సెమీస్‌లోకి అడుగుపెట్టిన భారత్!

ఎడ్జ్‌బాస్టన్: ప్రపంచకప్‌లో భాగంగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో భారత్ 28 పరుగుల తేడాతో విజయం సాధించింది. భారత్ నిర్దేశించిన 315 పరుగుల లక్ష్య ఛేదనలో భాగంగా బంగ్లాదేశ్ 286 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో బంగ్లాదేశ్ టోర్నీ నుంచి నిష్క్రమించగా.. భారత్ సెమీస్‌కు దూసుకెళ్లింది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్‌కు దిగిన భారత్ నిర్ణీత 50 ఓవర్లకు 9 వికెట్లు నష్టపోయి 314 పరుగులు చేసింది. రోహిత్ శర్మ (104; 92 బంతుల్లో 7 ఫోర్లు, 5 […]

సెమీస్‌లోకి అడుగుపెట్టిన భారత్!

Updated on: Jul 02, 2019 | 11:30 PM

ఎడ్జ్‌బాస్టన్: ప్రపంచకప్‌లో భాగంగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో భారత్ 28 పరుగుల తేడాతో విజయం సాధించింది. భారత్ నిర్దేశించిన 315 పరుగుల లక్ష్య ఛేదనలో భాగంగా బంగ్లాదేశ్ 286 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో బంగ్లాదేశ్ టోర్నీ నుంచి నిష్క్రమించగా.. భారత్ సెమీస్‌కు దూసుకెళ్లింది.

టాస్ గెలిచి మొదట బ్యాటింగ్‌కు దిగిన భారత్ నిర్ణీత 50 ఓవర్లకు 9 వికెట్లు నష్టపోయి 314 పరుగులు చేసింది. రోహిత్ శర్మ (104; 92 బంతుల్లో 7 ఫోర్లు, 5 సిక్సర్లు) మెరుపు సెంచరీతో చెలరేగగా.. కేఎల్ రాహుల్ (77; 92 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్), రిషబ్ పంత్ (41 బంతుల్లో 48 పరుగులు, 6 ఫోర్లు, 1 సిక్స్)లు రాణించారు. అటు బంగ్లా బౌలర్లలో ముస్తాఫిజుర్ 5 వికెట్లు తీయగా… షకీబ్, రూబెల్, సౌమ్య సర్కార్‌ చెరో వికెట్ పడగొట్టారు.

అనంతరం లక్ష్యఛేదనలో భాగంగా బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్ ఆరంభంలో దూకుడుగానే ఆడింది. కానీ భారత్ బౌలర్లు కీలక సమయాల్లో వికెట్లు తీయడంతో.. ఆ జట్టుకు ఓటమి తప్పలేదు. అటు బంగ్లా బ్యాట్స్‌మెన్లలో షకీబ్ అల్ హసన్ (66; 74 బంతుల్లో 6 ఫోర్లు), సైఫుద్దీన్ (51; 38 బంతుల్లో 9 ఫోర్లు)లు చక్కటి ప్రదర్శన కనబరిచారు. ఇక భారత బౌలర్లలో బుమ్రా 4 వికెట్లు తీయగా… హార్దిక్ పాండ్య 3 వికెట్లు.. భువనేశ్వర్, షమీ, చాహల్‌లు తలో వికెట్ పడగొట్టారు. ప్లేయర్ అఫ్ ది మ్యాచ్ రోహిత్ శర్మకు దక్కింది.