WPLలో భారత ఆటగాళ్లకు అన్యాయం? సంచలన వ్యాఖ్యలు చేసిన మాజీ క్రికెటర్..

|

Mar 04, 2023 | 7:45 PM

Womens Premier League: మహిళల ప్రీమియర్ లీగ్ ప్రారంభానికి ముందు, భారత మాజీ కెప్టెన్ అంజుమ్ చోప్రా లీగ్‌లోని జట్లపై ప్రశ్నలు లేవనెత్తింది. మహిళల ప్రీమియర్ లీగ్ (WPL) ప్రారంభ సీజన్‌లో చాలా మంది విదేశీ ఆటగాళ్లు జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించడం పట్ల అంజుమ్ చోప్రా సంతోషంగా లేరు.

WPLలో భారత ఆటగాళ్లకు అన్యాయం? సంచలన వ్యాఖ్యలు చేసిన మాజీ క్రికెటర్..
Wpl 2023 Indian Players
Follow us on

మహిళల ప్రీమియర్ లీగ్ ప్రారంభానికి ముందు, భారత మాజీ కెప్టెన్ అంజుమ్ చోప్రా లీగ్‌లోని జట్లపై ప్రశ్నలు లేవనెత్తింది. మహిళల ప్రీమియర్ లీగ్ (WPL) ప్రారంభ సీజన్‌లో చాలా మంది విదేశీ ఆటగాళ్లు జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించడం పట్ల అంజుమ్ చోప్రా సంతోషంగా లేరు. ఈ విషయం తనకు అస్సలు నచ్చలేదని అంజుమ్ చోప్రా తెలిపింది.’చాలా జట్లు విదేశీ ఆటగాళ్లను కెప్టెన్‌లుగా ఎంపిక చేసుకోవడం నాకు నచ్చలేదు.. ఇది ఇండియన్ లీగ్, భారత పరిస్థితుల్లో నిర్వహిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో భారత ఆటగాళ్లను కెప్టెన్లుగా ఉంచాల్సింది’ అంటూ పేర్కొంది.

ముంబై ఇండియన్స్ హర్మన్‌ప్రీత్ కౌర్‌ని, బెంగళూరు స్మృతి మంధానని తమ సారథులు నియమించుకున్నాయి. మరోవైపు, ఇతర జట్లు ఆస్ట్రేలియా ఆటగాళ్లపైనే నమ్మకం ఉంచాయి. ఇందులో మెగ్ లానింగ్ (ఢిల్లీ క్యాపిటల్స్), బెత్ మూనీ (గుజరాత్ జెయింట్స్), అలిస్సా హీలీ (యూపీ వారియర్స్) కెప్టెన్‌గా వ్యవహరించనున్నారు.

దీప్తిని కెప్టెన్‌గా చేయాల్సింది..

అంజుమ్ మాట్లాడుతూ, ‘దీప్తి శర్మ (యూపీ వారియర్స్)ని కెప్టెన్‌గా చేసి ఉండాల్సిందని నేను నమ్ముతున్నాను. మహిళల టీ20 ఛాలెంజ్‌లో ఆమె జట్టుకు నాయకత్వం వహించింది’ అంటూ చెప్పుకొచ్చింది. అయితే ఆరుసార్లు టీ20 ప్రపంచకప్ విజేత ఆస్ట్రేలియాలో భారతీయుల కంటే అనుభవజ్ఞులైన ఆటగాళ్లు ఉన్నారని అంజుమ్ అంగీకరించింది. ‘ఆస్ట్రేలియన్ ఆటగాళ్లు ప్రపంచ ఛాంపియన్‌లు, వారి దేశంలోని ప్రముఖ జట్లను నడిపిన అనుభవం వారికి ఉంది. ఆస్ట్రేలియా ఆటగాళ్ల అనుభవంతో నేను పూర్తిగా ఏకీభవిస్తున్నాను. ఆస్ట్రేలియా ఆటగాళ్లకు ఉన్నంత కెప్టెన్సీ సామర్థ్యం భారత ఆటగాళ్లకు లేదు. కానీ, భారత్‌లో ఫ్రాంచైజీ ఆధారిత టోర్నమెంట్‌ను ఆడుతున్నందున ఇది భారత ఆటగాళ్లకు ఎల్లప్పుడూ సవాలుగా ఉంటుంది’ అంటూ చెప్పుకొచ్చింది.

ఇవి కూడా చదవండి

అండర్-19 ఆటగాళ్లకు ప్రయోజనం!

దేశవాళీ ఆటగాళ్లు దిగ్గజాలతో ఆడేందుకు ఇదొక మంచి అవకాశమని అంజుమ్‌ పేర్కొంది. ఆమె మాట్లాడుతూ, ‘ఈ లీగ్‌లో ముఖ్యంగా చూడాల్సింది అండర్-19 ఆటగాళ్ల గురించి. ఈ క్రీడాకారులు అండర్-19 ప్రపంచ కప్‌ను గెలుచుకున్నారు. ఫ్రాంచైజీ క్రికెట్‌లో ఆడుతున్నారు. అక్కడ వారు మెగ్ లానింగ్, బెత్ మూనీ, హర్మన్‌ప్రీత్ కౌర్ వంటి ఆటగాళ్లతో ఆడే అవకాశం పొందుతారు. ఇది చాలా పెద్ద విషయం. భారత దేశవాళీ ఆటగాళ్లు ఎలా రాణిస్తారో చూడాలి, విదేశీ ఆటగాళ్లు తెలుసు. కానీ, భారత దేశవాళీ ఆటగాళ్ల గురించి పెద్దగా తెలియదు. డబ్ల్యూపీఎల్ భారత మహిళల క్రికెట్‌లో పెద్ద మార్పును తీసుకువస్తుందని’ అంజుమ్ అభిప్రాయపడింది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..