బంగ్లాదేశ్‌తో జరిగిన రెండు టెస్ట్ ల సిరీస్ ను దక్షిణాఫ్రికా 2-0తో క్లీన్ స్వీప్ చేసింది. రెండో టెస్టులో టాస్ గెలిచిన ఐడెన్ మార్క్రామ్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. తొలి ఇన్నింగ్స్‌లో దక్షిణాఫ్రికా అద్భుతంగా బ్యాటింగ్ చేసి 6 వికెట్లకు 575 పరుగుల వద్ద ఇన్నింగ్స్ డిక్లేర్ను చేసింది. ఆ తర్వాత బ్యాటింగ్ కు దిగిన బంగ్లాదేశ్ రెండో రోజు ఆట ముగిసే సమయానికి బంగ్లాదేశ్ 4 వికెట్ల నష్టానికి 34 పరుగులు చేసింది. దీంతో ఈ మ్యాచ్ పూర్తిగా దక్షిణాఫ్రికాకు అనుకూలంగా మారింది. మూడో రోజు రెండో సెషన్‌లో బంగ్లాదేశ్ జట్టు మొత్తం కేవలం 159 పరుగులకే ఆలౌటైంది. కాబట్టి దక్షిణాఫ్రికా పెద్ద ఆధిక్యంతో ఫాలో ఆన్ ఇచ్చింది. ఫాలో-ఆన్ లక్ష్యాన్ని పూర్తి చేయడంలో బంగ్లాదేశ్ మళ్లీ విఫలమైంది. ఆ జట్టు రెండో ఇన్నింగ్స్ లో కేవలం 143 పరుగులకే కుప్పకూలింది. దీంతో దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ 273 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. అంతేకాదు టెస్టు సిరీస్‌లో బంగ్లాదేశ్‌ను 2-0తో ఓడించి దక్షిణాఫ్రికా వైట్ వాష్ చేసింది .
దక్షిణాఫ్రికా తరఫున తొలి ఇన్నింగ్స్‌లో అత్యధికంగా 5 వికెట్లు పడగొట్టిన ఆటగాడు కగిసో రబడ. డేన్ పీటర్సన్, కేశవ్ మహరాజ్ చెరో రెండు వికెట్లు తీశారు. సెనూరన్ ముత్తుసామి ఒక వికెట్ సాధించాడు. ఇక బంగ్లాదేశ్ రెండో ఇన్నింగ్స్ లో కేశవ్ మహారాజ్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. ఏకంగా 5 వికెట్లు తీసి బంగ్లాదేశ్ వెన్ను విరిచాడు. సెనూరన్ ముత్తుసామి 4 వికెట్లు తీశాడు. డేన్ పీటర్సన్ ఒక వికెట్ తీశాడు. బంగ్లాదేశ్‌ను ఓడించిన తర్వాత దక్షిణాఫ్రికా కెప్టెన్ ఐడెన్ మార్క్రామ్ స్పందించాడు. “ఇంకా చాలా టెస్టు మ్యాచ్‌లు ఉంటాయి. ఈ సీజన్‌లో బ్యాక్ టు బ్యాక్ టెస్ట్ సిరీస్‌లు ఉన్నాయి. ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో ఫైనల్స్‌కు చేరుకోవాలని భావిస్తున్నాం’ అని ఐడెన్ మార్క్రామ్ అన్నాడు.
ఈ విజయం తర్వాత ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ 2025 పాయింట్ల పట్టిక మారిపోయింది. దక్షిణాఫ్రికా గెలుపు శాతం బాగా పెరిగింది.
న్యూజిలాండ్‌ను వెనక్కి నెట్టి దక్షిణాఫ్రికా నాలుగో స్థానానికి ఎగబాకింది. రెండు టెస్టుల సిరీస్‌లో దక్షిణాఫ్రికా ఇప్పుడు కేవలం 4 మ్యాచ్‌లు మాత్రమే ఆడాల్సి ఉంది. శ్రీలంక, పాకిస్థాన్‌లు రెండు టీమ్ మ్యాచ్‌లు ఆడనున్నాయి. ఆసక్తికరంగా ఈ మ్యాచ్‌లు దక్షిణాఫ్రికాలో జరగనున్నాయి. ప్రస్తుతం దక్షిణాఫ్రికా గెలుపు శాతం 54.17 శాతం. భారత్ విజయాల శాతం 62.82, ఆస్ట్రేలియా 62.50, శ్రీలంక 55.56, న్యూజిలాండ్ విజయ శాతం 50 శాతంగా ఉన్నాయి.
World Test Championship #WTC points table
SA have registered dominating win over BAN, with this 2-0 win SA are now front runners to get to the final. They have 4 Test at home and 3 wins will give them a very good chance of final#BANvSA pic.twitter.com/4J1X5J8fPz— Cricket baba (@Cricketbaba5) October 31, 2024
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..