లెక్కలు మార్చేస్తాను, సేవ్ చేస్తానంటూ స్టేట్‌మెంట్.. కట్‌చేస్తే.. WTCలో పాక్ ఇజ్జత్ తీసేసిన బాబర్..!
World Test Championship: ఇంగ్లాండ్‌తో రెండో టెస్టులో భారీ ఓటమితో పాకిస్తాన్ WTC ఫైనల్ రేసు నుంచి దాదాపు నిష్క్రమించింది. వారి విజయాల శాతం 16.67కు పడిపోయి ఆఖరి స్థానంలో ఉంది. ఇంగ్లాండ్ ఆరో స్థానానికి చేరగా, భారత్ ఐదో స్థానంలో ఉంది. డబ్ల్యూటీసీ ఫైనల్‌కు అర్హత సాధించడానికి టీమిండియా ఇంకా ఆరు మ్యాచ్‌లు గెలవాల్సి ఉంది.

ఇంగ్లాండ్ గడ్డపై పాకిస్తాన్ పేలవ ప్రదర్శన కొనసాగుతోంది. లార్డ్స్ వేదికగా జరిగిన రెండో టెస్టులో ఇంగ్లాండ్ చేతిలో పాకిస్తాన్ 194 పరుగుల భారీ తేడాతో ఓటమిని చవిచూసింది. ఈ ఓటమితో మూడు టెస్టుల సిరీస్‌ను పాకిస్తాన్ మరో మ్యాచ్ మిగిలి ఉండగానే 2-0 తేడాతో ఇంగ్లాండ్‌కు కోల్పోయింది. రెండో టెస్టులో బౌలింగ్ పర్వాలేదనిపించినా, బ్యాటింగ్‌లో పాకిస్తాన్ దారుణంగా విఫలమైంది. 389 పరుగుల విజయ లక్ష్యాన్ని ఛేదించడంలో విఫలమై, కేవలం 194 పరుగులకే ఆలౌట్ అయ్యింది.
ఈ ఘోర ఓటమితో పాకిస్తాన్ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC) ఫైనల్ రేసు నుంచి దాదాపుగా నిష్క్రమించినట్టే. ప్రస్తుత సైకిల్‌లో ఎనిమిది టెస్టులు ఆడిన పాకిస్తాన్ కేవలం రెండింట మాత్రమే విజయం సాధించి, 16.67 విజయాల శాతంతో పాయింట్ల పట్టికలో ఆఖరి స్థానానికి పడిపోయింది. ఈ విజయంతో ఇంగ్లాండ్ ఆరవ స్థానానికి చేరుకుంది, వారి విజయాల శాతం 33.44గా ఉంది. డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో ఆస్ట్రేలియా అగ్రస్థానంలో కొనసాగుతుండగా, సౌత్ ఆఫ్రికా, న్యూజిలాండ్ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. భారత్ ఐదో స్థానంలో ఉంది. టీమిండియా ఇంకా ఏడు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది, అందులో ఆరు గెలిస్తే ఫైనల్‌కు అర్హత సాధిస్తుంది. శ్రీలంక, వెస్ట్ ఇండీస్, పాకిస్తాన్ జట్లు WTC ఫైనల్ రేసు నుంచి దాదాపు పూర్తిగా వైదొలిగాయి.
బాబర్ ఇజ్జత్ పాయే..
కాగా, మ్యాచ్‌కు ముందు వరకు బాబర్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. తొలి టెస్ట్‌లోనే ఆడకపోవడంతో రెండో టెస్ట్‌లో బరిలోకి దిగాడు. ఈ క్రమంలో నేను వచ్చే వచ్చాక, మ్యాచ్ మరోలా ఉంటదని, లెక్కలన్నీ మార్చేస్తానంటూ స్టేట్ మెంట్ ఇచ్చేశాడు. కానీ, రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ దారుణంగా విఫలయ్యాడు. ఈ క్రమంలో డబ్ల్యూటీసీలోనూ పాకిస్తాన్ టీం ఇజ్జత్ పోయింది. చిట్టచివరకు నిలిచి, ఫైనల్ రేసు నుంచి పూర్తి నిష్క్రమించింది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




