WTC Final 2023: రహానే, శార్దుల్ హాఫ్ సెంచరీలు.. తప్పిన ఫాలో ఆన్ ప్రమాదం.. తొలి ఇన్నింగ్స్‌లో ఆసీస్‌కు భారీ ఆధిక్యం..

వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC) ఫైనల్ మ్యాచ్‌లో మూడో రోజు భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 296 పరుగులకు ముగిసింది. దీంతో ఆస్ట్రేలియా జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 173 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. భారత్ నుంచి అజింక్యా రహానే (89 పరుగులు), శార్దూల్ ఠాకూర్ (51) అర్ధ సెంచరీ ఇన్నింగ్స్ ఆడి ఫాలో ఆన్ నుంచి భారత్‌ను కాపాడారు.

WTC Final 2023: రహానే, శార్దుల్ హాఫ్ సెంచరీలు.. తప్పిన ఫాలో ఆన్ ప్రమాదం.. తొలి ఇన్నింగ్స్‌లో ఆసీస్‌కు భారీ ఆధిక్యం..
Wtc Final Aus Vs Ind

Updated on: Jun 09, 2023 | 6:51 PM

వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC) ఫైనల్ మ్యాచ్‌లో మూడో రోజు భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 296 పరుగులకు ముగిసింది. దీంతో ఆస్ట్రేలియా జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 173 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. భారత్ నుంచి అజింక్యా రహానే (89 పరుగులు), శార్దూల్ ఠాకూర్ (51) అర్ధ సెంచరీ ఇన్నింగ్స్ ఆడి ఫాలో ఆన్ నుంచి భారత్‌ను కాపాడారు. వీరిద్దరి మధ్య 7వ వికెట్‌కు 109 పరుగుల భాగస్వామ్యం నెలకొంది. తొలి సెషన్‌లో భారత్‌కు అదృష్టం కలిసొచ్చింది. ఇందులో భారత బ్యాట్స్‌మెన్‌లు మూడుసార్లు ఔట్ అయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నారు.

పాట్ కమిన్స్ మూడో వికెట్లు, బోలాండ్‌కు రెండు వికెట్లు పడగొట్టాడు. ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 469 పరుగులు చేసింది.

ఇరుజట్లు:

ఇవి కూడా చదవండి

ఆస్ట్రేలియా (ప్లేయింగ్ XI): డేవిడ్ వార్నర్, ఉస్మాన్ ఖవాజా, మార్నస్ లాబుస్‌చాగ్నే, స్టీవెన్ స్మిత్, ట్రావిస్ హెడ్, కామెరాన్ గ్రీన్, అలెక్స్ కారీ(కీపర్), పాట్ కమిన్స్(కెప్టెన్), మిచెల్ స్టార్క్, నాథన్ లియాన్, స్కాట్ బోలాండ్.

భారత్ (ప్లేయింగ్ XI): రోహిత్ శర్మ(కెప్టెన్), శుభ్‌మన్ గిల్, ఛెతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ, అజింక్యా రహానే, శ్రీకర్ భరత్(కీపర్), రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, ఉమేష్ యాదవ్, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్.