్‌, జోఫ్రా ఆర్చర్‌, రవీంద్ర జడేజా, యాసిర్‌ షా, రంగనా హెరాత్‌ల పేర్లను ఉంచింది. ఈ పోస్ట్‌పై స్పందించిన డారెన్‌ ‘బుమ్రా 100%’ అంటూ కామెంట్‌ చేశాడు.

యాషెస్‌ సిరీస్‌లో తన బ్యాటింగ్‌ పవర్‌తో ఆసీస్‌ క్రికెటర్‌ స్టీవ్‌ స్మిత్‌ ఇంగ్లండ్‌కు చుక్కలు చూపిస్తున్నాడు. ఎంతలా అంటే స్మిత్‌ వికెట్‌ దక్కితే చాలు.. మ్యాచ్‌ గెలిచినట్లేనని ఇంగ్లండ్‌ భావించేంతగా ప్రభావితం చేస్తున్నాడు. ప్రస్తుతం జరుగుతన్న నాలుగో టెస్ట్‌లో స్మిత్‌ 211 పరుగులు చేయడంతో ఆస్ట్రేలియా 497/8 వద్ద తొలి ఇన్నింగ్స్‌ను డిక్లేర్‌ చేసింది. మరోవైపు విండీస్‌తో జరిగిన టెస్ట్‌ సిరీస్లో బుమ్రా అద్భుతమైన బౌలింగ్‌తో రాణించాడు. విండీస్‌తో జరిగిన తొలి టెస్ట్‌ రెండో ఇన్నింగ్స్‌లో 5 వికెట్లు తీసిన బుమ్రా.. రెండో టెస్ట్‌ మ్యాచ్‌లో హ్యాట్రిక్‌ సాధించడమే కాకుండా విండీస్‌ బ్యాట్స్‌మెన్‌కు చుక్కలు చూపించాడు.

https://www.instagram.com/p/B2CFqnogcp8/?utm_source=ig_web_copy_link

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu