WTC Final 2023: ఆస్ట్రేలియాతో జరుగుతున్న ప్రపంచ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్ ఆడుతున్న టీమిండియా ఎదుట భారి టార్గెట్ ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఓపెనర్లుగా వచ్చిన రోహిత్ శర్మ, శుభమాన్ గిల్ దూకుడుగా నాల్గో ఇన్నింగ్స్ ప్రారంభించారు. అయితే ఈ జోడీని ఆసీస్ బౌలర్ స్కాట్ బోలాండ్ విడదీశాడు. బోలాండ్ వేసిన 8వ ఓవర్ తొలి బంతిని ఆడిన గిల్(18) పెవిలియన్ చేరాడు. దీంతో టీమిండియా కీలక ఇన్నింగ్స్‌లో తమ తొలి వికెట్ కోల్పోయింది.
అయితే శుభమాన్ గిల్ ఔట్ అయిన తీరుపై సందేహాలు వ్యక్తమవుతున్నాడు. ఇదే సందేహంతో గిల్ కూడా రివ్యూకి వెళ్లాడు. గిల్ రివ్యూపై సమీక్షించిన థర్డ్ అంపైర్‌కి అల్ట్రాఎడ్జ్‌లో కెమెరా యాంగిల్‌తో పరిశీలించగా గ్రీన్ బంతిని అందుకున్నప్పటికి నేలకు తాకించినట్లు కనిపించింది. కానీ గ్రీన్ చేతి వేలు బంతి కింద ఉందని థర్డ్‌అంపైర్ మైక్‌లో ప్రకటించి బిగ్ స్క్రీన్‌పై గిల్ ఔట్ అని చూపించాడు. థర్డ్ అంపైర్ నిర్ణయం ఒక్కసారిగా అందరినీ నోరెళ్లబెట్టేలా చేసింది.
3rd umpire gives this out.
It’s OUT or NOT OUT according to you?#notout #gill #WTCFinal #WTCFinal2023 pic.twitter.com/hdYzvJeENo
— ankit gadriya (@itsankitgadriya) June 10, 2023
కాగా, కామెరూన్ పట్టిన బంతిపై నెట్టింట పెద్ద చర్చ సాగుతోంది. అంపైరింగ్ సిస్టమ్‌పై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘థర్డ్ అంపైర్ ఆసీస్ పక్షపాతి’.. ‘అంధుడైన థర్డ్ అంపైర్’.. ‘RIP థర్డ్ అంపైర్’ అంటూ రకరకాలుగా కామెంట్లతో విమర్శిస్తున్నారు. ఇంకా కామెరూన్ గ్రీన్ పట్టిన బంతి నేలకు తాకినట్లుగా కనిపిస్తున్న ఫోటోలను షేర్ చేస్తున్నారు. నెటిజన్లు, టీమిండియా అభిమానులతో పాటు మాజీ క్రికెటర్ విరేంద్ర సెహ్వాగ్ కూడా కామెరూన్ క్యాచ్‌పై స్పందించాడు. గిల్ రివ్యూపై డిసీషన్ ఇచ్చేటప్పుడు థర్డ్ అంపైర్ కళ్లకు గంతలు కట్టుకున్నట్లుగా ఉన్నాడని, గిల్ నాట్‌ఔట్ అని ట్వీట్ చేశాడు.
Third umpire while making that decision of Shubman Gill.
Inconclusive evidence. When in doubt, it’s Not Out #WTC23Final pic.twitter.com/t567cvGjub
— Virender Sehwag (@virendersehwag) June 10, 2023
మరోవైపు 444 పరుగుల భారీ టార్గెట్‌తో నాలుగో ఇన్సింగ్స్ ప్రారంభించిన భారత్ ప్రస్తుతం.. తొలి 16 ఓవర్ల ఆట ముగిసేసరికి ఓ వికెట్ కోల్పోయి 78 పరుగులు చేసింది. అలాగే క్రీజులో రోహిత్ శర్మ(38), పుజారా(19) ఉన్నారు. ఇంకా ఆటకు ఓ రోజు మిగిలి ఉండగా.. భారత్ విజయానికి మరో 366 పరుగులు అవసరం.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..