WPL 2025: RCB ఫ్యాన్స్ నిజ స్వరూపం ఇదే.. సంచలనం కామెంట్స్ చేసిన స్మృతి మందాన

విమెన్స్ ప్రీమియర్ లీగ్ (WPL) 2025లో టైటిల్‌ను కాపాడేందుకు RCB సన్నద్ధమవుతోంది. కెప్టెన్ స్మృతి మంధాన అభిమానుల మద్దతు, జట్టుపై నమ్మకాన్ని వ్యక్తం చేశారు. గాయాల ప్రభావం ఉన్నా, జట్టులో సమతుల్యత ఉందని, విజయం కోసం పోరాడుతామని తెలిపారు. RCB మహిళా జట్టుకు విరాట్ కోహ్లీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, వారి విజయాన్ని ఆస్వాదించాలని ప్రోత్సహించారు.

WPL 2025: RCB ఫ్యాన్స్ నిజ స్వరూపం ఇదే.. సంచలనం కామెంట్స్ చేసిన స్మృతి మందాన
Rcb

Updated on: Feb 14, 2025 | 8:07 PM

విమెన్స్ ప్రీమియర్ లీగ్ (WPL) 2025 ఈ రోజు తెరలేవనుంది. డిఫెండింగ్ ఛాంపియన్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) తమ తొలి మ్యాచ్‌లో గుజరాత్ జెయింట్స్‌తో తలపడనుంది. గత సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ (DC) పై విజయం సాధించి తొలిసారిగా టైటిల్ గెలుచుకున్న RCB, ఈసారి వరుసగా రెండో కప్పును ఎత్తేందుకు సన్నద్ధమవుతోంది. ఈ సందర్భంగా కెప్టెన్ స్మృతి మంధాన తన అభిమానుల గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.

RCB అభిమానుల ప్రత్యేకతపై మంధాన వ్యాఖ్యలు:

స్మృతి మంధాన మాట్లాడుతూ, ఇతర జట్లతో పోలిస్తే RCB అభిమానులు తమ జట్టును ఎంతగానో ఆదరించడం, అదే సమయంలో విమర్శించడం ఎక్కువగా ఉంటుందని అభిప్రాయపడ్డారు.

“మేము ప్రధానంగా మా ఆటపై దృష్టి పెడతాము. మంచి క్రికెట్ ఆడేందుకు కృషి చేస్తాము. ఎందుకంటే RCBకి ఇతర జట్ల కంటే ఎక్కువగా అభిమానం, విమర్శలు ఉంటాయి. కాబట్టి ఒక సమూహంగా కలిసి ఉండటం చాలా ముఖ్యం,” అని మంధాన అన్నారు.

RCBపై అభిమానుల నిబద్ధత గురించి మాట్లాడిన ఆమె, “ప్రతి చోటా RCB నినాదాలు వినిపించడం నిజంగా గొప్ప అనుభూతి. ఇది చాలా పెద్ద సానుకూల అంశం,” అని తెలిపారు.

గాయాల ప్రభావంపై మంధాన స్పందన

ఈ సీజన్ ప్రారంభానికి ముందు, జట్టులో కొన్ని గాయాల సమస్యలు తలెత్తాయి. అయితే ప్రస్తుత జట్టుపై మంధాన విశ్వాసం వ్యక్తం చేశారు.

గాయాలు జట్టుపై ప్రభావం చూపినప్పటికీ, తన జట్టు సమతుల్యంగా ఉంది అని వేలంలో మాకు మంచి ఆటగాళ్లు దొరికారు. యువ ఆటగాళ్లు, దేశీయ క్రికెట్లో రాణించిన ఆటగాళ్లు, విదేశీ ఆటగాళ్లతో సమతుల్యంగా ఉన్నా అని, గాయపడిన ఆటగాళ్ల కోసం ఆడాలని భావిస్తున్నాము అని విలేకరుల సమావేశంలో పేర్కొన్నారు.

విరాట్ కోహ్లీ శుభాకాంక్షలు:

WPL 2025 సీజన్‌కు ముందు, RCB పురుషుల జట్టు మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ మహిళల జట్టుకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. “గత సంవత్సరం మీరు చేసినది అద్భుతం. అదే ఉత్సాహాన్ని కొనసాగించాలని ఆశిస్తున్నాను. టైటిల్ గెలిచిన ఒత్తిడిని పక్కన పెట్టి, మీ ఆటను ఆస్వాదించండి. భారతదేశం అంతటా ఉన్న అభిమానుల మద్దతును ఆస్వాదించండి. మీ అందరికీ రాబోయే సీజన్‌ కోసం శుభాకాంక్షలు,” అని కోహ్లీ అన్నారు.

WPL 2025 సీజన్ RCBకు కీలకమైనదిగా మారనుంది. మంధాన నాయకత్వంలో మరో విజయాన్ని సాధించగలరా అనేది ఆసక్తికరంగా మారింది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..