Commonwealth Games2022: కామన్వెల్త్ గేమ్స్ 2022 బ్యాడ్మింటన్‌లో భారత్‌కు రెండో పతకం లభించింది . పురుషుల సింగిల్స్‌లో స్టార్ షట్లర్, తెలుగు తేజం కిదాంబి శ్రీకాంత్ (Kidambi Srikanth ) కాంస్య పతకాన్ని కైవసం చేసుకున్నాడు.
Commonwealth Games2022: కామన్వెల్త్ గేమ్స్ 2022 బ్యాడ్మింటన్‌లో భారత్‌కు రెండో పతకం లభించింది . పురుషుల సింగిల్స్‌లో స్టార్ షట్లర్, తెలుగు తేజం కిదాంబి శ్రీకాంత్ (Kidambi Srikanth ) కాంస్య పతకాన్ని కైవసం చేసుకున్నాడు. ఆదివారం అర్ధ రాత్రి జరిగిన కాంస్య పతక పోరులో సింగపూర్‌కు చెందిన జియా హెంగ్ టెహ్‌పై 21-15, 21-18తో కిదాంబి వరుస గేమ్‌లలో విజయం సాధించాడు. కాగా 2018 కామన్వెల్త్ గేమ్స్‌లో రజతం సాధించిన మన తెలుగుతేజం ఈసారి స్వర్ణం సాధిస్తాడని అభిమానులు ఆశించారు. అందుకు తగ్గట్లుగానే టోర్నీ ఆరంభం నుంచి అద్భుతంగా రాణించాడు. అయితే సెమీస్‌లో అనూహ్య ఓటమి ఎదురవ్వడంతో కాంస్యపతకం కోసం పోరాడాల్సి వచ్చింది. కాగా ఈ మ్యాచ్లో సింగపూర్‌కు చెందిన జియా హెంగ్ టెహ్ గాయపడినప్పటికీ గొప్ప క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించాడు. అందుకే గెలిచిన తర్వాత 87వ ర్యాంక్ ఆటగాడిని గౌరవప్రదంగా కౌగిలించుకుని అభినందనలు తెలిపాడు శ్రీకాంత్.
భారత అగ్రశ్రేణి స్క్వాష్ ద్వయం సౌరవ్ ఘోషల్, దీపికా పల్లికల్ మరోసారి తమ సత్తా చాటారు. కామన్వెల్త్ గేమ్స్ 2022 స్క్వాష్ మిక్స్‌డ్ డబుల్స్‌లో ఈ జోడి కాంస్య పతకాన్ని సొంతం చేసుకున్నారు. కాంస్య పతక పోరులో అనుభవజ్ఞులైన భారత జోడీ 2-0తో ఆస్ట్రేలియాను ఓడించింది. సీడబ్ల్యూజీలో వీరిద్దరికీ ఇది వరుసగా రెండో పతకం. ప్రస్తుత గేమ్స్‌లో స్క్వాష్‌లో భారత్‌కు ఇది రెండో పతకం. అంతకుముందు పురుషుల సింగిల్స్‌లో సౌరవ్ చారిత్రాత్మక కాంస్యం సాధించాడు. ఆగస్టు 7 ఆదివారం జరిగిన ఈ కాంస్య పతక మ్యాచ్‌లో, భారత జోడీ ఏకపక్ష విజయం సాధించింది. చాలా కాలంగా కలిసి ఆడుతున్న ఈ జోడీ ఆస్ట్రేలియాకు చెందిన లోబన్ డోనా, కెమరూన్ పీలేలకు ఎలాంటి అవకాశం లేకుండా 11-8, 11-4తో వరుస గేముల్లో ఓడించారు. కాగా కామన్వెల్త్ గేమ్స్‌లో స్క్వాష్ మిక్స్‌డ్ డబుల్స్‌లో కాంస్య పతకం సాధించినందుకు దీపికా పల్లికల్, సౌరవ్ ఘోషల్‌లకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అభినందనలు తెలిపారు. ‘మీ విజయం భారతదేశంలోని స్క్వాష్ క్రీడాకారులకు స్ఫూర్తినిస్తుంది. ఇలాంటి విజయాలు మన దేశంలో క్రీడలకు ఆదరణను పెంచుతాయి’ అని ట్విట్టర్ వేదికగా ప్రశంసించారు.
BRONZE IT IS ??
Indian duo @DipikaPallikal /@SauravGhosal bag BRONZE ? after clinching a comfortable 2-0 (11-8, 11-4) win over Australian duo Donna Lobban/Cameron Pilley in Squash ? Mixed Doubles event at #CommonwealthGames2022