ZIM vs PAK T20 Result: టీ20 వరల్డ్‌ కప్‌లో సంచలనం.. ఉత్కంఠ పోరులో పాకిస్థాన్‌పై జింబాబ్వే గెలుపు..

టీ20 వరల్డ్‌ కప్‌లో మరో సంచలనం నమోదైంది. ఉత్కంఠ భరితంగా సాగిన పోరులో జింబాబ్వే అనూహ్య విజయాన్ని అందుకుంది. పాకిస్థాన్‌పై ఒక్క పరుగు తేడాది జింబాబ్వే విజయకేతనాన్ని ఎగరేసింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన జింబాబ్వే నిర్ణీత 20 ఓవర్లలో..

ZIM vs PAK T20 Result: టీ20 వరల్డ్‌ కప్‌లో సంచలనం.. ఉత్కంఠ పోరులో పాకిస్థాన్‌పై జింబాబ్వే గెలుపు..
Zim Vs Pak Match

Edited By: Ravi Kiran

Updated on: Oct 28, 2022 | 8:25 AM

టీ20 వరల్డ్‌ కప్‌లో మరో సంచలనం నమోదైంది. ఉత్కంఠ భరితంగా సాగిన పోరులో జింబాబ్వే అనూహ్య విజయాన్ని అందుకుంది. పాకిస్థాన్‌పై ఒక్క పరుగు తేడాది జింబాబ్వే విజయకేతనాన్ని ఎగరేసింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన జింబాబ్వే నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 130 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్‌ దిగిన పాకిస్థాన్‌ మొదట్లో పర్వాలేదనిపించినా చివర్లలో వరుసగా వికెట్లు వికెట్లు కోల్పోయింది. జింబాబ్వే బౌలర్లు రాణించడంతో పాకిస్థాన్‌ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 129 చేసింది. దీంతో ఒక్క పరుగు తేడాతో జింబాబ్వే విజయాన్ని నమోదు చేసుకుంది. ఆఖరి వరకు పోరాడిన జింబాబ్వే అద్భుత ఆటతీరుతో మ్యాచ్‌ను సొంతం చేసుకుంది.

జింబాబ్వే బౌలింగ్ విషయానికొస్తే సికిందర్‌ రజా నాలుగు ఓవర్లలో కేవలం 25 పరుగులు ఇచ్చి మూడు వికెట్లను పడగొట్టి మ్యాచ్‌ విజయంలో కీలక పాత్ర పోషించాడు. బ్రాడ్‌ నాలుగు ఓవర్లలో 25 పరగులు ఇచ్చి 2 వికెట్లు తీసుకున్నాడు. ఇక పాకిస్థాన్‌ బ్యాటింగ్‌ విషయానికొస్తే షాహన్‌ మసూద్‌ (44) తప్ప మరెవరూ చెప్పుకోదగ్గ పరుగులు చేయలేదు. మహ్మద్‌ నవాజ్‌ 22 పరుగులు, మహ్మద్‌ వసీమ్‌ 12 పరుగులు నాటౌట్‌ చేశారు. జింబాబ్వే బౌలింగ్‌లో సికందర్‌ రజా 3, బ్రాడ్‌ ఎవన్స్‌ 2 వికెట్లు తీశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని వరల్డ్ కప్ కథనాల కోసం క్లిక్ చేయండి..