రోడ్‌ సేఫ్టీ వరల్డ్‌ టీ20 సిరీస్‌లో యువీ దూకుడు.. యూసఫ్‌ మెరుపులు.. ఇండియా లెజెండ్స్‌ విజయం

|

Mar 22, 2021 | 12:33 AM

రోడ్‌ సేఫ్టీ వరల్డ్‌ టీ20 సిరీస్‌లో టీమిండియా లెజెండ్స్ దుమ్మురేపారు. ఆదివారం శ్రీలంక లెజెండ్స్‌తో జరిగి ఫైనల్‌ మ్యాచ్‌లో ఇండియా లెజెండ్స్‌ 182 పరుగుల టార్గెట్‌ను...

రోడ్‌ సేఫ్టీ వరల్డ్‌ టీ20 సిరీస్‌లో యువీ దూకుడు.. యూసఫ్‌ మెరుపులు.. ఇండియా లెజెండ్స్‌ విజయం
Yusaf Patan And Uv
Follow us on

Road Safety World Series Title: రోడ్‌ సేఫ్టీ వరల్డ్‌ టీ20 సిరీస్‌లో టీమిండియా లెజెండ్స్ దుమ్మురేపారు. ఆదివారం శ్రీలంక లెజెండ్స్‌తో జరిగి ఫైనల్‌ మ్యాచ్‌లో ఇండియా లెజెండ్స్‌ 182 పరుగుల టార్గెట్‌ను నిర్దేశించింది. టాస్‌ గెలిచిన శ్రీలంక లెజెండ్స్‌ ముందుగా  ఇండియా లెజెండ్స్‌‌ను బ్యాటింగ్‌కు దింపింది. ఇండియా లెజెండ్స్‌ ఓపెనర్లలో సెహ్వాగ్‌(10) తొలి వికెట్‌గా పెవిలియన్‌ చేరగా, ఆపై బద్రీనాథ్‌(7) కూడా అదే బాటలో పయణిచాడు.

ఇక, సచిన్‌ టెండూల్కర్‌(30/ 23 బంతుల్లో 5 ఫోర్లు) మంచి ఆటతీు ప్రదర్శించాడు. ఆ తర్వాత వచ్చిన యువరాజ్‌ సింగ్‌- యూసఫ్‌ పఠాన్‌లు మెరుపులు మెరిపించారు. వేగంగా బ్యాటింగ్‌ చేసి స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు.

యువీ (60/ 41 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్‌లు) దూకుడుగా ఆడి మంచి స్కోర్ చేయగా… యూసఫ్‌ కేవలం36 బంతుల్లో62 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఇందులో 4 ఫోర్లు, 5సిక్స్‌లు ఉన్నాయి. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో ఇండియా లెజెండ్స్‌ నాలుగు వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది. ఈ యువరాజ్ సింగ్- యూసఫ్ జోడి నాల్గో వికెట్‌కు 85 పరుగులను జోడించారు. శ్రీలంక లెజెండ్స్‌ బౌలర్లలో హెరాత్‌, సనత్‌ జయసూర్య, మహరూఫ్‌, వీరరత్నేలకు తలో వికెట్‌ లభించింది.

ఇవి కూడా చదవండి:

టోక్యో ఒలింపిక్స్‌లోకి తొలిసారి టీటీ.. ఈజీగా మెడల్ గెలుస్తామంటున్న మిక్స్‌డ్ జోడీ