CWG champions: గోల్డ్ మెడలిస్ట్ కు గ్రాండ్ వెల్కమ్.. ఆనందంతో ఉప్పొంగి.. అభిమానులతో కలిసి ఎగిరిగంతేసిన లక్ష్యసేన్..
కామన్ వెల్త్ గేమ్స్ 2022లో బ్యాడ్మింటన్ పురుషుల సింగిల్స్ విభాగంలో స్వర్ణ పతకం సాధించిన లక్ష్యసేన ఈఉదయం బెంగళూరు విమానశ్రయానికి చేరుకున్నారు. అప్పటికే గోల్డ్ మెడలిస్ట్ కు గ్రాండ్ వెల్కమ్ చెప్పేందుకు కుటుంబసభ్యులు, అభిమానులు
CWG champions: కామన్ వెల్త్ గేమ్స్ 2022లో బ్యాడ్మింటన్ పురుషుల సింగిల్స్ విభాగంలో స్వర్ణ పతకం సాధించిన లక్ష్యసేన ఈఉదయం బెంగళూరు విమానశ్రయానికి చేరుకున్నారు. అప్పటికే గోల్డ్ మెడలిస్ట్ కు గ్రాండ్ వెల్కమ్ చెప్పేందుకు కుటుంబసభ్యులు, అభిమానులు భారీగా బెంగళూరు ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. లక్ష్యసేన్ కు పూల బొకేలతో స్వాగతం పలికిన అభిమానులు.. డ్యాన్స్ చేశారు. దీన్ని చూసిన లక్ష్యసేన్ ఆనందంతో ఉప్పొంగి అభిమానులతో కలిసి స్టెప్పులేశాడు. ఈవీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. అభిమానుల నుంచి స్వాగతం అందుకున్న తర్వాత.. తన బ్యాగులోంచి మ మెడల్స్ తీసి అందరికీ చూపించాడు. ఈసందర్భంగా అక్కడున్న మీడియాతో మాట్లాడుతూ.. ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్ గెలవడమే తన తదుపరి లక్ష్యమని చెప్పాడు. కామన్ వెల్త్ గేమ్స్ ఫైనల్స్ లో మొదటి సెట్ ఓడిపోయినప్పటికి.. పతకంపై తాను విశ్వాసం కోల్పోలేదని.. తరువాతి రెండు సెట్లు బాగా ఆడితే విజయం వరిస్తుందనే కాన్ఫిడెన్స్ తోనే ఆడినట్లు తెలిపాడు. తాను బంగారు పతకం సాధించినందుకు ఎంతో సంతోషపడుతున్నానని తెలిపాడు. తనకు లభించిన స్వాగతానికి ధన్యవాదాలు తెలిపాడు. ఈసందర్భంగా లక్ష్యసేన్ బెంగళూరు ఎయిర్ పోర్టు ఆవరణలో అభిమానులతో కలిసి స్టెప్పులేసిన వీడియో క్రీడాభిమానులను ఆకట్టుకుంటోంది.
కామన్ వెల్త్ గేమ్స్ చివరిరోజు అయిన ఆగష్టు 8వ తేదీన జరిగిన బ్యాడ్మింటన్ పురుషుల సింగిల్స్ లో లక్ష్యసేన్ స్వర్ణ పతకం సాధించాడు. మూడు సెట్ల గేమ్ లో తొలి సెట్ ఓడిపోవడంతో విజయావకాశలు సన్నగిల్లాయని అనుకున్న తరుణంలో.. రెండు, మూడు సెట్లలో అదరగొట్టి గోల్డ్ మెడల్ కన్ఫర్మ్ చేసుకున్నాడు. మలేషియాకు చెందిన ఎన్ జీ యోంగ్ ను 19-21, 21-9, 21-16 తో ఓడించి పసిడి పతకం సాధించాడు.
#WATCH | Karnataka | Celebrations erupt as CWG 2022 Gold medallist shuttler Lakshya Sen arrives at the Bengaluru airport. pic.twitter.com/8fKgfRWWW6
— ANI (@ANI) August 10, 2022
మరిన్ని క్రీడా వార్తల కోసం చూడండి..