AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Video: సెంచరీకి 8 పరుగుల దూరంలో బ్యాటర్ ఔట్.. బౌలర్ ఓవర్ యాక్షన్‌తో హీటెక్కిన వెదర్.. కట్ చేస్తే..

Yash Thakur and Yash Dhull Fight: నాగ్‌పూర్‌లో జరిగిన ఇరానీ కప్ 2025 చివరి రోజున, రెస్ట్ ఆఫ్ ఇండియా బ్యాట్స్‌మెన్, విదర్భ బౌలర్ల మధ్య జరిగిన వాగ్వాదం అందరినీ ఆశ్చర్యపరిచింది. అంపైర్, ఇతర ఆటగాళ్లు జోక్యం చేసుకోవలసి వచ్చింది. లేకుంటే పరిస్థితి చేయి దాటిపోయేది.

Video: సెంచరీకి 8 పరుగుల దూరంలో బ్యాటర్ ఔట్.. బౌలర్ ఓవర్ యాక్షన్‌తో హీటెక్కిన వెదర్.. కట్ చేస్తే..
Yash Thakur And Yash Dhull
Venkata Chari
|

Updated on: Oct 05, 2025 | 11:17 PM

Share

Yash Thakur and Yash Dhull Fight: విదర్భ, రెస్ట్ ఆఫ్ ఇండియా మధ్య జరిగిన ఇరానీ కప్ మ్యాచ్ హోరాహోరీగా ముగిసింది. నాగ్‌పూర్‌లో జరిగిన మ్యాచ్ చివరి రోజున రంజీ ట్రోఫీ ఛాంపియన్స్ విదర్భ రెస్ట్ ఆఫ్ ఇండియాను 93 పరుగుల తేడాతో ఓడించి టైటిల్ గెలుచుకుంది. కానీ మ్యాచ్ ముగిసేలోపు, ఇద్దరు యువ భారత ఆటగాళ్ళు ఒకరితో ఒకరు గొడవ పడ్డారు. గొడవ అనివార్యమయ్యేలా పరిస్థితి మారింది. ఈ పోరాటం విదర్భ ఫాస్ట్ బౌలర్ యష్ ఠాకూర్, రెస్ట్ ఆఫ్ ఇండియా బ్యాట్స్‌మన్ యష్ ధుల్ మధ్య జరిగింది.

ఆదివారం, అక్టోబర్ 5, నాగ్‌పూర్‌లో జరిగిన ఇరానీ కప్ టైటిల్ పోరులో చివరి రోజు. రెస్ట్ ఆఫ్ ఇండియా 361 పరుగుల లక్ష్యాన్ని ఛేదిస్తోంది. కానీ వారి వికెట్లు వేగంగా పడిపోతున్నాయి. ఈ సమయంలో, ఢిల్లీ యువ బ్యాట్స్‌మన్ యష్ ధుల్ క్రీజులోకి వచ్చాడు. అతను విదర్భ బౌలర్లపై దాడి చేశాడు. మానవ్ సుతార్‌తో కలిసి అద్భుతమైన సెంచరీ భాగస్వామ్యాన్ని నెలకొల్పి ఆశలను సజీవంగా ఉంచాడు.

ధుల్ సెంచరీ చేయకుండా ఆపిన ఠాకూర్..

యష్ ధుల్ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. సెంచరీ వైపు పయనిస్తున్నాడు. కానీ, అతనికి ఎదురుదెబ్బ తగిలింది. 63వ ఓవర్‌లో, విదర్భ పేసర్ యష్ ఠాకూర్ మొదటి బంతిని బౌలింగ్ చేయడానికి వచ్చాడు. యష్ ధుల్ (92) అప్పర్ కట్‌కు ప్రయత్నించాడు. కానీ, థర్డ్ మ్యాన్ బౌండరీ వద్ద క్యాచ్ ఔట్ అయ్యాడు. ఫీల్డర్ క్యాచ్ తీసుకున్న వెంటనే, బౌలర్ యష్ ఠాకూర్ బిగ్గరగా అరిచి సంబరాలు చేసుకోవడం ప్రారంభించాడు. కానీ ఈ సమయంలో, అతను తన ప్రశాంతతను కోల్పోయి నేరుగా ధుల్ ముందుకి వెళ్లి దూకుడు వైఖరితో సంబరాలు చేసుకున్నాడు.

మైదానంలో గందరగోళం..

బౌలర్ ప్రవర్తన యష్ ధుల్ కు నచ్చకపోవడంతో ప్రతీకారం తీర్చుకోవడం మొదలుపెట్టాడు. వాదన త్వరగా పెరిగిపోయింది. ఇద్దరూ వాదించుకోవడం మొదలుపెట్టారు, ఒకరి వైపు ఒకరు కదులుతున్నారు. యష్ ఠాకూర్ చాలా కోపంగా కనిపించాడు. ఒక క్షణం, ఇద్దరి మధ్య శారీరక వాగ్వాదం చెలరేగినట్లు అనిపించింది. కానీ, అంపైర్, మిగిలిన విదర్భ ఆటగాళ్ళు బౌలర్ ను ఆపడానికి వచ్చారు. అయితే, అతను శాంతించలేదు. మళ్ళీ ధుల్ తో మాట్లాడుతున్నట్లు కనిపించాడు. అయితే, యష్ ధుల్ వెనక్కి నడవడం ప్రారంభించాడు.

మరిన్ని క్రికెట్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..