డబ్ల్యూపీఎల్ 2023లో అంతర్జాతీయ మహిళా దినోత్సవం తొలిసారిగా నిర్వహించబడుతున్న దృష్ట్యా ప్రత్యేక నిర్ణయం తీసుకున్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సం నాడు అంటే మార్చి 8, 2023న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ గుజరాత్ జెయింట్స్ మధ్య జరిగే మ్యాచ్ టిక్కెట్లు ఉచితంగా అందించేందుకు బీసీసీఐ సిద్ధమైంది. మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు.
మహిళల ప్రీమియర్ లీగ్‌లో ఇప్పటికే మహిళలకు టిక్కెట్లు ఉచితంగా అందిస్తున్నారు. అన్ని వయసుల మహిళలకు ఉచితంగా మ్యాచ్‌లను వీక్షించేందుకు అనుమతించారు. కేవలం పురుష ప్రేక్షకులు మాత్రమే రూ. 100 నుంచి రూ. 400ల వరకు టిక్కెట్లు తీసుకోవాల్సి వచ్చేది. అయితే అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున స్త్రీ, పురుషులిద్దరికీ టిక్కెట్లు ఉచితంగా అందిస్తున్నారు.
WPL 2023 నాల్గవ మ్యాచ్‌లో, ముంబై ఇండియన్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును 9 వికెట్ల తేడాతో సులభంగా ఓడించి రెండవ విజయాన్ని నమోదు చేసిన సంగతి తెలిసిందే. తొలుత బ్యాటింగ్ చేసిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు 18.4 ఓవర్లలో అన్ని వికెట్లు కోల్పోయి 155 పరుగులు చేసింది. జవాబుగా ముంబై ఇండియన్స్ 14.2 ఓవర్లలో 159/1 స్కోరు చేసి విజయం సాధించింది. దీంతో టోర్నీలో ఆర్‌సీబీ వరుసగా రెండో భారీ ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. మరోవైపు, గుజరాత్ జెయింట్స్ గురించి మాట్లాడితే.. వరుసగా రెండు మ్యాచ్‌లలో ఓడిపోయింది.
What better way to celebrate Women’s Day than witnessing a thrilling game at the #TATAWPL! ? ?
Book your FREE ticket ?️ on https://t.co/Dm5YwpqzR0
Entry on first come first serve basis.#GGvRCB pic.twitter.com/reUwX6Pn3P
— Women’s Premier League (WPL) (@wplt20) March 7, 2023
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..