WTC 2023-25 Points Table Updated after AUS vs IND 3rd Test: బ్రిస్బేన్‌లో వర్షం కారణంగా గబ్బా టెస్ట్ డ్రాగా ముగిసింది. దీంతో ఇరుజట్లు బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో 1-1తో సమంగా నిలిచాయి. గబ్బా టెస్ట్ తర్వాత టీమిండియా ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC) పట్టికలో మూడవ స్థానంలో కొనసాగుతోంది. అయితే పీటీసీ శాతం 55.88కి పడిపోయింది. అదేవిధంగా, ఆస్ట్రేలియా పీటీసీ శాతం 58.89కి పడిపోయింది. పాట్ కమిన్స్ నేతృత్వంలోని ఆస్ట్రేలియా జట్టు డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో కొనసాగుతోంది.
ఇక అగ్రస్థానం విషయానికి వస్తే దక్షిణాఫ్రికా జట్టు టాప్ లేపుతోంది. హామిల్టన్‌లో జరిగిన ఆఖరి టెస్టులో ఇంగ్లండ్‌పై ఘన విజయం సాధించిన న్యూజిలాండ్ జట్టు నాలుగో స్థానంలో నిలిచింది. ఐదో స్థానంలో శ్రీలంక కొనసాగుతోంది. అయితే, వచ్చే ఏడాది ఆస్ట్రేలియాతో జరిగే రెండు మ్యాచ్‌ల సిరీస్‌ను గెలిస్తే లంక టీం తొలి రెండు స్థానాల్లో నిలిచే అవకాశం ఉంది.
ర్యాంక్ | జట్టు | టెస్టులు | గెలిచింది | ఓడిపోయింది | డ్రా | పాయింట్లు | పీసీటీ శాతం |
1 | దక్షిణాఫ్రికా | 10 | 6 | 3 | 1 | 76 | 63.33 |
2 | ఆస్ట్రేలియా | 15 | 9 | 4 | 2 | 106 | 58.89 |
3 | భారతదేశం | 17 | 9 | 6 | 2 | 114 | 55.88 |
4 | న్యూజిలాండ్ | 14 | 7 | 7 | 0 | 81 | 48.21 |
5 | శ్రీలంక | 11 | 5 | 6 | 0 | 60 | 45.45 |
6 | ఇంగ్లండ్ | 22 | 11 | 10 | 1 | 114 | 43.18 |
7 | పాకిస్తాన్ | 10 | 4 | 6 | 0 | 40 | 33.33 |
8 | బంగ్లాదేశ్ | 12 | 4 | 8 | 0 | 45 | 31.25 |
9 | వెస్టిండీస్ | 11 | 2 | 7 | 2 | 32 | 24.24 |
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..