Ind Vs Pak: భారత్, పాక్ మ్యాచ్‎పై జోమాటో, కరీమ్ పాకిస్తాన్ ట్విట్టర్ యుద్ధం.. గెలుపు ఎవరిది అంటే..

భారత్, పాకిస్తాన్ మధ్య కాసేపట్లో టీ20 మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ కోసం ఇరు దేశాల ప్రేక్షకులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. దాయదుల పోరుపై సోషల్ మీడియాలో జోరుగా చర్చ నడుస్తోంది. అభిమానులే కాకుండా ఆన్‎లైన్ ఫుడ్ డెలవరీ యాప్‎లు కూడా సవాల్ విసురుకుంటున్నాయి...

Ind Vs Pak: భారత్, పాక్ మ్యాచ్‎పై జోమాటో, కరీమ్ పాకిస్తాన్ ట్విట్టర్ యుద్ధం.. గెలుపు ఎవరిది అంటే..
Zomato

Updated on: Oct 24, 2021 | 5:52 PM

భారత్, పాకిస్తాన్ మధ్య కాసేపట్లో టీ20 మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ కోసం ఇరు దేశాల ప్రేక్షకులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. దాయదుల పోరుపై సోషల్ మీడియాలో జోరుగా చర్చ నడుస్తోంది. అభిమానులే కాకుండా ఆన్‎లైన్ ఫుడ్ డెలవరీ యాప్‎లు కూడా సవాల్ విసురుకుంటున్నాయి. ఆదివారం జొమాటో, కరీం పాకిస్తాన్ మధ్య ట్విట్టర్ యుద్ధం జరిగింది. ఇండియా వర్సెస్ పాక్ మ్యాచ్ గురించి కరీమ్ పాకిస్థాన్ చేసిన ట్వీట్‌తో రచ్చ ప్రారంభమైంది. “ముఫ్త్ ఖానే కా మౌకా భీ ఔర్ జీత్నే కా మౌకా భీ (ఉచితంగా తినడానికి అవకాశం, గెలిచే అవకాశం కూడా). పాకిస్థాన్ వర్సెస్ ఇండియా మ్యాచ్ రోజు వరకు ఆహారాన్ని ఆర్డర్ చేయండి. ఒకవేళ భారత్‌పై పాకిస్తాన్ గెలిస్తే, మేము మీ ఆర్డర్ డబ్బులు తిరిగి చెల్లిస్తామని.” ట్వీట్ చేసింది.

కరీమ్ పాకిస్థాన్ చేసిన ట్వీట్‎పై ఇండియన్ ఆన్‎లైన్ ఫుడ్ డెలవరీ యాప్ జోమాటో స్పందించింది. ఈ రోజు రాత్రి బర్గర్‌, పిజ్జా కావాలంటే మాకు చెప్పండి. ఒక్క మేసెజ్‌ చేస్తే అవి మీకు అందుతాయని పాకిస్తాన్‌ క్రికెట్‌ ట్విటర్‌ అధికార ఖాతాను ట్యాగ్‌ చేసి’ పేర్కొంది. 2019 ప్రపంచ కప్‌లో భారత్ పాకిస్తాన్‌ను ఓడించిన తర్వాత, పాకిస్తానీ అభిమాని మోమిమ్ సాకిబ్‌…‘ఓ బాయ్‌..! మారో మూజే..! ’ అంటూ తన ఆవేదనను వ్యక్తం చేశాడు. పాక్ ఆటగాళ్లు ఫిట్‌నెస్, డైట్ విషయంలో అజాగ్రత్తగా వ్యవహరించడంపై సాకిబ్ తన నిరాశను వెలుబుచ్చాడు. “మ్యాచ్‌కు ఒక రోజు ముందు, పాకిస్తాన్ ఆటగాళ్లు బర్గర్, పిజ్జా తిన్నారని నాకు తెలుసని చెప్పాడు. అప్పట్లో ఈ వీడియో వైరల్ అయింది. ఇప్పుడు అదే విషయాన్ని జోమాటో మారోమారు గుర్తు చేస్తూ ట్వీట్ చేసింది. “జొమాటో ట్వీట్‌ను కరీమ్ వాటిని తిప్పికొట్టే ప్రయత్నం చేయలేదు. టీ20, వన్డే వరల్డ్ కప్‎ పాకిస్తాన్‎పై ఇండియాదే పైచేయిగా ఉంది. పాకిస్తాన్‎తో 8 టీ20 మ్యాచులు ఆడిన భారత్ ఏడింటిలో విజయం సాధించింది.

Read Also.. IND vs PAK: భారత్, పాకిస్తాన్ మ్యాచ్‎ను ఆటలాగే చూడండి.. యుద్ధంలా కాదు..