ప్రతిష్ఠాత్మక వన్డే ప్రపంచ కప్ ప్రారంభం కావడానికి మరికొన్ని రోజులు మిగిలి ఉన్నాయి. ఈ మెగా క్రికెట్ టోర్నీ కోసం ఇప్పటికే అన్ని జట్లు భారత్ కు చేరుకుంటున్నాయి. కాగా ఈ టోర్నీలో హాట్ ఫేవరేట్‌గా బరిలోకి దిగుతున్న జట్లలో ఆస్ట్రేలియా కూడా ఒకటి. అయితే ఈ జట్టుకు గాయల బెడద కంగారూ కలిగిస్తోంది. ఇటీవల కొందరు ఆటగాళ్లు గాయాల నుంచి కోలుకుని తిరిగి జట్టులోకి వచ్చారు. అదే సమయంలో కొందరు ఆటగాళ్లు గాయాలతో ఇప్పటికీ బాధపడుతున్నారు. తాజాగా ఆ జట్టు మ్యాచ్ విన్నర్ అష్టన్ అగర్ గాయం కారణంగా ప్రపంచకప్‌కు దూరమయ్యాడు. ఆసీస్ తరఫున భారత మైదానాల్లో అగర్‌కు అద్భుతమైన రికార్డు ఉంది. ఈ నేపథ్యంలో వన్డే ప్రపంచకప్ కు అగర్ అందుబాటులో లేకపోతే ఆసీస్‌కు ఎదురుదెబ్బేనని భావించవచ్చు. కాగా అష్టన్ అగర్ గతంలోనే గాయపడ్డాడు. అయితే ప్రపంచకప్ నాటికి అతడు ఫిట్‌గా ఉంటాడని టీమ్ మేనేజ్‌మెంట్ భావించింది. అయితే అతను కూడా గాయం నుంచి కోలుకోలేదు. దీంతో ఆష్టన్ అగర్ మొత్తం టోర్నీ నుంచి నిష్క్రమించాడు.ఇప్పటికే భారత్‌తో జరిగిన మూడు వన్డేల సిరీస్‌ను కంగారూలు కోల్పోయారు. చివరి వన్డేలో విజయం సాధించిన ఆస్ట్రేలియా అంతకుముందు వరుసగా రెండు మ్యాచ్‌ల్లో ఓడిపోయింది.
ఇక ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియా తొలి మ్యాచ్ భారత్‌తో జరగనుంది. చెన్నైలోని చిదంబరం స్టేడియం వేదికగా ఇరు జట్ల మధ్య తొలి మ్యాచ్ అక్టోబర్ 8న జరగనుంది. దీనికి ముందు కంగారూ జట్టు 2 ప్రాక్టీస్ మ్యాచ్‌లు ఆడనుంది. సెప్టెంబర్ 30న నెదర్లాండ్స్‌తో ఒక మ్యాచ్, అక్టోబర్ 3న పాకిస్థాన్ జట్టుతో మరో మ్యాచ్ ఆడనుంది.
పాట్ కమిన్స్ (కెప్టెన్), స్టీవ్ స్మిత్, అలెక్స్ కారీ, జోష్ ఇంగ్లిస్, సీన్ అబాట్, కామెరాన్ గ్రీన్, జోష్ హేజిల్‌వుడ్, ట్రావిస్ హెడ్, మిచ్ మార్ష్, గ్లెన్ మాక్స్‌వెల్, మార్కస్ స్టోయినిస్, డేవిడ్ వార్నర్, ఆడమ్ జంపా, మిచెల్ స్టార్క్ .
Marnus Labuschagne set to replace Ashton Agar in the Australian World Cup squad.
Travis Head retains his spot! (Code Sports). pic.twitter.com/in4GhRvBLG
— Mufaddal Vohra (@mufaddal_vohra) September 28, 2023
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..