World Cup 2023: అఫ్గాన్‌ భూకంప బాధితులకు రషీద్‌ ఖాన్‌ భరోసా.. ప్రపంచకప్‌ మ్యాచ్ ఫీజు మొత్తం విరాళం

అఫ్గానిస్తాన్‌లో సంభవించిన పెను భూకంపం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఇప్పటివరకు ఈ ఘటనలో దాదాపు 3000 పైగా మృతి చెందారు. లక్షలాది మంది నిరాశ్రయులై రోడ్డున పడ్డారు. ముఖ్యంగా రిక్టర్‌ స్కేల్‌పై 6.3 తీవ్రతతో వరుస ప్రకంపనలతో హెరాత్‌ ఫ్రావిన్స్‌ అల్లాడిపోయింది. ఒక్కసారిగా వందల ఇళ్లు నేలమట్టమయ్యాయి. ఇక్కడే మృతుల సంఖ్య ఎక్కువగా ఉంటోంది. కాగా అఫ్గాన్‌లో ఎక్కడ చూసినా నేలకూలిన ఇళ్లే దర్శనమిస్తున్నాయి.

World Cup 2023: అఫ్గాన్‌ భూకంప బాధితులకు రషీద్‌ ఖాన్‌ భరోసా.. ప్రపంచకప్‌ మ్యాచ్ ఫీజు మొత్తం విరాళం
Rashid Khan

Updated on: Oct 11, 2023 | 11:10 AM

అఫ్గానిస్తాన్‌లో సంభవించిన పెను భూకంపం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఇప్పటివరకు ఈ ఘటనలో దాదాపు 3000 పైగా మృతి చెందారు. లక్షలాది మంది నిరాశ్రయులై రోడ్డున పడ్డారు. ముఖ్యంగా రిక్టర్‌ స్కేల్‌పై 6.3 తీవ్రతతో వరుస ప్రకంపనలతో హెరాత్‌ ఫ్రావిన్స్‌ అల్లాడిపోయింది. ఒక్కసారిగా వందల ఇళ్లు నేలమట్టమయ్యాయి. ఇక్కడే మృతుల సంఖ్య ఎక్కువగా ఉంటోంది. కాగా అఫ్గాన్‌లో ఎక్కడ చూసినా నేలకూలిన ఇళ్లే దర్శనమిస్తున్నాయి. రోడ్డుపై జనాలు అల్లాడిపోతున్నారు. దీంతో ఐక్యరాజ్య సమితితో సహా పలు స్వచ్ఛంద సంస్థలు భూకంప బాధితులను ఆదుకునేందుకు ముందుకొస్తున్నాయి. ఈ నేపథ్యంలో అఫ్గానిస్థాన్‌ స్టార్ స్పిన్నర్ రషీద్‌ఖాన్‌ తన గొప్ప మనసును చాటుకున్నాడు. భారీ భూకంపంతో అల్లాడిపోతున్న తన దేశానికి చేతనైన సాయం చేస్తానని భరోసా ఇచ్చాడు. ఇందులో భాగంగా తన ప్రపంచకప్ ఫీజు మొత్తాన్ని భూకంప బాధితులకు విరాళంగా ఇస్తున్నట్లు సోషల్‌ మీడియా వేదికగా ప్రకటించాడు రషీద్ ఖాన్‌. అఫ్గానిస్థాన్‌లోని పశ్చిమ ప్రావిన్సుల్లో భూకంపం తనను కలచివేసిందని ఈ పోస్టులో ఆవేదన వ్యక్తం చేశాడీ స్టార్‌ స్పిన్నర్‌. అంతేకాదు ఈ ఘోర ప్రకృతి విపత్తు కారణంగా రోడ్డున పడిన వాళ్లను ఆదుకునేందుకు త్వరలోనే నిధుల సేకరణ కూడా చేపడతానని రషీద్‌ పేర్కొన్నాడు. ఇందుకోసం తన స్నేహితులతో కలిసి త్వరలోనే ప్రచారాన్ని ప్రారంభిస్తానన్నాడు. భూకంప బాధితులను ఆదుకునేందుకు ముందుకొచ్చిన రషీద్‌ ఖాన్‌పై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది.

ఇక ప్రపంచకప్‌లో ఇవాళ (అక్టోబర్‌ 11) టీమిండియాతో తలపడనుంది అఫ్గానిస్తాన్‌. ధర్మశాల వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆ జట్టు పరాయజం పాలైంది. మొదట బ్యాటింగ్‌ చేసిన ఆ జట్టు కేవలం 156 పరుగులకే కుప్పకూలింది. ఆ తర్వాత బంగ్లాదేశ్‌ తేలికగా టార్గెట్‌ను ఛేదించింది. కాగా ఇవాళ్టి మ్యాచ్‌లో గెలుపొందడం అఫ్ఘానిస్తాన్‌కు చాలా కీలకం. దేశ రాజధాని ఢిల్లీలోని అరుణ్ జైట్లీ అంతర్జాతీయ స్టేడియంలో ఈ మ్యాచ్‌ జరగనుంది. బుధవారం మధ్యాహ్నం 2 గంటలకు మ్యాచ్‌ ప్రారంభం కానుంది.

ఇవి కూడా చదవండి

ఇరుజట్ల ప్రాబబుల్ ప్లేయింగ్ 11..

భారత్ :

రోహిత్ శర్మ (కెప్టెన్), ఇషాన్ కిషన్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా, హార్దిక్ పాండ్యా, రవిచంద్రన్ అశ్విన్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్.

ఆఫ్ఘనిస్తాన్ :

హష్మతుల్లా షాహిదీ (కెప్టెన్), ఇబ్రహీం జద్రాన్, రహ్మానుల్లా గుర్బాజ్, రహమత్ షా, నజీబుల్లా జద్రాన్, మహ్మద్ నబీ, రషీద్ ఖాన్, నూర్ అహ్మద్, ముజీబ్ ఉర్ రెహ్మాన్, ఫజల్హాక్ ఫరూకీ, నవీన్-ఉల్-హక్.

భూకంప బాధితులకు అండగా ఉంటా..

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..