Rishabh Pant : కపిల్ షోలో ఎంగేజ్మెంట్ చేసుకున్న పంత్, చాహల్.. ఏంటి భయ్యా ఇది

భారత క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్ తన మాజీ భార్య ధనశ్రీ వర్మ తో విడాకుల తర్వాత మళ్లీ వార్తల్లో నిలిచాడు. కపిల్ శర్మ షో లో రిషబ్ పంత్ తో కలిసి అతను చేసిన సరదా సంభాషణ వైరల్‌గా మారింది. ఆర్జే మహ్వాష్ తో అతని కొత్త బంధం గురించి కూడా పుకార్లు షికారు చేస్తున్నాయి.

Rishabh Pant : కపిల్ షోలో ఎంగేజ్మెంట్ చేసుకున్న పంత్, చాహల్..  ఏంటి భయ్యా ఇది
Yuzvendra Chahal

Updated on: Jul 26, 2025 | 9:52 AM

Rishabh Pant : భారత క్రికెట్ జట్టులో ప్రముఖ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ ఈ మధ్య తన ఆట కంటే వ్యక్తిగత జీవితం గురించే ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నాడు. ఇటీవల అతని మాజీ భార్య ధనశ్రీ వర్మతో విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే, దీని తర్వాత కూడా రిషబ్ పంత్, చాహల్‌ను ఆటపట్టించడం మానలేదు. తాజాగా పంత్, చాహల్ ఇద్దరూ కపిల్ శర్మ షోకు వెళ్లారు. అక్కడ తెరవెనుక వీడియోలో పంత్, చాహల్ మధ్య జరిగిన సరదా సంభాషణ సోషల్ మీడియాలో పెద్ద సంచలనం సృష్టించింది.

షో షూటింగ్ సమయంలో అర్చనా పూరన్ సింగ్ ఒక BTS(బిహైండ్ ది సీన్స్) వ్లాగ్ షేర్ చేసింది. అందులో పంత్, చాహల్, గౌతమ్ గంభీర్ కలిసి కనిపించారు. ఆ వీడియోలో ఒక సరదా సన్నివేశం ఉంది. పంత్, చాహల్ వేలికి ఉంగరం తొడిగాడు.. ఈ సమయంలో అర్చనా నవ్వుతూ, “మీరిద్దరూ ఎంగేజ్‌మెంట్ చేసుకుంటున్నారా?” అని అడిగింది. దీనికి పంత్ వెంటనే, “ఇతనికి ఇప్పటికే అయిపోయింది!” అని సమాధానం ఇచ్చాడు. చాహల్ కూడా నవ్వుతూ “అయిపోవడం కూడా అయిపోయింది” అని అన్నాడు.

ఇది ధనశ్రీ తో చాహల్ విడాకులను ఉద్దేశించి చెప్పిన మాట. చాహల్ కూడా దీన్ని సరదాగా తీసుకున్నాడు. ఆ తర్వాత అర్చనా, చాహల్‌ ను ముంబైలోని తన ఇంటికి ఆహ్వానించింది. అయితే, అతను చాలా బిజీగా ఉంటాడని అనుకుంది. దీనికి పంత్ నవ్వుతూ..”ఇతను ఎప్పుడూ ఇక్కడే ఉంటాడు!” అని అన్నాడు. చాహల్ చిలిపిగా, “అన్నీ చెప్పేస్తున్నావ్!” అని ఆటపట్టించాడు.

చాహల్ విడాకులు తీసుకునే ముందు నుంచే అతను, ఆర్జే మహ్వాష్ మధ్య ప్రేమాయణం నడుస్తోందని సోషల్ మీడియాలో పుకార్లు షికారు చేస్తున్నాయి. ఆ తర్వాత ఛాంపియన్స్ ట్రోఫీ సమయంలో వీరిద్దరూ కలిసి కనిపించారు. ఐపీఎల్ సమయంలో కూడా మహ్వాష్, చాహల్ ఆడే పంజాబ్ కింగ్స్ జట్టుకు సపోర్ట్ ఇవ్వడానికి మైదానంలో కనిపించింది. అయితే, వీరిద్దరూ ఇప్పటివరకు తమ బంధం గురించి ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు.

 

 

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..