T20 World Cup 2024: టీ20 ప్రపంచకప్‌కు ముందు రిటైర్మెంట్ ప్రకటించిన మరో స్టార్ ప్లేయర్.. 18 ఏళ్ల కెరీర్‌కు గుడ్ బై

|

May 13, 2024 | 7:29 AM

న్యూజిలాండ్ స్టార్ ప్లేయర్ కొలిన్ మున్రో కొన్ని రోజుల క్రితమే అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. రాబోయే T20 ప్రపంచ కప్ 2024 కోసం న్యూజిలాండ్ జట్టు ఎంపిక కాకపోవడంతో మన్రో ఈ షాకింగ్ నిర్ణయం తీసుకున్నాడు. దీని తర్వాత మరో స్టార్ క్రికెటర్ తన 18 ఏళ్ల కెరీర్‌కు స్వస్తి పలకాలని నిర్ణయించుకున్నాడు.

T20 World Cup 2024: టీ20 ప్రపంచకప్‌కు ముందు రిటైర్మెంట్ ప్రకటించిన మరో స్టార్ ప్లేయర్.. 18 ఏళ్ల కెరీర్‌కు గుడ్ బై
Sean Williams
Follow us on

న్యూజిలాండ్ స్టార్ ప్లేయర్ కొలిన్ మున్రో కొన్ని రోజుల క్రితమే అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. రాబోయే T20 ప్రపంచ కప్ 2024 కోసం న్యూజిలాండ్ జట్టు ఎంపిక కాకపోవడంతో మన్రో ఈ షాకింగ్ నిర్ణయం తీసుకున్నాడు. దీని తర్వాత మరో స్టార్ క్రికెటర్ తన 18 ఏళ్ల కెరీర్‌కు స్వస్తి పలకాలని నిర్ణయించుకున్నాడు. దీంతో క్రికెట్ అభిమానులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. బంగ్లాదేశ్, జింబాబ్వే జట్ల మధ్య ఐదు మ్యాచ్‌ల సిరీస్ ముగిసింది. బంగ్లాదేశ్‌ 4-1తో సిరీస్‌ను కైవసం చేసుకుంది. జింబాబ్వే చివరి మ్యాచ్‌లో గెలిచి పరువు దక్కించుకుంది. అయితే ఆ తర్వాత ఆ జట్టుకు పెద్ద దెబ్బ తగిలింది. జింబాబ్వే స్టార్ ఆల్ రౌండర్, మాజీ కెప్టెన్ సీన్ విలియమ్స్ టీ20 క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. Cricbuzz నివేదిక ప్రకారం, బంగ్లాదేశ్‌తో T20I సిరీస్ తర్వాత సీన్ విలియమ్స్ టీ20 ఫార్మాట్ నుండి రిటైర్ కావాలని నిర్ణయించుకున్నాడు. బంగ్లాదేశ్‌తో జరిగిన ఈ సిరీస్‌లో సీన్ కేవలం 2 మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు. తొలి మ్యాచ్‌లో సీన్ సున్నాకి అవుటయ్యాడు. ఐదో మ్యాచ్‌లో అతనికి బ్యాటింగ్‌కు అవకాశం రాలేదు.

18 ఏళ్ల టీ20 కెరీర్‌కు స్వస్తి..

బంగ్లాదేశ్‌తో జరిగిన సిరీస్‌ను జింబాబ్వే గెలవలేకపోయింది. కానీ జింబాబ్వే చివరి మ్యాచ్‌లో గెలిచి సీన్‌కు విజయవంతమైన వీడ్కోలు ఇచ్చింది. ‘ఐదవ మ్యాచ్ తర్వాత తాను రిటైర్ అవుతున్నట్లు జట్టు సభ్యులకు సీన్ చెప్పాడు. సీన్ రిటైర్మెంట్ అతని అభిమానులను షాక్ కి గురి చేసింది. కానీ వన్డే, టెస్టు క్రికెట్ లో మాత్రం సీన్ కొనసాగుతాడు’ అని ఆ జట్టుకు చెందిన కీలక సభ్యుడొకరు చెప్పుకొచ్చారు.

ఇవి కూడా చదవండి

సీన్ విలియమ్స్ తన T20 అరంగేట్రం 25 ఫిబ్రవరి 2005న దక్షిణాఫ్రికాపై చేసాడు. అప్పటి నుంచి సీన్ 81 మ్యాచ్‌ల్లో 11 అర్ధసెంచరీలతో 1691 పరుగులు చేశాడు. అలాగే 48 వికెట్లు తీశాడు. ఇదిలా ఉంటే, జూన్ నెలలో జరగనున్న T20 వరల్డ్ కప్ 2024 టోర్నమెంట్‌లో మొత్తం 20 జట్లు పాల్గొంటాయి. టి20 ప్రపంచకప్‌ ఆడే ఈ 20 జట్లలో జింబాబ్వేకు చోటు దక్కలేదు. జింబాబ్వే ప్రపంచకప్ క్వాలిఫయర్స్‌కు అర్హత సాధించలేకపోయింది .

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..