AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

CWG champions: స్వదేశానికి చేరుకున్న భారత బ్యాడ్మింటన్ ప్లేయర్లు.. పివి.సింధు, కిదాంబి, చిరాగ్ శెట్టిలకు శంషాబాద్ ఎయిర్ పోర్టులో ఘన స్వాగతం..

బర్మింగ్ హోమ్ వేదికగా జరిగిన కామన్ వెల్త్ గేమ్స్ లో పతకాలు సాధించి హైదరాబాద్ చేరుకున్న భారత బ్యాడ్మింటన్ ప్లేయర్లు పి.వి.సింధు, కిదాంబి శ్రీకాంత్, చిరాగ్ శెట్టిలకు విమానశ్రయంలో ఘనస్వాగతం

CWG champions: స్వదేశానికి చేరుకున్న భారత బ్యాడ్మింటన్ ప్లేయర్లు.. పివి.సింధు, కిదాంబి, చిరాగ్ శెట్టిలకు శంషాబాద్ ఎయిర్ పోర్టులో ఘన స్వాగతం..
Badminton Players
Amarnadh Daneti
|

Updated on: Aug 10, 2022 | 1:11 PM

Share

CWG champions: బర్మింగ్ హోమ్ వేదికగా జరిగిన కామన్ వెల్త్ గేమ్స్ లో పతకాలు సాధించి హైదరాబాద్ చేరుకున్న భారత బ్యాడ్మింటన్ ప్లేయర్లు పి.వి.సింధు, కిదాంబి శ్రీకాంత్, చిరాగ్ శెట్టిలకు విమానశ్రయంలో ఘనస్వాగతం లభించింది. చివరిరోజు బ్యాడ్మింటన్ లో భారత్ ప్లేయర్లు అదరగొట్టి భారత్ కు మూడు బంగారు పతకాలు, ఒక కాంస్య పతకం అందించిన విషయం తెలిసిందే. బర్మింగ్ హోమ్ నుంచి బుధవారం తెల్లవారుజామున శంషాబాద్ లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానశ్రయానికి చేరుకున్న బ్యాడ్మింటన్ క్రీడాకారులకు వారి కుటుంబ సభ్యులతో పాటు కోచ్ పుల్లెల గోపిచంద్ ప్లవర్ బొకేలతో స్వాగతం పలికారు. కామన్ వెల్త్ గేమ్స్ లో 61 పతకాలతో భారత్ నాలుగో స్థానంలో నిలివగా.. వీటిలో 22 బంగారు, 16 రజత, 23 కాంస్య పతకాలు ఉన్నాయి. ఎంతో ఆనందంతో స్వదేశానికి తిరిగొచ్చామని ఈసందర్భంగా భారత బ్యాడ్మింటన్ క్రీడాకారులు తెలిపారు.

పురుషుల డబుల్స్ బ్యాడ్మింటన్ లో బంగారు పతకం సాధించిన చిరాగ్ శెట్టి మాట్లాడుతూ.. ఆనందంతో ఇంటికొచ్చామని.. తన తర్వాతి టార్గెట్ ప్రపంచ బ్యాడ్మింటన్ చాంఫియన్ షిప్ గెలడవడమేనని స్పష్టం చేశాడు. ఆంధ్రప్రదేశ్ లోని అంబేద్కర్ కోనసీమ జిల్లాకు చెందిన సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డితో కలిసి చిరాగ్ శెట్టి స్వర్ణపతకం సాధించాడు. బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్ లో గోల్గ్ మెడల్ సాధించిన తెలుగు తేజం పి.వి.సింధుకు స్వాగతం పలికేందుకు విమానాశ్రయానికి వచ్చిన ఆయన తండ్రి పి.వి.రమణ మాట్లాడుతూ.. కామన్ వెల్త్ గేమ్స్ లో తన కుమార్తె సాధించిన బంగారు పతకం పట్ల ఎంతో గర్వంగా ఫీలవుతున్నట్లు చెప్పారు. కామన్ వెల్త్ గేమ్స్ లోని బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్ లో తొలి బంగారు పతకం సాధించిన క్రీడాకారిణిగా పివి.సింధు రికార్డు నెలకొల్పింది. పురుషుల సింగిల్స్ లో కిదాంబి శ్రీకాంత్ కాంస్య పతకం సాధించిన విషయం తెలిసిందే. జులై 28వ తేదీ నుంచి ఆగష్టు 8 వతేదీ వరకు బర్మింగ్ హోమ్ వేదికగా జరిగిన కామన్ వెల్త్ గేమ్స్ లో భారత క్రీడాకారులు 200 మంది 16 క్రీడా విభాగాల్లో పోటీపడ్డారు. కామన్ వెల్త్ గేమ్స్ లో 178 పతకాలతో ఆస్ట్రేలియా మొదటి స్థానంలో, ఇంగ్లాడ్ 175 పతకాలతో రెండో స్థానంలో నిలవగా.. భారత్ 4వ స్థానంలో నిలిచింది.

ఇవి కూడా చదవండి

మరోవైపు తమ విజయాలపై భారత బ్యాడ్మింటన్ క్రీడాకారులు ట్విట్టర్ వేదికగా స్పందించారు. బంగారు పతకం సాధించిన సందర్భంగా కేంద్రహోంమంత్రి అమిత్ షా చేసిన ట్వీట్ కు పివి.సింధు స్పందిస్తూ.. ధన్యవాదాలు తెలియజేసింది. అలాగే తాము సాధించిన బంగారు పతకం వెలకట్టలేనిదంటూ పురుషుల డబుల్స్ లో సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డితో కలిసి స్వర్ణం సాధించిన చిరాగ్ శెట్టి ట్వీట్ చేశారు.

మరిన్ని క్రీడా వార్తాల కోసం చూడండి..